Bigg Boss Telugu 8 Day 3 Voting : ఓటింగ్‌లో విష్ణు ప్రియ టాప్.. డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్!
Bigg Boss 8 Telugu voting: బుల్లితెర ప్రేక్షకులను అన్ లిమిట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఈ సీజన్ ప్రారంభం నుంచి దిమ్మతిరిగి పోయే ట్వీస్టులు ఇస్తూ షాకింగ్ ఎలిమినేషన్ చేస్తున్నారు బిగ్ బాస్. ఈ సీజన్ లో రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్లు కూడా రసవత్తరంగా సాగాయి. ఈ సారి నామినేషన్స్ లో విష్ణుప్రియ, మణికంఠ, సీతా, ప్రేరణ, యష్మీ, నైనిక, అభయ్, ప్రుద్వీలు ఉన్నారు. ఈ మూడో వారం నామినేషన్స్ తర్వాత ఓటింగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఈ వారం ఎవరు టాప్ లో ఉన్నారు. ఏ కంటెస్టెంట్ టాప్ లో ఉండబోతున్నారు? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 లో నిజంగానే రొమాన్స్, లవ్, ఏడుపులు అన్నింటి కంటే ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలతో చాలా ఎంటర్టైన్ గా సాగుతోంది. గత సీజన్లతో పోల్చుకుంటే ప్రస్తుత సీజన్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు మామూలుగా లేవుగా.. ఏ విషయమైనా .. హౌజ్ హీటెక్కాల్సిందే. దీంతో సీజన్ 8లో ఎన్నో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే.. గత వారం శేఖర్ బాషా వెళ్లిపోయడంతో ఈ సారి ఎలిమినేషన్స్ లో ఉన్నవారికి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. గత సీజన్లో ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయాల్సివస్తే.. వారిని సీక్రెట్ హౌస్ లోకి పంపిచేవారు. కానీ, ఈ సారి ఆ అవకాశం లేనే లేదు. అయితే ఈ వారం బయటకు ఎవరు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారుతుంది.

ప్రస్తుతం మిగిలి ఉన్న 12 మంది కంటెస్టెంట్స్‌లలో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్‌లో 8 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. సమాచారం ప్రకారం.. ఓటింగ్‌లో విష్ణుప్రియ మళ్లీ టాప్‌లో ఉంది. మొదటి వీక్‌లో విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్.. రెండో వారంలో సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. మూడో వారంలో విష్ణుప్రియ 23.91 శాతం (2,555 ఓట్లు) ఓటింగ్‌తో ప్రధమ స్థానంలో .. ఇక రెండో వారం.. నాగ మణికంఠ 19.14 శాతంతో (2,045 ఓట్లు) నిలిచాడు.
ఆ తరువాత కిర్రాక్ సీత 11.37 శాతం (1215 ఓట్లు) మూడో స్థానంలో, యష్మీ గౌడ 10.71 శాతం (1145 ఓట్లు)తో నాలుగో స్థానంలో , నైనిక 9.7 శాతం (1037 ఓట్లు) ఐదో స్థానంలోతో నిలిచారు. ఇక చివరి రెండు స్థానాల్లో అభయ్, పృథ్వీరాజ్ ఉన్నారు. ఇందులో అభయ్ నవీన్ 7.41 శాతం (792 ఓట్లు)తో ఆరో స్థానంలో.. పృథ్వీరాజ్ 6.84 శాతం (731 ఓట్లు)తో చివరి స్థానంలో నిలిచారు.
అయితే.. తన సెల్స్ నామినేషనే ఆగం చేసిందని, ఇదే అభయ్ కు ఇదే మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అభయ్ తర్వాతి స్థానం లో పృథ్వీ రాజ్ ఉన్నారు. సీరియల్ బ్యాచ్ మొత్తం ప్రుధ్వీకి సపొర్డ్ చేయడంతో కచ్చితంగా అభయ్ అవుతాడు అని సోషల్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఏం జరుగుతుందో చివరి వరకు చూడాలి..


Click it and Unblock the Notifications











