Bezawada Bebakka: బిగ్ బాస్ బేబక్క వాచ్ ఖరీదు 78 కోట్లా? దాని స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
Bezawada Bebakka: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తరువాత బేబక్క క్రేజ్ మరింత పెరిగింది. ఆమె ఎటు వెళ్లిన.. ఆమెను ఎక్కడ చూసిన బీబీ ఫ్యాన్స్ సెల్ఫీలు , ఫోటోలు అంటూ నానా పరేషాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా బేబక్క ఇంటర్వ్యూ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆమె కూడా ఎవర్ని కాదనకుండా.. వరస ఇంటర్వ్యూలతో బిజీబిజీగా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిస్ట్ వాచ్ రేట్ చెప్పి అందరి ఫ్యూజులు ఎగరకొట్టింది. అక్కడితో అయిపోలేదు. ఆ వాచ్ తయారీలో ఉపయోగించిన మెటల్ భూమి మీద దొరకదనీ, ఆ మెటల్ ను వేరే గ్రహం నుంచి తీసుకొచ్చారని షాక్ ఇచ్చింది. ఇక తన బ్యాగ్ గురించి చెప్పి మైండ్ బ్లాక్ చేసింది. బేబక్క ఎంత రిచ్చో మీరు కూడా ఓ లూక్కేయండి.
తాజాగా బిగ్ బాస్ బెజవాడ బేబక్క తన వాచ్ , యాండ్ బ్యాగ్ ధర ఎంతో చెప్పి కండ్లు బైర్లు కమ్మేలా చేసింది. వేలు, లక్షలు కాదు ఏకంగా ఆమె పెట్టుకున్న వాచ్ ధర కోట్లలోనే ఉండడం షాకింగ్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో బేబక్క మాట్లాడుతూ "ఈ వాచ్ రేట్ ను మీరు ఎక్స్పేట్ చేయలేరు. ఇది స్పెషల్ ఎడిషన్ వాచ్. ఇది ఫేమస్ వర్సాచి బ్రాండ్ కు చెందింది. ఈ వాచ్ కోసం ఓ స్పెషల్ మెటల్ వాడారు. కామన్ గా డైమండ్స్,గోల్డ్ కాకుండా.. భూమి మీద దొరకని మెటల్ తో ఈ వాచ్ ను తయారు చేశారు. ఈ మెటల్ కేవలం మార్స్ లో మాత్రమే దొరుకుతుంది. స్పెషల్ గా రాకెట్ పంపించి మాస్ నుంచి ఈ మెటల్ని తీసుకొచ్చి, ఈ వాచ్ ను తయారు చేశారు. దీన్ని కాస్ట్ రూ. 78 కోట్లు" అంటూ షాక్ ఇచ్చింది.

అయితే వెంటనే ఆ యాంకర్ 78 కోట్లా.. అని నోరు వెళ్లబెట్టారు. '78 కోట్ల వాచ్ పెట్టుకుని బేబక్క బిగ్ బాస్ కి వెళ్ళారా? ఆ కాస్ట్ తో బిగ్ బాస్ షోనే హోస్ట్ చేయొచ్చు' బేబక్క కు సెటైర్ వేశారు. దీంతో బేబక్క వెంటనే " ఈ మోటల్ భూమి మీద దొరకడు కేవలం మార్స్ పైనే దొరుకుతుంది. అసలు ఈ మెటల్ ఎంటో కూడా చాలా మందికి తెలియదు. ఇది చాలా చాలా స్పెషల్ ఎడిషన్. ఈ వాచ్ ధరలో ఆ రాకెట్ చార్జెస్ కూడా కలపడంతో ఈ వాచ్ ధర ఇంత అయ్యింది. అని బేబక్క చెప్పారు.
ఆ తరువాత బేబక్క తన హ్యాండ్ బ్యాగ్ గురించి మాట్లాడుతూ.. "ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా స్పెషల్, ఇది ఆల్డో కంపెనీ వాళ్ళది. నేను ఈ బ్యాగ్ ను స్పెషల్ గా కస్టమైజ్ చేయించుకున్నా.. ఇది 24 క్యారెట్ ఫైనెస్ట్ గోల్డ్ తో ఈ హ్యాండ్ బ్యాగ్ చైన్ చేశారు. ఇందులో ఉన్న ఓ బిళ్ళ వల్లే దీని ధర ఊహించనంతగా పెరిగింది. ఈ బిళ్ల భూమి మీద దొరకదు. ఒక్క ఈ బ్యాంకు కాస్ట్ ఎంత ఉంటుందో ఊహించగలరా?' అని ఇంటర్య్వూ చేసే వ్యక్తినే అడిగింది. దీంతో ఆ వ్యక్తి ' ఉంటుంది ఓ లక్ష రూపాయాలు' అని అన్నారు.

దీంతో హార్ట్ అయిన బేబక్క.. 'ఏం మాట్లాడుతున్నారు. ఈ బ్యాగ్ కు ఉన్న బిళ్లను ఆ వాచ్ మెటల్ కోసం మార్స్ వెళ్ళినప్పుడు తెప్పించాను. దీని ధర 180 కోట్లు" అని చెప్పింది. దీంతో ఆ యాంకర్ ఈ రెండింటి రేట్లతో మీరు మా టీవీనే కొనుక్కోవచ్చు తెలుసా? అని సెటైర్ వేశారు. దీంతో బేబక్క వెంటనే రియాక్ట్ అయ్యి.. 'అవును నాకు ఇలా ఉండడమే ఇష్టమే.. ఎందుకు కంటే మేము పే.. పే..పెదవాళ్లాం" అంటూ పంచ్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో బేబక్క పై ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











