Bigg Boss 8 Telugu Promo: ‘ఆమె మాత్రమే పుణ్యస్త్రీ, మేము అదో టైపా ’ బిగ్ బాస్ హౌజ్‌లో విష్ణుప్రియా
Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తెలుగు మామూలుగా లేదుగా భయ్యా. ట్వీస్టుల మీద ట్వీసులు ఇస్తూ దిమ్మతిరిగేలా చేస్తున్నారు బిగ్ బాస్. పండుగ రోజు కాదా కాస్తా ప్రశాంతంగానే ఉంటుంది. ఫెస్టివల్ మూడ్ లో ఎంజాయ్ చేస్తారు. మనకు కాస్తా ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తారని అనుకుంటే.. వీకెండ్ లో కింగ్ నాగ్ వచ్చి ట్వీస్టుల మీద ట్విస్టు ఇచ్చారు. పండుగ నాడు కూడా ప్రశాంత లేకుండా కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగే షాకులు ఇచ్చారు హోస్ట్ నాగార్జున. తాజాగా వీకెండ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో లాగానే ఈ సీజన్ వీకెండ్స్ లో కింగ్ నాగ్ ప్రత్యేక్షమయ్యారు. నేడు వినాయక చవితి కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందరూ ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. వారందరికీ స్వీట్స్ ఇచ్చి.. ఫెస్టివల్ వీషెస్ చెప్పారు. ఆ తరువాత అసలు పండుగ షూరు చేశారు. గతంలో వారం మొత్తం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు,కాంట్రవర్సీలు గురించి తెలుసుకుని క్లాస్ తీసుకునే వారు. కానీ, ఈ సీజన్ లో రివర్స్ అంటూ.. మరోసారి ఎలిమినేషన్స్ పెట్టేశారు.

ముందుగా నిఖిల్ ను అరుసుకున్నారు కింగ్ నాగ్. ముగ్గురు చీఫ్స్‌లో స్ట్రాంగ్‌గా నిఖిల్ ఉంటాడనుకుంటే? ఏం జరిగిందని ప్రశ్నించారు. అందుకు నిఖిల్ సమాధానం చెప్పుతూ.. 'అన్నీ మారుతాయి' అని చెప్పాడు. వెంటనే నాగార్జున మాట్లాడుతూ.. 'ఏం మారుస్తావు మావా' అంటూ పంచ్ వేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఈ వారంలో జరిగిన విషయాలను బేస్ చేసుకుని తమకు 'ఏ కంటెస్టెంట్ నచ్చలేదో.. కారణమేంటో' చెప్పాలని నాగార్జున ఆదేశించారు. దీంతో వార్ మొదలైంది.
ముందుగా ఆర్ జే శేఖర్ భాష ముందుకు వచ్చి తనకు నాగ మణికంఠ నచ్చలేదని చెప్పాడు. ఆయనలో ఏదో ప్రాబ్లమ్ ఉందనీ, తనతో తను మాట్లాడుకుంటున్నాడని అన్నాడు. వెంటనే హోస్ట్ నాగార్జున రియాక్ట్ అవుతూ.. తన ప్రాబ్లమ్ ఏంటో చెప్పాడుగా అని నాగార్జున గుర్తు చేశారు. అది తనకు నమ్మేదిగా లేదని శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ తర్వాత విష్ణుప్రియా వంతు వచ్చింది. ఆమె సోనియా గురించి చెబుతూ.. తనకు కోపం వచ్చినప్పుడు తనే మాట్లాడే మాటలు, వాడే పదాలు చాలా హర్టింగ్ ఉంటాయని చెప్పింది. దీంతో కింగ్ నాగార్జున.. అసలు విష్ణుప్రియా, సోనియా మధ్య ఏం జరిగిందో తెలిసేలా ఓ వీడియో చూపించారు. అందులో సోనియా, విష్ణుప్రియాల మధ్య మాటల యుద్దమే జరిగిందిగా అనే ఉంది. కొన్నిరోజుల క్రితం నీకునిఖిల్ అంటే పడేది కాదు. ఇప్పుడేమో చాలా క్లోజ్ అయ్యారని సోనియాను విష్ణుప్రియా నిలదీసింది.
దీంతో సోనియా ఆగ్రహంతో ఏం మాట్లాడుకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. తర్వాత సోనియా మళ్లీ వచ్చి.. నేను మీ అడల్ట్ రేటెడ్ కామెడీలో భాగం కాదని వార్నింగ్ ఇచ్చింది. అలా మాట్లాడటం విష్ణుప్రియాకు అస్సలూ నచ్చలేదు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని సోనియాకు విష్ణు ప్రియ సూటిగా చెప్పింది. దీంతో సోనియా ఏడవడం మొదలుపెట్టింది. అయినా విష్ణు ప్రియా అసలు తగ్గలేదు. 'నేను కూడా ఏడుస్తా.. నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఈమెనే పుణ్యస్త్రీ, మేము మాత్రం అలాంటివాళ్లం' అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఆ వీడియో పూర్తి అయినా తరువాత నాగార్జున .. సోనియాకు సపోర్ట్‌గా నిలిచారు. 'నువ్వు ఒక అమ్మాయివే కదా. ఆమె ఫీలింగ్స్ అర్థమతున్నాయా''అని విష్ణుప్రియా ను నిలదీశారు కింగ్ నాగ్. ఆ తరువాత సోనియాతో మాట్లాడుతూ.. 'అన్ని కుక్కర్స్ ఒకేలాగా పనిచేయవు. అందరి ఎమోషన్స్ ఒకే లాగా ఉండవు'అంటూ నచ్చ చెప్పారు. ఇలా ఒక్కొక్కరి తన స్టైల్ లో క్లాస్ పీకారు కింగ్ నాగార్జున. మొత్తానికి బిగ్ బాస్ తాజా ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరీ ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











