Bigg Boss 10th Week Voting: డేంజర్ జోన్‌లో ముగ్గురు టాప్ కంటెస్టెంట్లు..మళ్లీ వైల్డ్ కార్డ్ ఎలిమినేషన్ తప్పదా?
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో 10వ వారం నామినేషన్స్ రంజుగా సాగుతున్నాయి. ఈ వారం నామినేషన్‌లో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం ఓటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈ వారం ఓటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతున్నదనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 8వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో నయని పావని ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్గు ద్వారా రెండోసారి ఇంట్లోకి ప్రవేశించిన ఆమె కొన్ని వారాలపాటే ఇంటిలో ఉంది. సరైన ఆట ప్రదర్శించలేకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత జరిగిన నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది.

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో 10వ వారం నామినేషన్ ప్రక్రియలో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ శెట్టి, యష్మీ, హరితేజ, విష్ణు నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా టాప్ ప్లేయర్లు నామినేషన్‌లో ఉండటంతో భారీగా ఓటింగ్ నమోదు అవుతున్నది. దాంతో కంటెస్టెంట్ల మధ్య ఓటింగ్ భారీగా నమోదు అవుతున్నది.

ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి రోజు జరిగిన ఓటింగ్‌లో గౌతమ్ టాప్ రేంజ్‌లో ఉన్నాడు. ఆయనకు 26 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఆ తర్వాత నిఖిల్ రెండో స్థానంలో 21 శాతం ఓటింగ్‌తో ఉన్నారు. ఆ తర్వాత ప్రేరణ 17 శాతం ఓటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో పృథ్వీశెట్టి 13 శాతం ఉన్నాడు.

అయితే ఈ వారం 11 శాతం ఓట్లతో యష్వీ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన హరితేజ 8 శాతం ఓట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. ఇక విష్ణుప్రియ అత్యల్పంగా 8 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈ వారం డేంజర్ జోస్‌లో ముగ్గురు టాప్ ఉమెన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు తమ స్థానాన్ని సెక్యుర్‌గా ఉంచుకొంటారనేది భారీ ట్విస్ట్‌గా మారింది.


Click it and Unblock the Notifications











