Yashmi Gowda: ఆమెకు నచ్చకపోవడంతో నన్ను విడిచిపెట్టాడు.. లవ్ బ్రేకప్ పై యష్మీ గౌడ క్లారిటీ
Bigg Boss Yashmi Gowda: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఫస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మీ గౌడ (Yashmi Gowda). కన్నడ అమ్మాయి అయినా తెలుగు సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ హౌస్ లో తన ఆట తీరు, డిఫరెంట్ స్ట్రాటజీతో బీబీ లవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ సారి టైటిల్ ఆమెనే గెలువాలని తన ఫ్యాన్ ఆర్మీ కూడా గట్టిగా ట్రై చేస్తుంది. సోషల్ మీడియా ఓ రేంజ్ లో ప్రమోషన్ కూడా ప్రారంభించారు. ఈ తరుణంలో ఆమె గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది. ఆమె బ్రేకప్ రీజన్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
సీరియల్ నటి యష్మీ గౌడ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. తన లవ్ సోర్టీని చెప్పింది. ఒక ఆమె వల్ల తన లవ్ బ్రేకప్ అయిందని ఎమోషనల్ అయ్యింది. తాను సీరియల్ ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లోనే తన లవ్ బ్రేకప్ అయ్యిందనీ, తాను ప్రేమించిన అబ్బాయి వాళ్ల అమ్మగారు తనను రిజెక్ట్ చేసిందనీ, ఆమెకు తాను ఈ ఇండస్ట్రీలో పనిచేయడం ఇష్టం లేదనీ చెప్పేసింది. ఈ కారణంతో ఆ అబ్బాయి కూడా తనని విడిచిపెట్టారని ఎమోషనల్ అయ్యింది. తనకు నచ్చిన కేరీర్ ను విడిపెట్టడం సరికాదనీ, ఎవరి దారి వాళ్లు చూసుకున్నామని చెప్పేసింది.

ఈ విషయం గురించి తొలుత కొన్నాళ్లు బాధపడ్డాను. నెమ్మదిగా ఆ బాధ నుండి బయటపడి, మళ్లీ నా కేరీర్ పై ఫోకస్ చేశానని చెప్పుకోచ్చారు యశ్మీ గౌడ. ఓ ఏడాది కాలం ప్రేమించి.. తన ఇష్టాన్ని గౌరవించకుండా దూరం పెట్టడం చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే.. తాను ప్రేమించిన వ్యక్తి పేరు గానీ, వాళ్ల తల్లి పేరుగాని యష్మీ బయటపెట్టలేదు.
ఇక నటి యష్మీ గౌడ విషయానికి వస్తే.. ఆమె 1995 ఆగస్టు 30న జన్మించారు.ఈమె స్వస్థలం బెంగళూరు. ఈ 28 ఏండ్ల ముద్దుగుమ్మకు సంగీతం, డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూలింగ్ నుంచే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత నటనపై ఫోకస్ పెట్టింది. తొలి 'విద్యా వినాయక' అనే కన్నడ సీరియల్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై కూడా పలు అవకాశాలను అందిపుచ్చుకుంది.

2017 లో ఈ సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన భామ అదిరిపోయే నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత నాగ భైరవి, స్వాతి చినుకులు, త్రినయని, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంది.పలు సీరియల్స్ లో నటిస్తూ తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. మా టీవీలో ప్రసారమయ్యే కృష్ణ మురారి ముకుంద సీరియల్‌లో ముకుందగా మురారి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సీరియల్ లో ముకుంద అనే విలన్ పాత్ర నటించి మెప్పిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 8 తెలుగులో అడుగుపెట్టిన అమ్మడు తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణకు పొందుతోంది.


Click it and Unblock the Notifications











