Bigg Boss Telugu 8: ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన లేడీ కంటెస్టెంట్.. బిగ్ బాస్ హౌస్‌లో దమ్ముకొట్టిందెవరంటే?
Bigg Boss Telugu 8: అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ పేరుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమైంది. గతంలో ఏ సీజన్ ల్లో లేని విధంగా ఈ సీజన్ లో సాలిడ్ కంటెంట్ అందిస్తూ..బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ సీజన్ మిడ్ వీక్ ఎలిమినేషన్, ఎవరూ ఊహించని విధంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఇలా ఎన్నో సర్రైజ్ ఇస్తున్నారు బిగ్ బాస్. అయితే.. అప్పడప్పుడూ కంట్రవర్సీతో హైలెట్ అయ్యే ఈ రియాల్టీ షోలో ఓ లేడీ కంటెస్టెంట్ దమ్ముకొడుతూ అడ్డంగా బుక్కైంది. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ అమ్మడు ఎవరనేది హాట్ టాఫిక్ గా మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి.
బిగ్ బాస్.. తెలుగు బిగ్ బాస్ కి అదిరిపోయే స్పందన దక్కుతూనే ఉంటుంది. ఈ తెలుగు రియాలిటీ షో.. గత ఎనిమిది ఏండ్లుగా ఎంతో పాపులర్ సంపాదించుకుంది. ఈ ఎనిమిదో సీజన్ కూడా ఎన్నో అంచనాలతో ప్రారంభమైంది. ఇప్పటి వరకూ విజయవంతంగా ఐదువారాలు పూర్తి చేసుకుంది. అదే సమయంలో బిగ్ బాస్ రీ లాంఛ్ పేరిట మరో 8 మందిని వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ హౌస్ లోకి పంపించారు. ఇలా ఓజీ టీంలో 8 మంది, రాయల్ టీంలో 8 మంది ఉన్నారు. కాంట్రవర్సీలు, గొడవలు, ఊహించని టాస్కులు, గొడవలు, లవ్ సోర్టీలు, రొమాంటిక్ మూమెంట్స్ తో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు.
అయితే.. ఎంతో జనాధరణ పొందిన ఈ షో చుట్టూ ముసురుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. 24 గంటలు ఒక రూంలో ఆడ, మగ కంటెస్టెంట్లను బంధించి, వాళ్లకు పిచ్చిపిచ్చి టాస్క్‌లు ఇచ్చి వారిని మనసికంగా ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. హౌస్ లో ఎన్నో అసభ్యకర సన్నివేశాలు, హగ్గులు, ముద్దులు, విచ్చల విడిగి వ్యవహరించడం ఇలా బయటకు పడుకుండా వ్యవహరిస్తున్నారనే టాక్ కూడా ఉంది. 24 గంటలు షూట్ చేసి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం చేయటం, ఓటింగ్ పేరుతో తమకు నచ్చిన కంటెస్టెంట్లను హైలెట్ చేయడం, ఎలిమినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్లపై నెగిటివిటీ వచ్చేలా చూపిస్తున్నారనే టాక్ కూడా ఉంది.
ఈ విషయాలనే ప్రస్తవిస్తూ నాలుగో వారం ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల సంచలన వ్యాఖ్యలు చేసిస విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో నిర్వహకులు తనని తప్పుగా చూపించారనీ, ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో కావాలంటే.. చేతులు పట్టుకున్నట్టు వీడియోలు చూపించారని ఆరోపించింది. హౌస్ లో తనకంటే.. ఇతర కంటెస్టెంట్లు బ్యాడ్ గా వ్యవహరిస్తున్నారనీ, ఓ లేడీ కంటెస్టెంట్ ఏకంగా కెమెరా ముందే సిగరెట్స్ తాగుతోందనీ , ఆ విషయాన్ని మాత్రం జనాలకు చూపించారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో ప్రతి సీజన్‌లో స్మోకింగ్ రాయుళ్లతో పాటు స్మోకింగ్ మహారాణులు ఉన్నారంటూ టాక్ వచ్చింది. గత సీజనల్లో తేజస్వి మదివాడ, హమీదా, ముమైత్ ఖాన్, సరయు తదితర లేడీ కంటెస్టెంట్లు హౌస్‌లో దుమాపానం చేశారు. అయితే ఈ సీజన్‌లో స్మోకింగ్ చేసేవాళ్లు ఉన్నారని, కానీ, అమ్మాయి స్మోక్ చేస్తున్నట్టుగా ఎక్కడా చూపించడం లేదంటూ సోనియా సంచలన ఆరోపణలు చేశారు. అయితే.. ఆ లేడీ కంటెస్టెంట్ ఎవరనే విషయం వెలడించలేదు. దీంతో నిఖిల్,పృథ్వీలతో పాటు దమ్ముకొట్టే అమ్మాయి ఎవరనేది హాట్ టాఫిక్ గా మారింది.
హౌస్ లో సిగరెట్ తాగుతున్న బోల్డ్ బ్యూటీ ఎవరబ్బా అని బిగ్ బాస్ లవర్స్ తెగ సెర్చ్ చేశారు. ఈ క్రమంలో కిర్రాక్ సీత నే కావొచ్చని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లో దమ్ముకొడుతున్న అమ్మడు ఎవరో కాదు.. విష్ణు ప్రియ.
వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త కంటెస్టెంట్లు వచ్చిన తరువాత .. కంటెస్టెంట్లందరూ స్విమ్మింగ్ పూల్‌లో మాట్లాడుకుంటున్నారు.



Click it and Unblock the Notifications











