Bigg Boss 8 Telugu: ఆ ఇద్దరిలో ఒకరు.. బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరో చెప్పేసిన శేఖర్ బాషా

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్.. పేరుకు.. ఆ ట్యాగ్ కు తగ్గట్టుగానే షో చాలా రసవత్తరంగా సాగుతోంది. నిజంగా బిగ్‌బాస్​లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. తొలివారం అందరూ ఊహించిన విధంగా బేబక్క ఎలిమినేట్ అయింది. కానీ, రెండో వారం ఎలిమినేషన్ మాత్రం వేరే లెవల్.. ఎవరూ ఊహించని విధంగా శేఖర్​ బాషా ఎలిమినేట్​ అయ్యారు. అయితే.. ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేషన్ బాగ్ బాస్ లవర్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో శేఖర్ భాషాను బీబీ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శేఖర్ బాషా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరో చెప్పేశాడు. ఆ ఇద్దరిలో ఒకరూ టైటిల్ విన్నర్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిజంగా బిగ్ బాస్ సీజన్ 8 లో లాంచ్ ఈవెంట్ నుంచే ఎవరూ ఊహించని ట్వీస్టులు, టాస్కులు, ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ రియాలిటీ షో.. తొలివారం బెజవాడ బేబక్క బీబీ హౌస్ ను ఎలిమినేట్ అవ్వగా.. రెండోవారం శేఖర్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. గడిచిన రెండువారాల్లో ఎక్కడైన ఫన్ జనరేట్ అయిందంటే.. అది శేఖర్ బాషా వల్లనే.. తన పంచ్‌లు, జోక్స్‌తో హౌస్ లోని సభ్యులను నవ్వించాడు. బీబీ లవర్స్ ను కూడా పుల్ ఎంటర్టైన్ చేశారు. వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ.. బిగ్‌బాస్‌ను వీడాడు శేఖర్ బాషా.

Bigg Boss 8 Telugu Contestant RJ Shekhar Basha said that this season either Kirrak Sita or anchor Vishnu Priya will win the Bigg Boss title

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత శేఖర్ భాషా వరసగా ఇంటర్వ్యూ ఇస్తూ.. బిజీబిజీ అవుతున్నారు. బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సారి టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారు? అని యాంకర్ ప్రశ్నించగా.. శేఖర్ బాషా బదులిస్తూ.. విన్నర్ ఎవరని కాదు. విన్నర్ ఎవరు కావాలని కోరుకుంటున్నంటే.. కిర్రాక్ సీతా గానీ, విష్ణుప్రియ గానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే బాగుంటుంది. తెలుగువాళ్లని కాదు.. ఇప్పటివరకూ ఏ సీజన్లో కూడా అమ్మాయి విన్నర్ కాలేదు. ఈ సారి టైటిల్ విన్నర్ అయితే.. బాగుంటుంది' అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆ తరువాత టాప్ 5 లో ఎవరంటారని ప్రశ్నించగా.. ' టాప్ 5 లో ఎవరుంటారో చెప్పడం కష్టం. కానీ, టాప్ లో మాత్రం కిర్రాక్ సీతా ఉంటుంది. ఆమె తెలుగు అమ్మాయి.. మన హైదరాబాద్ అమ్మాయి. చిన్న అమ్మాయి. ఆమె ఓ మంచి స్పిరిట్ తో ఆడుతోంది. అలాగే.. విష్ణు ప్రియ కూడా బాగానే అడుగుతుంది. మే బి వీరిలో ఎవరో ఒక్కరూ టైటిల్ విన్నర్ అవుతారు.'అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Bigg Boss 8 Telugu Contestant RJ Shekhar Basha said that this season either Kirrak Sita or anchor Vishnu Priya will win the Bigg Boss title
తెలుగు బిగ్ బాస్లో ఎక్కువ మంది కన్నడ వారే కనిపిస్తున్నారని ప్రశ్నించగా.. శేఖర్ బాషా మాట్లాడుతూ.. 'నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. కానీ,ఒకసారి వాళ్లు ఊరు దాటి.. మనతోటీ ఉంటున్నారంటే.. వారిని మన వారిగానే భావించాలి. కన్నడ వాళ్లు.. తెలుగు వాళ్లు .. అభిప్రాయపడకూడదు' అని ఆసక్తికర సమాధానమిచ్చారు. వరుసగా తెలుగువారి నామినేట్ అవుతున్నారని ప్రశ్నించగా.. తెలుగు వాళ్లని కాదు. అది ఓటింగ్ బట్టే ఉంటుంది. బిగ్ బాస్ వెళ్లకముందు ఎలా ఉన్నానో.. ఇప్పడూ కూడా అలానే ఉంటాను. ఏ విషయానైనా ఓపెన్ గా చెప్పేస్తుంటా.. అని సమాధానమిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X