Bigg Boss Telugu 8:అడ్డంగా బుక్కైన మహానటి యష్మీ..నోరు అదుపులో పెట్టుకో.. నాగ్ మాస్ వార్నింగ్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం ఎలిమినేషన్ చేరుకుంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేసిన పలువురు కంటెస్టెంట్స్ కింగ్ నాగార్జున సీరియస్ అయ్యారు. ఎంతలా అంటే.. ఎప్పడు లేని విధంగా ఏకంగా గన్ పట్టుకుని వచ్చారు కింగ్ నాగ్. ముందుగా బీబీ హౌజ్‌లో చీఫ్ గా వ్యవహరిస్తున్న వారిపై తనదైన స్టైల్ లో గట్టిగా అరుసుకున్నారు. ఈ క్రమంలో యష్మీ గౌడకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. తాజా ప్రోమో మాత్రం ఓరేంజ్ లో ఉంది.

తాజా ప్రోమో చూసిన తర్వాత.. ఇది కదా అసలు ట్వీస్టు.. ఇది కదా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు కావాల్సింది అనేలా ఉంది. ఎందుకీ ఈ షో అనుకునే తరుణంలో కింగ్ నాగ్ ఎంట్రీ అదుర్స్. గతవారం కింగ్ నాగ్ హోస్టింగ్ వెస్ట్ రా బాబు అనుకున్నారు. ఈ వారమైనా కాస్తా ట్విస్టులు ఉండాలని భావించినా బిగ్ బాస్ ఆడియన్స్ కు అన్ లిమిటెట్ ఎంటర్టైన్ మెంట్ అందించారు నాగ్. మరోసారి ట్రబుల్ షూటర్ అనే పేరుకి సరైన న్యాయం చేశారు. మెయిన్ గా నిఖిల్, నైనికలకు ఫేవర్ గా ఉన్నా యష్మీ గౌడను మాత్రం ఓ రేంజ్ లో అరుసుకున్నాడు. ఆధారాలతో సహా నిజాలను బయటపెట్టారు కింగ్ నాగార్జున.

Bigg Boss 8 Telugu 14th September second Promo Out Day 13 Host Nagarjuna Removed Yashmi And Nainika From The Chief Nabeel As New Chief

గన్ లో వచ్చిన కింగ్ నాగార్జున రావడం రావడమే సీరియస్ అయ్యారు. 'మీ టీమ్ పర్ఫార్మెన్స్ ఏంటో మీరే చెప్పాలి' అంటూ ముగ్గురు చీఫ్‌లను నిలబెట్టారు. వారి రెడ్, గ్రీన్ అంటూ రెండు కేటగిరిలు ఇచ్చాడు. తన టీమ్ కంటెస్టెంట్లలో ఎవరు రెడ్‌లో.. ఎవరు గ్రీన్‌లో ఉండాలో నిర్ణయించుకోమన్నారు నాగార్జున. ముందుగా బిగ్ బాస్ మహానటి యష్మీ గౌడ ముందుకు వచ్చింది.

తన టీమ్‌లోని అభయ్‌ను గ్రీన్ జోన్‌లో పెట్టింది. దీంతో వెంటనే రియాక్ట్ అయినా నాగ్.. 'నీ ఉద్దేశ్యంలో అభయ్ టాస్కులు బాగా ఆడాడు' ప్రశ్నించగా..' అవును' అని బదులిచ్చింది యష్మీ. ఈ తరుణంలో 'మరి విష్ణుప్రియ ఉద్దేశ్యంలో ?' అంటూ సాక్స్ టాస్క్‌ గురించి ప్రస్తావించారు. ఈ టాస్క్ లో అభయ్ సరిగానే ఆడడా అనగానే.. విష్ణుప్రియా రియాక్ట్ అయింది. 'నన్ను ఒకానొక సమయంలో అభయ్ తోశారు. కానీ, నేను అలా చేయలేదని అభయ్ వాదిస్తున్నాడు' అని విష్ణుప్రియా హోస్ట్ నాగ్ కు చెప్పింది. అసలు అభయ్,విష్ణుప్రియా మధ్య ఏం జరిగిందో తెలిసేలా నాగార్జునా సాక్స్ టాస్క్ వీడియో చూపించారు.

తర్వాత బెస్ట్ కంటెస్టెంట్ అంటూ పృథ్వి ఫోటోను గ్రీన్ జోన్‌లో పెట్టింది .. 'పృథ్వి అన్ని టాస్క్ ల్లో 100 పర్సెజ్ ఇచ్చారు' అని యష్మీ చెబుతూ.. అంతలోనే కింగ్ నాగ్ రియాక్ట్ అయి.. వ్యాక్సింగ్ టాస్క్‌లో మధ్యలో వెళ్లిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తరువాత పృథ్వికి ఓ రేంజ్ లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 'గేమ్ లో వాడకూడని పదాలు వాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో లేదనుకో' అంటూ గన్ చూపించాడు నాగార్జున. ఆ తరువాత తన టీంలోని ప్రేరణను రెడ్ జోన్లో వేసింది.దీంతో ఎందుకు అని నాగార్జున ప్రశించగా.. ప్రేరణ సంచాలకురాలిగా వచ్చినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్ అయ్యింది'అని యష్మీ చెప్పింది. 'తను కన్‌ఫ్యూజ్ అయ్యిందా? మీ టీమ్ మొత్తం కలిసి కావాలనే కన్‌ఫ్యూజ్ చేశారా? అని ప్రేరణకు సపోర్ట్‌గా నాగార్జున.

ఈ క్రమంలో సంచాలకుల విషయాన్ని ప్రస్తావించారు. నువ్వు సంచాలక్ గా వ్యవహరించనప్పుడూ.. మణికంఠ, సీత విషయం ఎవరికీ న్యాయం చేశావ్. 250 గ్రాముల విషయంలో నువ్ తీసుకున్న నిర్ణయం అసలూ కరెక్టేనా ? అంటూ యష్మీని నిలదీశారు కింగ్ నాగ్.టాస్క్ సమయంలో 250 గ్రాముల విషయంలో మణికంఠ క్లారిటీ తీసుకున్నారని, కానీ, నువ్వు కావాలని గేమ్ రూల్స్ మార్చావని ఫైర్ అయ్యారు. వెంటనే ఆ గేమ్ సమయంలో ఏం జరిగిందో వీడియో చూపించారు. అందులో మహానటీ యష్మీ అబద్ధం చెప్పినట్టు కింగ్ నాగ్ కు అడ్డంగా దొరికిపోయింది. దీంతో మహానటి.. తన నటవిశ్వరూపాన్ని బయటపెట్టింది. కన్నీళ్లు కార్చుతూ.. 'నేను నైనికా టీమ్ గెలవాలని అలా చేశా' అని చెప్పింది. మరీ ఆ విషయం ముందుగానే ఒప్పుకోవచ్చుగా అని నాగార్జున సీరియస్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X