బిగ్ బాస్ 8 సీజన్ మొదలు.. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..?
బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇక సోషల్ మీడియా మొత్తం ఇదే పేరు వినిపిస్తుంది. బుల్లితెర రియాల్టీ షో గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రతి సీజన్ కు మరింత హైప్ పెంచుకుంటూ పోతుంది. జనాలకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీలను మూడు నెలలు అంటే 90 రోజులు ఒకే ఇంట్లో ఉంచి.. వారందరూ ఎలా ఉన్నారు.. ? ఎలాకొట్టుకుంటున్నారు .. ? దేనికోసం గొడవపడుతున్నారు.. ? వారిలోఎవరిది తప్పు, .. ? ఎవరిది ఒప్పు.. ? అనేది ఈ షోలో చూపిస్తారు. ఇప్పటివరకు బిగ్ బాస్ 7 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది.
బిగ్ బాస్ సీజన్ 1 కుఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. సీజన్ 2 కు నాని హోస్ట్ చేశాడు . ఇక సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు అక్కినేనినాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సీజన్ 8 మొదలయ్యే సమయం. ఈసారి కూడా నాగ్ నే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది . దీనికోసం నాగ్ బాగానే రెమ్యూనిరేషన్ అందుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక లాస్ట్ సీజన్ లో అమర్ దీప్, శోభా శెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంకా అన్నా.. మళ్లొచ్చినా అంటూ వీడియోలు చేసి.. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 కప్పునున అందుకున్నాడు.

ఇక సీజన్ 7 చూసాకా.. సీజన్ 8 లో ఏ సెలబ్రిటీలను తీసుకువస్తారో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా యూట్యూబర్ ఆదిరెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే 18 మంది కంటెస్టెంట్స్ వీరే అని ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇలా బిగ్ బాస్ గురించి యూట్యూబ్ లో వీడియోలు చేసిఫేమస్ అయ్యి.. ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అక్కడ తన సత్తా చూపించి బయటకు వచ్చాకా ఇతర కంటెస్టెంట్స్ యొక్క బలాలు, బలహీనతలను చెప్పుకుంటూ ఇంకా వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. సీజన్ 8 మొదలు కానుంది అని తెలియడంతోనే కంటెస్టెంట్స్ వీరే అని చెప్పుకొచ్చాడు.
ఇక వారు ఎవరు అంటే.. యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ సోనియా సింగ్, నటి హేమ, ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ, రీతూ చౌదరి, సురేఖావాణి లేదా ఆమె కూతురు సుప్రీత, కిరాక్ ఆర్పీ, కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అమృత ప్రణయ్ వచ్చే అవకాశం ఉందట. అలాగే నీతోనే డాన్స్ 2.0 పాల్గొన్న ఒక జంట, లేదా జంటలో ఒకరు రావచ్చట.

అంజలీ పావని, యాంకర్ శివ, నయని పావని, యాంకర్ స్రవంతి చొక్కారపు, మాస్టర్ చెఫ్ సంజయ్, రైతుబడి రాజేంద్రరెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ యూట్యూబర్, ఫారిన్ లో సెటిలైన వ్లాగర్స్ లో ఒకరు ఉండనున్నారట. నిజం చెప్పాలంటే ఇందులో చాలామంది ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళివచ్చినవారు ఉన్నారు. నటి హేమ, నయని పావని ఉన్నారు. ఇక హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను వెళ్లే అవకాశాలు లేవు. ఇక మిగతావారు పేర్లు కొద్దిగా వినిపించేవే.. మరి వీరిలో ఎవరు వెళ్తారు.. ఎవరు వెళ్లరు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే


Click it and Unblock the Notifications











