ఆ విషయంలో ఆర్జీవీకి అంత సీన్ లేదు.. బిగ్ బాస్ బ్యూటీ సోనియా ఆకుల షాకింగ్ కామెంట్స్!
Sonia Akula: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సీజన్ లో ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు హౌస్‌లోకి అడుగుపెట్టారు. డిఫరెంట్ ఫిల్స్, డిఫరెంట్ ప్లేసేస్ నుంచి వచ్చిన వారందరూ మూడు నెలల పాటు ఒకే హౌస్ లో ఉండాల్సి ఉంటుంది. అన్ని టాస్క్ లో యాక్టివ్ గా ఉంటూ.. కాంట్రావర్సీలతో గుర్తుంపు తెచ్చుకుంటారు. అలాంటి కంటెస్టెంటే సోనియా ఆకుల. ఆమె హౌస్ లోని అన్ని విషయాల్లోనూ ఇంటర్‌ఫియర్ అవుతూ మైండ్ గేమ్ ఆడుతుంది సోనియా. ఈ తరుణంలో ఆమె కు సంబంధించిన పలు ఇంటర్య్వూ, వీడియోలు, ఫోటోలు తెర మీదికి వస్తున్నాయి. అందులో సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై నటి సోనియా ఆకుల షాకింగ్ కామెంట్స్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ.. సంచలన డైరెక్టర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో మీరు కూడా ఓ లూక్కేయండి.
బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్, నటి సోనియా ఆకుల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి ఆర్జీవి అనే అంటూ వస్తున్న కామెంట్స్ కొట్టిపారేసింది. డైరెక్టర్ ఆర్జీవికి అంతా సీన్ లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన మూవీ చేయడానికి ముందే తాను చాలా వీడియోలు, సాంగ్స్, షార్ట్ ఫీల్స్ లలో నటించానని అన్నారు.ఆర్జీవి తో మూవీ చేయడానికి ముందే.. తాను జార్జిరెడ్డి, కథనాయకుడు సినిమాలో నటించానని, తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే ఎన్ బీ కే ప్రొడక్షన్స్ తోనని గుర్తు చేశారు.

ఆర్జీవి అంతా సీన్ లేదనీ, కానీ ప్రతి అవకాశం మనకు గుర్తింపు ఇస్తుందని అన్నారు.తనకు ఆర్జీవీ కరోనా మూవీతో ఎంత పాజిటివ్ ఉందో.. అంత నెగిటివ్ వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు ఆర్జీవి ఫీల్ అయినా ఫర్వాలేదని సంచలన కామెంట్స్ చేశారు. కానీ, ఆర్జీవి తో వర్క్ చేశానంటే.. నేను ఎవరితోనైనా వర్క్ చేస్తాననే ఓ ధైర్యం వచ్చిందని అన్నారు.
వాస్తవానికి ఆర్జీవీతో వర్క్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాననీ, అసలు ఆ ప్రాజెక్ట్ చేయనని చెప్పడానికే తన దగ్గరికి వెళ్లానని, కానీ, ఏదో గుర్తింపు వస్తుందని చేయడానికి ముందుకు వచ్చానని అన్నారు. కథ నచ్చకున్న ఆయన మీద నమ్మకంతో కరోనా మూవీ చేశానని చెప్పుకొచ్చారు. ఆ మూవీతో పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చాయో.. నెగిటివ్ కామెంట్స్ కూడా అనే వచ్చాయని ఫీల్ అయ్యారు సోనియా ఆకుల.

అనంతరం సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన కరోనా వైరస్ మూవీలో నటించింది. కరోనా మహామ్మారి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీకి అంతగా ఆదరణ పొందలేదు. కానీ ఈ బ్యూటీ మాత్రం క్రేజీ గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా బీబీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ తరుణంలో సోనియా ఆకుల కు రామ్ గోపాల్ వర్మ విషెస్ చెప్పారు. ఈ వీడియో బైట్ ను నాగార్జున వేదికపై ప్రదర్శించారు కూడా. బిగ్ బాస్ షోకి రావడం వలన తన కెరీర్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తుంది ఈ బ్యూటీ.


Click it and Unblock the Notifications











