Bigg Boss 8 Telugu Latest Promo: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు.. ‘బాడీ’ గేమ్ లో స్ట్రాటజీలు
Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఏ నోట విన్నా అదే. ఫ్రెండ్స్ ఫోన్స్ లో మాట్లాడుకున్నా.. నలుగురు కలిసి ఏదైనా చర్చనా అది బిగ్ బాస్ షో పైనే. నిజంగా రియాలిటీ షో అంతగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇతర ఏ షోలకు లేని రెస్పాన్స్ ఈ బిగ్ బాస్ కు వస్తుంది. ఇలా నెట్టింట్లో వస్తే.. ఈ షో గోల మామూలుగా లేదు. ఎక్కడ లేని రివ్యూస్,ట్రోల్స్, పోలింగ్స్ అబ్బాబ్బా మామూలు లేదుగా. ఇంకా ఎప్పటికప్పుడూ విడుదలయ్యే ప్రోమోలు కూడా షో మీది మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం ఓ రేంజ్ లో ఉంది.
బిగ్ బాస్ కు ఇంత క్రేజ్ రావడం ఫస్ట్ కారణం కంటెస్టెంట్ల మధ్య గొడవలు. ఆ కాంట్రవర్సీలకు ఫస్ట్ వీక్ లోనే తెర తీశారు బిగ్ బాస్. ఫస్ట్ వీక్ నామినేషన్స్ తోనే కంటెస్టెంట్ల మధ్య నువ్వా నేనా అనే పరిస్థితి తలెత్తింది.హౌస్ మేట్స్ అందర్ని గ్రూప్స్ గా విడగొట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు అసలైన ఆట ప్రారంభించారు. ముగ్గురు చీఫ్స్ లో ఎవరూ బెస్ట్ అనే విషయాన్ని తేల్చాలంటూ.. చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా 3 గ్రూపులుగా వీడిపోయారు.

గత ఎపిసోడ్ లో నిఖిల్, నైనికా, యష్మీలు చీఫ్స్‌గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు చీప్స్ కు సపోర్టు చేసేలా టీమ్స్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు బిగ్ బాస్. దీంతో యష్మీ టీమ్‌లోకి నలుగురు కంటెస్టెంట్స్,నైనికా టీమ్‌లోని నలుగురు కంటెస్టెంట్స్,నిఖిల్ టీమ్‌లో మాత్రం కేవలం ముగ్గురే ఉన్నారు. ఈ క్రమంలో యష్మీ, నైనిక టీమ్స్ మధ్య ఓ గేమ్ పెట్టారు. ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఓ సభ్యుడిని తీసుకోవచ్చు అనే ఆఫర్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ టాస్కులో యష్మీ సులభంగా గెలిచింది. అయితే వీరు నిఖిల్ టీం నుంచి ఎవరిని సెలక్ట్ చేసుకుంటారనే విషయం తెలియాల్సిఉంది.
తాజాగా రెండో టాస్క్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ ప్రోమో మాత్రం ఓ రేంజ్ లో ఉంది. అసలు తగ్గేదేలే అన్నట్టుగా కంటెస్టెంట్ తమ బెస్ట్ ఇస్తున్నారు. ప్రోమోలో నిఖిల్, యష్మీ మధ్య వారికి తెలియకుండానే బిగ్‌బాస్ చిచ్చు పెట్టేశాడు. రెండో టాస్క్ పేరిట కంటెస్టెంట్ల మధ్య మంటలు పుట్టించారు బిగ్ బాస్. యష్మీ, నైనికా టీమ్స్ మధ్య 'లూప్ ది హూప్స్' రెండో టాస్క్ జరగబోతుంది. ఒకరినొకరూ మానవహారంలా పట్టుకుని ఉండగా.. ఆ చైన్ ను బ్రేక్ చేయకుండా.. వారికి ఇచ్చిన రింగ్ ను చేతులు వదలకుండా శరీరాల మీదుగా తీసుకెళ్తూ.. చివరికి చేర్చాలంటూ ఓ మైండ్ పెట్టాడు బిగ్ బాస్. ఫస్ట్ యష్మీ టీమ్ ఆట మొదలు పెట్టింది.
బిగ్ బాస్ ఇచ్చిన రింగ్ ను పూర్తిగా బాడీ నుంచి పాస్ చేసి గేమ్ కంప్లీట్ చేశారు. కానీ నైనికా టీమ్ మాత్రం చాలా తెలివిగా.. కేవలం హెడ్ టు హెడ్ పాస్ చేసుకొని ముందుగా టాస్క్ పూర్తిచేశారు. దీంతో అసలు గేమ్ మొదలైంది. నైనికా టీమ్ రూల్స్ బ్రేక్ చేసిందని యష్మీ టీమ్ ఓ రేంజ్ మండిపడింది. ఈ గేమ్ కు సంచాలకుడిగా ఉన్న నిఖిల్ కూడా నైనికా టీమ్‌కే సపోర్ట్ చేయడంతో చిన్నగా గొడవ కాస్త పెద్దగా మారింది. బిగ్‌బాస్ శరీరం మొత్తం తిప్పి రింగ్స్ తీసుకురావాలని చెప్పారని చెప్పడంతో శరీరం మొత్తం అని చెప్పలేదు.. శరీరం నుంచి అని చెప్పారంటూ నైనిక టీం వాదిస్తుంది. ఇక నిఖిల్ కూడా నైనిక టీంకు సపోర్ట్ చేయడంతో యష్మీ రెచ్చిపోయింది. రూల్స్ బ్రేక్ చేస్తున్నారంటూ నిఖిల్ తో గొడవకు దిగింది. అటు నిఖిల్ కూడా యష్మీకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి రెండో టాస్కుతో దోస్తులు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్ .

ముందుగా యష్మీ టీమ్‌కు చెందిన అభయ్ రెచ్చిపోయారు. హెడ్ టు హెడ్ రింగును పాస్ చేయడం సరికాదని వాదించారు. దీంతో అది మా స్ట్రాటజీ అంటూ ఎదురుతిరిగింది నైనికా. బిగ్ బాస్ ఎక్కడ కూడా ఫుల్ బాడీ అని చెప్పలేదనీ, కేవలం చేతులు వదలకుండా రింగ్ పాస్ చేయమన్నారని సీత, విష్ణుప్రియా నైనిక ను సపోర్టుగా నిలిచారు. ఈ క్రమంలో సంచాలకుడిగా నిఖిల్ ఎవరి స్ట్రాటజీ వాళ్లది అన్నట్టుగా మాట్లాడాడు. దీంతో యష్మీ టీమ్‌లో ఉన్న పృథ్విరాజ్ రెచ్చిపోయారు. బాడీ అంటేనే ఫుల్ బాడీ అంటూ ఫైర్ అయ్యారు. మరో వైపు యష్మీ మాట్లాడుతూ.. మాకు అడ్డదిడ్డంగా ఆడటం చేత కాదు. రూల్స్ ఫాలో అయ్యామని నిఖిల్‌ని నిలదీసింది. ఇలా నైనికా, యష్మీ, నిఖిల్ మధ్య చిచ్చుపెట్టారు. మరీ పుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరీ..


Click it and Unblock the Notifications











