Bigg Boss 8 Telugu Latest Promo: ‘అడిగేటప్పుడు ధమక్ ఉండాలి’ అభయ్ ఫైర్.. బోరున ఏడ్చిన బోల్డ్ సీత

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు, కాంట్రవర్సీలు. కోరుకున్నోడికి కోరుకున్నంతా అన్నట్లుగా ఈసారి బిగ్ బాస్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇక ప్రైజ్ మనీ మీద బిగ్ బాస్ పిచ్చా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ప్రతి కంటెస్టెంట్ ' తగ్గేదేలే' అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా రెచ్చిపోతున్నారు. అవసరమున్నా.. లేకున్నా నోరు పారేసుకుంటున్నారు.

ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు మూడు ఎపిసోడ్స్ ను చూస్తే.. ప్రతి కంటెస్టెంట్ ఏదో స్ట్రాటజీ, ఏదో మైండ్ గేమ్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ సీజన్ లో ముఖ్యంగా నాగ మణికంఠ, కిరాక్ సీత, సోనియా ఆకుల, అభయ్ నవీన్, యష్మీ, శేఖర్ బాషా మాత్రమే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. ఇదే విషయం తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా అదే కనిపిస్తుంది.

Bigg Boss 8 Telugu 6th September second Promo Out Day 5 task Bricks Balancing

ఇక హౌస్ విషయానికి వస్తే.. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోనే కంటెస్టెంట్ల మధ్య వార్ మొదలైంది. 'నువ్వా- నేనా' అనే పరిస్థితి కనిపిస్తుంది. హౌస్ మేట్స్ అందర్ని గ్రూప్స్ గా విడగొట్టిన బిగ్‏బాస్ ఇప్పుడు అసలైన ఆట మొదలు పెట్టారు. తొలివారం ముగ్గురు చీఫ్స్ లో ఎవరూ బెస్ట్ అనే విషయాన్ని తేల్చాలంటూ.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్స్ అంతా 3 గ్రూపులుగా వీడిపోయారు. ఇలా కాంట్రవర్సీలకు ఫస్ట్ వీక్ లోనే తెర తీశారు బిగ్ బాస్.

గత ఎపిసోడ్ లో నిఖిల్, నైనికా, యష్మీలు చీఫ్స్‌గా ఎంపిక అయిన విషయం తెలిసిందే. యష్మీ టీమ్‌లోకి నలుగురు కంటెస్టెంట్స్,నైనికా టీమ్‌లోని నలుగురు కంటెస్టెంట్స్,నిఖిల్ టీమ్‌లో కేవలం ముగ్గురే ఉన్నారు. ఈ క్రమంలో యష్మీ, నైనిక టీమ్స్ మధ్య టాస్కులు పెడుతున్నారు బిగ్ బాస్. ఈ టాస్కుల్లో ఎవరు గెలిస్తే వారు నిఖిల్ టీం నుంచి ఓ కంటెస్టెంట్ ను తీసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఫస్ట్ టాస్కులో యష్మీ సులభంగా గెలిచింది. అయితే వీరు నిఖిల్ టీం నుంచి ఎవరిని సెలక్ట్ చేసుకుంటారనే విషయం తెలియాల్సిఉంది.

అలాగే.. ఇక రెండో టాస్క్ పేరిట యష్మీ, నైనికా టీమ్స్ మధ్య 'లూప్ ది హూప్స్'టాస్క్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ గేమ్ రూల్స్ ప్రకారం..హూమన్ చైన్ గా ఏర్పడి.. ఆ చైన్ ను బ్రేక్ చేయకుండా.. వారికి ఇచ్చిన రింగ్ ను ఒక్క చివర నుంచి మరో చివరికి చేర్చాలి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.ఈ టాస్క్ లో నైనికా టీమ్ మాత్రం చాలా తెలివిగా ఆడి టాస్క్ ను ముందుగా పూర్తిచేశారు.దీంతో అసలు గేమ్ మొదలైంది.

