Bigg Boss Telugu 8 Promo:నామినేషన్ల పర్వంతో హీటెక్కిన బిగ్ బాస్..యష్మీకి సూపర్ పవర్..నిఖిల్,ప్రేరణ మధ్య వార్.!
Bigg Boss Telugu 8 Promo: బిగ్ బిగ్ .. బిగ్ బాస్.. బిగ్బాస్ సీజన్ 8 తెలుగు విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో వారం తొలి రోజే నామినేషన్స్ హీటెక్కింది. ఇప్పటికే సోనియా, సీత, శేఖర్ భాష, విష్ణు ప్రియా వారి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయగా... తాజాగా బిగ్ బాస్ ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశాడు. ఇందులో మిగిలిన కంటెస్టెంట్స్ నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, నైనికా, యష్మీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం చూపించారు. తాజాగా విడుదలైన రెండో ప్రోమోలో కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు బిగ్బాస్. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ట్వీస్టుల మీద ట్వీసులతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండో వారం తొలి రోజు బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టారు. ఈ ఊహించని విధంగా హౌస్ మేట్స్ నామినేషన్ల పర్వాన్ని ప్రారంభించారు. గత ఎపిసోడ్ లో సోనియా, కిర్రాక్ సీత, ఆర్జే శేఖర్ భాష, యాంకర్ విష్ణు ప్రియా నామినేషన్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కంటెస్టెంట్స్ నిఖిల్, నైనికా, యష్మీ , ప్రేరణ, పృథ్వీ లు నామినేషన్స్ పాల్గొనాల్సి ఉంది. తాజాగా బిగ్ బాస్ నామినేషన్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో విడుదలైంది. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

నామినేషన్ ప్రక్రియలో దిమ్మతిరిగే ట్వీసులే కాదు ఊహించని షాకులు కూడా ఇస్తున్నారు బిగ్ బాస్. నామినేషన్ల పర్వం ముగియగానే.. కంటెస్టెంట్స్ ఫుడ్ ను లాగేసుకున్నాడు బిగ్ బాస్. ఈ రోజు నామినేషన్స్ లో పృథ్వీ వర్సెస్ మణికంఠగా సాగింది. మణికంఠను పృథ్వీ నామినేట్ చేశాడు. క్లాన్ విషయంలో మణికంఠకు నిఖిల్ కు వార్ మొదలైంది. దీంతో నిఖిల్ ను కాదని నైనికా టీమ్ లోకి వెళ్ళాలని మణికంఠ భావించారని, ఇది వెన్నుపోటు వ్యవహారమే అంటూ..ఈ విషయంలో మణికంఠ నచ్చలేదని, మణికంఠను పృథ్వీ నామినేట్ చేశాడు.దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.
మరోవైపు.. ప్రేరణ వర్సెస్ నిఖిల్ గా మాటల యుద్దం సాగింది. నిఖిల్ అసలు కారణం చెప్పేలోపే డస్ట్ బిన్ గురించి అంటూ ప్రేరణ అడ్డుపడింది. కానీ, అసలు విషయం చెప్పాడు.నిఖిల్ తన టాస్క్ మధ్యలో క్లారిటీ ఉండదంటూ కారణం చెప్పడంతో సైలెంట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నబీల్ వర్సెస్ పృథ్వీ గా గేమ్ సాగింది. ఆ తర్వాత పృథ్వీ,ప్రేరణ ఏదో విషయంలో వాదించుకుంటే.. మధ్యలో యష్మీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తన స్టనింగ్ కామెంట్స్ తో కంటెస్టెంట్లందర్నీ తనవైపు చూసేలా చేసింది నైనిక. తాను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం రాలేదంటూ.. పవర్ పుల్ డైలాగ్స్ చేసింది.
ఇదిలా ఉంటే.. చీఫ్ యష్మీ లక్కీ చాన్స్ కొట్టేసింది.ఆమెకు సూపర్ పేరిట.. నామినేషన్ లో నామినేట్ అయినా వారిని బయటకు తీసుకురావచ్చు. సేఫ్ గా ఉన్నా వారిలో ఒకరిని నామినేట్ చేయవచ్చని యష్మీకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ పవర్ తో ఎవరిని నామినేట్ చేస్తారో.. ఎవరిని సేవ్ చేస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











