‘హోస్ట్‌గా నాగార్జున ఉండొద్దు.. ఆయన ఉంటే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టను’
యంగ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. జార్జిరెడ్డి చిత్రంలో నటించిన ఈ బ్యూటీ నటన పరంగా మంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో జార్జిరెడ్డి సిస్టర్ పాత్రలో అలరించింది. 2019లో విడుదలైన చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సోనియాకు కూడా ఆ చిత్రంతో మంచి పేరే వచ్చింది. అక్కడి నుంచి సోనియా కెరియర్ కాస్త బెటర్ వేలో కొనసాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై అలరిస్తూ వస్తుంది.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో ఏకంగా రెండు చిత్రాల్లో నటించి హాట్ టాపిక్ గా మారింది. కరోనా వైరస్, ఆశ ఎన్కౌంటర్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు ఆర్జీవి వరల్డ్ లో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అలా నటిగా తన కెరియర్ ను సోనియా ఎస్టాబ్లిష్ చేసుకుంది. రూప సౌందర్యంలో తెలుగు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఈ బ్యూటీకి టెలివిజన్ షో లోనూ అవకాశం దక్కింది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో లో అవకాశం దక్కించుకుంది.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఎనిమిదవ సీజన్లో సోనియా ఆకుల కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. హౌస్ లో ఏకంగా నాలుగు వారాల పాటు ఉండి బుల్లితెర ఆడియన్స్ ను అలరించింది. ప్రతి టాస్క్ లోను తన నైపుణ్యాన్ని చూపిస్తూ ఆకట్టుకుంది. ఆ సీజన్లో 28వ రోజున సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత స్టార్ మా లో విజయవంతంగా ప్రసారమైన ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లోను కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇలా వెండితెరపై, బుల్లితెరపై మెరిసి సోనియా ప్రేక్షకుల్లో కాస్త గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె చేతుల్లో ఎలాంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్టు కనిపించడం లేదు. మాత్రం ఈవెంట్లలో మాత్రం కనిపిస్తూ సందడి చేస్తోంది.
ప్రస్తుతం మాత్రం ఆర్టిస్ట్ అనే సినిమాతో మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలోని బిగ్ బాస్ 9 షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా అంటూ ప్రశ్న ఎదురైంది. దానికి సోనియా స్పందిస్తూ.... ఈసారి బిగ్ బాస్ షోకు నాగార్జున సార్ హోస్ట్ గా ఉంటే తను పార్టిసిపేట్ చేయొద్దని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. కొన్ని విషయాల్లో నాగార్జున సార్ డెసిషన్స్ భిన్నంగా ఉంటున్నాయని అభిప్రాయపడింది. లాస్ట్ సీజన్లో గౌతమ్ది ఏం తప్పులేకున్నా షట్ అప్ అంటూ నోరు మూయించడం తనకేం నచ్చలేదని తెలిపింది.
నాకు సార్ చాలా సాఫ్ట్ పర్సన్ అని సెన్సిటివ్ ఇష్యూస్ ను హ్యాండిల్ చేయడంలో కాస్త తడబడతారని, సరిగా డీల్ చేయరని అభిప్రాయపడింది. కంటెస్టెంట్ లో కూడా ఆలోచించే స్పేస్ ఇచ్చి, తమ స్టేట్మెంట్స్ ను పరిగణలోకి తీసుకొని తీర్పులు ఇవ్వాలని కోరింది. అది నాగార్జున గారు హోస్ట్ చేసిన సీజన్లో కనిపించలేదని డైరెక్ట్ గా చెప్పేసింది. కానీ నెక్స్ట్ సీజన్లో రానా దగ్గుబాటి హోస్ట్ గా వస్తుండడం కొంత ఆశాజనకంగా ఉందని చెప్పింది. రానా సెన్సిటివ్ ఇష్యూస్ ని చాలా సులువుగా హ్యాండిల్ చేస్తారని నమ్ముతున్నట్టు తెలిపింది. ఇక సీజన్ ఎలా జరుగుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది.


Click it and Unblock the Notifications