తాజాగా మరో టాస్క్ కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఈ ప్రోమోలో రెండు టీమ్స్ కి టాస్క్ ఇస్తే.. మొదట సరిగానే ఆడిన ఆ తరువాత ఇరు టీమ్ సభ్యులు విచక్షణ కోల్పోయి ఆడటం ప్రారంభించారు. వారు గెలవకున్నా ఫర్వాలేదు. పక్కా టీమ్ మాత్రం అసలూ గెలువ కూడదనే తీరులో వ్యవహరించారు. టాస్క్ పూర్తి చేయకుండా చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.

నైనికా, యష్మీ టీమ్స్ మధ్య 'బ్రిక్స్ బాలెన్స్' అనే టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ లో ఎవరూ గెలిస్తేవారు నిఖిల్ టీమ్ నుండి ఒక కంటెస్టెంట్‌ను తమ టీమ్‌లోకి తీసుకోవచ్చు. దీంతో రెండు టీంలు పోటాపోటీగా ఆడాయి. వల మధ్య కాలుపెట్టి ఊయల లాగా ఊగుతూ ఓ ప్లాట్‌ఫార్మ్ పై 5 ఇటుకలను నిలబెట్టాలి. అలా ముందుగా యష్మీ టీమ్ ఆ ప్లాట్‌ఫార్మ్‌పై మూడు ఇటుకలను నిలబెట్టింది.

ఈ క్రమంలో యష్మీ టీమ్‌లోని పృథ్విరాజ్ వెళ్లి నైనికా టీమ్‌ నిలబెట్టిన ఇటుకలను కిందపడేశాడు. దీంతో సంచాలకుడు నిఖిల్ ఫైర్ అయ్యారు. ఆటను ఆటగానే ఉండాలని, మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. గేమ్ ను పక్కకు దారి పట్టిస్తున్నారు ఫైర్ అయ్యారు. తర్వాత నబీల్,అభయ్ కూడా గేమ్ రూల్స్ ను బ్రేక్ చేశారు. అలా రూల్స్‌ను ఫాలో అవ్వకుండా యష్మీ, నైనికా టీమ్స్ పోటీపడ్డాయి. నానా రచ్చ క్రియేట్ చేస్తున్నారు.

ఇక్కడ కట్ చేస్తే.. సీన్ కిచెన్ రూమ్ కి షిఫ్టు అయ్యింది. ఈ క్రమంలో కిర్రార్ సీత, అభయ్‌ నవీన్ మధ్య మాటల తూటలు పేలాయి. 'ఎవరి గిన్నెలు వారు తోముకోండి' అని కిర్రాక్ సీత .. ఇన్ డైరెక్ట్ గా అభయ్‌ పై కామెంట్ చేసింది. దీంతో అభయ్ నవీన్ గరం అయ్యారు. 'నువ్వు నా కింద పనిచేయడం లేదు. అదే గేమ్'అని కిర్రాక్ సీతకు అభయ్ కౌంటర్ ఇచ్చాడు. కిర్రాక్ సీత రిప్లే ఇస్తూ.. 'అంటే మీరు ఏమీ పనిచేయరా? మీ గిన్నెలు మేమెందుకు కడగాలి?'అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ' ఇంట్లో ఎవడు నాకు కింద పనిచేయడం లేదు. అడిగేటప్పుడూ ధమక్ ఉండాలా' అని షాకింగ్ కామెంట్స్ చేశాడు అభయ్.

దీంతో ఫీలయిన బోల్డ్ సీత.. అన్నం వద్దు అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి పడుకుంది. అయినా అభయ్ ఏ మాత్రం తగ్గలేదు. తాను చేసిందే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇక వాళ్ళ గిన్నెలు తోముకుంటూ ఉంటే.. మనం ఎప్పుడు గేమ్ ఆడతాము అంటూ ఎమోషనల్ అయ్యింది సీతా. ఇలా బిగ్ బాస్ లో నాగ మణికంఠ తరువాత ఎమోషనల్ అయిన వ్యక్తిగా సీత నిలిచింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ప్రోమో చూసేయండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X