Bigg Boss Telugu 8 Promo: బొక్క బోర్లా పడ్డ సోనియా.. ప్రైజ్ మనీ కోసం నిఖిల్,పృథ్వీల కుస్తీ
Bigg Boss 8 Telugu Latest Promo: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ను ఎంతో మంది అదరిస్తున్నారు. వారందరికి కోసం లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్మెంట్ అందించాలని గట్టిగా ఫీక్స్ అయ్యారు బిగ్ బాస్. అందుకేనేమో కంటెస్టెంట్ల మధ్య టాస్కుల పేరు చెప్పి గొడవలు పెడుతున్నారు. ఈ టాస్కుల వల్ల కంటెస్టెంట్స్ మనస్పర్థలు, గొడవలు తలెత్తున్నాయి. ఒక్కొసారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో కొందమంది కంటెస్టెంట్లు ఎమోషనల్ బస్ట్ అవుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం ఓ రేంజ్ లో ఉంది. క్లోజ్ ప్రెంఢ్స్ మధ్య వార్ మొదలైంది. మరో వైపు నిఖిల్,సోనియాల రొమాన్స్ ఓ రేంజ్ కు చేరింది.
నిజంగా తాజాగా రిలీజ్ అయినా ప్రోమో మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉందనే చెప్పాలి. గతంలో ఎన్నాడు లేనివిధంగా ట్వీస్టుల మీద ట్వీస్టులు ఇస్తూ బిగ్ బాస్ షోను రన్ చేస్తున్నారు. ఇంత పుడ్ కోసం టాస్కులు పెట్టి గొడవలు పెట్టిన బిగ్ బాస్ నేడు అన్ లిమిట్ మనీని ప్రైజ్ గా దక్కించుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రైజ్ మనీ కోసం ఎదుర్కోవాల్సిన టాస్కుల గురించి బిగ్ బాస్ వివరించారు. ముందుగా స్విమ్మింగ్ పూల్‌లో నాగ మణికంఠ, సోనియా, విష్ణుప్రియాను దూకాల్సిందిగా ఆదేశించారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా రన్ చేయడం స్టార్ చేశారు. ఆ క్రమంలోనే సోనియా పరుగెత్తూ బొక్కబోర్లా పడింది. ఈ టాస్కులో యాంకర్ విష్ణుప్రియా స్విమ్మింగ్ పూల్ మొదట దూకి ట్కాస్ విన్నర్ అయ్యారు. ఆ తరువాత అసలైన డ్రామా స్టార్ అయ్యింది. సోనియాకు ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని పృథ్వి దగ్గరకు తీసుకుని హాగ్ చేసుకుని ఓదార్చాడు.

మరోవైపు టాస్క్ గురించి చర్చ మొదలైంది. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్దం జరిగింది. ఒక్కరినొకరూ తిట్టుకోవడం ప్రారంభించారు. 'మణికంఠ ప్లేస్‌లో నేను ఉంటే కూడా చాలా రఫ్‌గా ఆడుతాను. కాబట్టి నీకైనా తగలొచ్చు. నాకైనా తగలొచ్చు. మనం ఆర్టిస్టులం మచ్చా. తల పగిలితే ఎవరిది బాధ్యత. అర్థం చేసుకోండి' అంటూ నిఖిల్ కంటెస్టెంట్లు వార్నింగ్ ఇచ్చారు. కానీ, నిఖిల్ మాటలు యష్మీకి నచ్చలేదు. ' మీ సెంటిమెంటల్ డైలాగ్స్ తో మా గేమ్‌ను పక్క దారి ప్రయత్నాలు చెయొద్దు ' అని గట్టిగా అరిచేసింది. 'ఫిజికల్‌గా దెబ్బలు తగలకూడదు అని చెప్తున్నాను'అని నిఖిల్ చెబుతున్న యష్మీ ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఆ తరువాత రెండో గేమ్ ప్రారంభమైంది. 'బిగ్ బాస్ మీకు ఇస్తున్న రెండో అవకాశం విలువ రూ.50 వేలు' అంటూ ప్రైజ్ మనీ కోసం మరో ట్కాస్ ప్రారంభించారు బిగ్ బాస్. ఇందులో పృథ్వి, నబీల్, నిఖిల్ పాల్గొన్నారు. వీరు ముగ్గురు కలిసి ఓ తాడును మూడు వైపులా పట్టుకొని లాగుతూ కలర్ బాల్స్‌ను తమకు కేటాయించిన బాస్కెట్‌లో వేయాలి. అలా పృథ్వి, నబీల్, నిఖిల్ మధ్య పోటీ గట్టిపోటీ జరిగింది. మొదట్లో నబీల్ బాగానే ఆడినా.. మధ్యలో తాడును పట్టుకోలేక వదిలేశాడు. దీంతో పృథ్వి,నిఖిల్ మధ్య టఫ్ వార్ మొదలైంది. ఈ క్రమంలో నిఖిల్ కోపంతో బాస్కెట్‌ను తన్ని బాల్స్‌ను కింద పడేశాడు. పృథ్వి కోపం కూడా కట్టలు తెచ్చుకుంది. గేమ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ.. ఇద్దరూ తాడును లాక్కోవడానికి ప్రయత్నించారు. చిన్న సైజ్ మల్ల యుద్దం సీన్ లా కనిపించింది. ఈ ప్రోమో చూస్తే ఈ రోజు గేమ్ ఓరేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది


Click it and Unblock the Notifications











