Bigg Boss 11th Week Voting: బిగ్‌బాస్‌లో 6 గురు నామినేట్.. 11వ వారంలో ఓటింగ్ ఎలా ఉందంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో 10వ వారం సక్సెస్‌పుల్‌గా ముగించుకొంది. ప్రస్తుతం 11 వారంలోకి ప్రవేశించింది. అయితే 11వ వారంలో కూడా అదే జోష్‌తో కంటెస్టెంట్లు మొదలుపెట్టారు. 10వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగానే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా మొదలయ్యాయి. ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం భారీగా జరిగింది. అయితే ఈ వారం నామినేషన్స్ ఏం జరిగింది? ఎవరెవరూ నామినేట్ అయ్యారు? ఓటింగ్ ఎలా జరుగుతున్నది? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 8 షోలో 10వ వారం డబుల్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఊహించని విధంగా గంగవ్వ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తనకు ఆరోగ్య సహకరించడం లేదని చెప్పడంతో బిగ్‌బాస్ ద్వారా ఎలిమినేషన్ జరిగింది. అయితే ఓటింగ్‌లో వెనుక బడిన హరితేజ కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

Bigg Boss 8 Telugu 11th Week Voting Is Yashmi to face danger Situation

ఇక 11వ వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ ఘాటుగా మొదలైంది. ప్రేరణ, యష్మీతో టేస్టీ తేజ గొడవ భారీగా జరిగింది. అలాగే గౌతమ్ కృష్ణకు పృథ్వీకి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకొన్నారు. రోహిణి, ముక్కు అవినాష్, నిఖిల్ తదితరులు నామినేషన్ ప్రక్రియలో తమ వాదనలు వినిపించారు. చివరకు వారి వాదనల, నామినేషన్ల ద్వారా బిగ్‌బాస్ కంటెస్టెంట్లను నామినేట్ చేశారు.

ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణు ప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు. మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేషట్ అయ్యారు. అయితే నామినేట్ అయిన వారందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఓటింగ్ ప్రక్రియ సహజంగానే ఆసక్తికరంగా ఉండబోతున్నట్టు స్పష్టమైంది.

Bigg Boss 8 Telugu 11th Week Voting Is Yashmi to face danger Situation

అయితే బిగ్‌బాస్ 11వ వారం ఎలిమినేషన్ కోసం తమ కంటెస్టెంట్ల అభిమానులు ఓట్ల రూపంలో అభిమానానాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు. ఓటింగ్ లైన్స్ ప్రారంభం కాగానే భారీగా ఓట్లు నమోదు అవుతాయనేది సమాచారం. ఈ వారం ఆరంభంలోనే గౌతమ్ టాప్ ఓటింగ్ సొంతం చేసుకొంటారు. ఆ తర్వాత స్థానాల్లో పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ, అవినాష్ తదితరులు మెరుగైన ఓట్లు సాధిస్తారు. ఈ వారం యష్మీ డేంజర్ జోన్‌లో ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X