Jani Master Case: ‘ఢీ ఫేమ్ తో వచ్చి మాస్టర్నే డీఫేమ్ చేస్తుంది’ జానీ మాస్టర్ వివాదంలోకి శేఖర్ బాషా ఎంట్రీ !

Jani Master Case: గత మూడ్నాలుగు రోజులుగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ వైడ్ గా ఎంతోమంది స్టార్ హీరోస్, హీరోయిన్స్ తో పని చేసి ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్.. నేడు లైంగిక ఆరోపణలెదుర్కొంటున్నారు. ఆయన దగ్గర గతంలో పనిచేసిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా హింసించాడనే ఒక లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసింది. దీంతో ఆయనపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆ లేడీ కొరియోగ్రాఫర్ కు సపోర్టుగా నిలుస్తూ.. జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. ఈ వివాదంపై తొలిసారి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషా స్పందించారు. తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారమే ఎలిమినేట్ అయినా.. శేఖర్ బాషా బయట పుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వరసగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. బిజీబిజీగా మారారు. బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరోసారి తాను బయటికి కారణం వెల్లడించారు. తానే కావాలని బయటకు వచ్చానని అన్నారు. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లో తనకు సరైన పుడ్ దొరకలేదనీ, హౌస్ లో అందరు నాన్ వెజిటేరియన్స్.. అందులో తాను ఒక్కడినే వెజిటేరియన్ అని.. తనకు సపరేట్ గా చేయమని చెప్పలేక.. గట్టిగా అడగలేను. ఒక్కో రోజు క్యాబేజీ, క్యారెట్ ముక్కలు తినేవాడిని, తొలివారం తన దగ్గర ప్రొటిన్ పౌడర్ ఉన్న..రెండో వారం ఆ పౌడర్ ను తీసేసుకున్నారని అన్నారు.

Bigg Boss 8 contestant RJ Shekhar Basha reacts on Tollywood choreographer Johnny Master controversy

ఈ క్రమంలో రాజ్ తరుణ్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల తనకు పాపులర్టీ వచ్చింది గానీ, బిగ్ బాస్ వెళ్లడం కోసం, పాపులర్టీ కోసం గానీ ఆ ఈష్యూను రైజ్ చేయలేదని అన్నారు. బిగ్ బాస్ వెళ్లక ముందే.. ప్రాబ్లెమ్ కోర్టుకు వెళ్లిందనీ, ఒక్కవేళ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే.. దీపావళి టపకాయలా ఏదో బాంబు వేయి వస్తానని రాజ్ తరుణ్ కు మాట ఇచ్చానని, కానీ ఆ అవసరం రాలేదనీ, తానే బీబీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాననీ అన్నారు. తొలుత రాజ్ తరుణ్ విషయంలో ఎలాంటి వాస్తవాలు తెలియదు. యుద్దంలోకి దిగుతే.. ఆయుధాలు వాటంతట అవే వస్తాయి అన్నట్టు.. ఆధారాలు అవే వచ్చాయని అన్నారు. చాలా లోతున ఈ అంశాన్ని పరిశీలించి మీడియా ముందుకు తీసుకవచ్చామని అన్నారు.

గత మూడు నాలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఆంశం జానీ మాస్టర్ వివాదంపై మగజాతి ఆణిముత్యం ఆర్జే శేఖర్ బాషా తొలిసారి స్పందించారు. 'ఢీ ఫేమ్ తో వచ్చి మాస్టర్నే డీఫేమ్ చేస్తుంది' అని అన్నారు. మీడియా కథనాలను బట్టి చూస్తే.. ఏదో కుట్రగా ఉందని అన్నారు. ఆ లేడీ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేసింది. ఆ సమయంలో ఈ ఫిర్యాదు చేయకుండా ఇప్పుడేందుకు మాట్లాడుతుందని అన్నారు. జానీ మాస్టర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే.. తొలిసారే పోలీసులకి ఫిర్యాదు చేయాల్సింది అని అన్నారు. కానీ, అమ్మాయి ట్రాక్ రికార్డ్ చూస్తే.. గతంలో ఇలాంటి పనులు చేసినట్టు తనకు తెలియడం లేదన్నారు శేఖర్ బాషా.

Bigg Boss 8 contestant RJ Shekhar Basha reacts on Tollywood choreographer Johnny Master controversy

అమ్మాయి తరుపున న్యాయం ఉంటే.. అమ్మాయికే సపోర్టు ఇస్తానని అన్నారు. వారి మధ్య ఎదో జరిగి ఉండవచ్చనీ, లేకపోతే.. ఇన్నిరోజులు లేనిది ఈ రోజు పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టడమేంటని అన్నారు. మాస్టర్ నుంచి ఏదైనా ఆశించి, అది జరగపోతే.. బెదిరింపులకు పాల్పడుతుందా ? అనే అనుమానం వస్తుందన్నారు. ఈ తరుణంలో జానీ మాస్టర్ పై లవ్ జీహాదీ.. మత మార్పిడి ఆరోపణలను కొట్టి పారేశారు. ఆయన రాజకీయాల్లో యాక్టింగ్ గా ఉంటారు. కాబట్టే.. ఆయనను రాజకీయ కోణంలో దాడి చేస్తున్నారని అన్నారు.

ఏ వ్యక్తినైనా కుల, మత, ప్రాంతం పేరుతో దాడి చేయవచ్చు. నేడు మహిళలను అడ్డు పెట్టుకుని దాడి చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తన కొడుకు పుట్టిన ఆ హ్యాపీ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాననీ, ఇప్పటికే ఈ విషయంపై మాట్లాడమని చాలామంది ఫోన్లు చేస్తున్నారని, తమ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పతున్నారు. కచ్చితంగా ఈ వివాదంపై మాట్లాడానికి మీడియా ముందుకు వస్తాననీ, వారం లేదా పది రోజులలో సరైన ఆధారాలు సేకరిస్తానని అన్నారు. ఎది తప్పో.. ఏది ఒప్పో తెల్చేస్దాం అన్నారు. జానీ మాస్టర్ వివాదంలో ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇస్తే.. రచ్చ రచ్చు.. రిజల్ట్ కూడా మరోలా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss jani master case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X