Bigg Boss 8 Telugu: యష్విని కడిగిపడేసిన గంగవ్వ..గౌతమ్ విషయంలో గూబగుయ్ అనిపించేలా!

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ గ్రాండ్‌గా 10వ వారంలోకి ప్రవేశించింది. తొమ్మిది వారం ఎలిమినేషన్ తర్వాత ఎప్పటిలానే నామినేషన్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు కత్తుల దూసుకొన్నారు. మాటకు మించి మాటతో వాగ్వాదానికి దిగారు. దాంతో 10వ వారం నామినేషన్ ప్రక్రియ కూడా తీవ్ర వాగ్వాదం మధ్య ముగిసినట్టు తెలిసింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ గురించిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఇంటిలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఎమోషనల్‌గా ముగిసింది. వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చిన నయని పావని మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆట తీరు సరిగా ఉన్న ఓటర్లను, ఫాలోవర్స్ నుంచి ఓట్లు సంపాదించుకపోయిందని కారణాలు చెబుతున్నారు. అలా నయని పావని ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

Bigg Boss 8 Telugu 10th Week nominations Gangavva pushes Yashwi Into elimination zone

బిగ్‌బాస్ ఇంటిలో 10వ వారం నామినేషన్ ప్రక్రియలో ప్రధానంగా హరితేజ, యష్వి, ప్రేరణ, నబీల్ మధ్య వాగ్వాదం జోరుగా కనిపించింది. గొంతెత్తి చించుకొంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొన్నారు. తమపై వచ్చిన విమర్శలను, నామినేషన్ పాయింట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రేరణతో హరితేజ వాగ్వాదం కొంత సీరియస్‌గానే సాగింది.

గంగవ్వ తన నామినేషన్ విషయంలో సీరియస్ స్పందించింది. నేను యష్విని నామినేట్ చేస్తున్నాను. గౌతమ్ విషయంలో ఆట సమయంలో గెలిస్తే సరి. లేదంటే చించి సంచి కోసుకొంటావు అని గంగవ్వ అంది. గంగవ్వ నామినేషన్ చేస్తుంటే.. ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. యష్వి కూడా నామినేషన్ చేసిందనే బాధ లేకుండా నవ్వుల్లో మునిగిపోయింది.

Bigg Boss 8 Telugu 10th Week nominations Gangavva pushes Yashwi Into elimination zone

ప్రేరణను హరితేజ నామినేట్ చేస్తూ.. మైండ్ గేమ్‌తో ఆడుతున్నారు. నాపై పూర్తిగా విద్వేషంతో ఉన్నారు. నాపై ఎందుకు అంత ద్వేషం. ఈ విషయాన్ని పక్కన పెట్టి.. కొంత గేమ్ మీద, వేరే వారి మీద కాన్‌సంట్రేట్ చేయండి. దరిద్రమైన బూతులు మాట్లాడకు. మీ వ్యవహర తీరు అర్ధం కాలేదు. విద్వేషం, నాపై ద్వేషం తొలగించండి. ఈ రోజుతో వాటిని కడిగేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను అని హరితేజ అన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో 10వ వారం నామినేషన్‌లో ప్రేరణ, రొహిణి, నబీల్, హరితేజ, యష్వి తదితరులు నామినేట్ అయ్యారు. అవినాష్ చీఫ్ అయ్యారు కనుక నామినేషన్ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవతారనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X