Bigg Boss Telugu 8 Promo: చేతి వణికితే లక్షా యాభై వేలు పోయినట్టే.. కంటెస్టెంట్ల మధ్య చికెన్ చిచ్చు..
Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ట్విస్టులు, టాస్కులు మామూలుగా లేవుగా. అన్ లిమిట్ ప్రైజ్ మనీ అంటూ కంటెస్టెంట్లకు చుక్కులు చూస్తూనే.. వారి మధ్య చిచ్చు పెడుతున్నారు బిగ్ బాస్. గేమ్ పెట్టి కంటెసెంట్లను ఇంటర్టైన్ మెంట్ చేస్తూనే మరోవైపు కంట్రావర్సీలను
క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. రెండో వారం నామినేషన్ల పర్వం పూర్తయిన టాస్కులు ప్రారంభించారు. కష్టపడి టాస్కులు ఆడి గెలిచి వారికి అన్ లిమిట్ ప్రైజ్ మనీ చెప్పేశారు. దీంతో కంటెస్టెంట్ల ప్రైజ్ మనీ కోసం పోటీ పడుతున్నారు. ప్రైజ్ మనీ కోసం రెండు టాస్కులు ఆడిన ఇప్పటికే ప్రోమో విడుదలయ్యింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రొమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ టీం. టాస్కుల పేరుతో కంటెస్టెంట్లకు చుక్కలు చూపించారు.
తాజా ప్రోమోలో.. 'బిగ్ బాస్ ఇస్తున్న నాలుగో అవకాశం విలువ రూ.1,50,000'' అంటూ అభయ్, నిఖిల్, ఆదిత్య ఓంలకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ముగ్గురు కంటెస్టెంట్లు.. వారికి ఇచ్చిన మిలిట్ మేడ్ ఆరెంజ్ ఫల్పీని ఒక గ్లాస్‌లో పోస్తుండాలి. అలా గ్లాసులో జ్యూస్ పోసేటప్పడు ఒక్క చుక్క కూడా బయటకు కారిపోకుండా చూసుకోవాలి. ఒక్క జ్యూస్ కింద పడితే.. వాళ్లు గేమ్ నుంచి బయటకు రావాలి. దీంతో ఈ ముగ్గురి మధ్య గేమ్ షూరు అయ్యింది. ముందుగా ఆదిత్య ఓం వచ్చి గ్లాస్‌లో సగానికి పైగా జ్యూస్ నింపాడు. ఆ తరువాత అభయ్, నిఖిల్ పోశారు. ఈ క్రమంలో అభయ్, నిఖిల్ తన తెలివిని ప్రదర్శించారు.

ఆ తరువాత ఐదో ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో నిఖిల్,నబీల్, పృథ్విరాజ్ లు వ్యాక్సింగ్ చేయించుకోవాలని ఆదేశించారు బిగ్ బాస్. ఆ ఛాలెంజ్ విలువ రూ.50 వేలు అని ప్రకటించారు. ఈ గేమ్ లో ఎలాగైనా గెలువాలని నిఖిల్ చాలా ఓపికగా బాధ ఎంత కలిగిన నొప్పిని ఓర్చుకున్నాడు. కానీ, నబీల్ మాత్రం అరిచాడు. వద్దు వద్దని వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇక పృథ్వి పరిస్థితి దారుణం. తనకు వ్యాక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదనీ, తాను చేయించుకోని వెళ్లిపోతుంటే.. అభయ్ తనను గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టారు. అయినా తనతో కాదంటూ వదిలించుకొని మధ్యలోనే వెళ్లిపోయాడు పృథ్వి.
ఈ గేమ్ పూర్తి అయిందో లేదా.. కట్ చేస్తే .. కంటెస్టెంట్ల అందరూ కిచెన్ దగ్గర మీట్ అయ్యారు. ఇప్పటికే నైనికా, యష్మీ టీమ్స్ టాస్కులు ఆడి రేషన్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే.. యష్మీ టీమ్ దగ్గర ఎక్కువ రేషన్ ఉండటంతో నైనికా టీమ్ దొంగతనానికి పాల్పడుతున్నారు. చికెన్‌ను దొంగిలించి తిన్నారు. తాజాగా యష్మీ టీమ్ రేషన్ నుండి పాల ప్యాకెట్‌ను విష్ణుప్రియా తీసేసుకోవడంతో వీరి మధ్య మరోసారి గొడవ ప్రారంభమైంది. మరోసారి కంటెస్టెంట్ల మధ్య మాట యుద్దం ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











