Bigg Boss Voting: బిగ్‌బాస్ ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న నబీల్.. బిగ్ బాస్ ముద్దుబిడ్డకు ఎలిమినేషన్ తప్పదా?
Bigg Boss Voting: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్ ఈ బిగ్ బాస్ సీజన్ 8 కు దూసుకపోతోంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ 8 దూసుకుపోతోంది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్ లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. కేవలం కంటెస్టెంట్లకే కాదు బీబీ లవర్స్ కూడా దిమ్మతిరిగేలా చేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు వారాలు విజయవంతంగా కంప్లిట్ చేసుకొని నాలుగు వారం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నాలుగో వారం ఓటింగ్ ఎలా నడుస్తుందో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల సీన్స్ ఒక బిగ్ బాస్ షోలోనే చూపిస్తుంటారు. నిజంగా చెప్పాలంటే.. ప్రస్తుతం కొనసాగుతున్న షోలో జరుగుతున్నని, ట్వీస్టులు ఏ సీజన్ లో జరగలేదు. నిన్నటి షోలో బిగ్ బాస్ సంచలన ప్రకటన చేశారు. 'బిగ్ బాస్ ఇంట్లో భూకంపం అంటూ.. బిగ్ బాస్ చరిత్రలో ఒక్కటి కాదు.. రెండు కాదు.. 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు. మరో రెండు వారాల్లో ఈ వైల్డ్ కార్డుల ద్వారా 12 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారు' అంటూ కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే ట్వీస్ట్ ఇచ్చారు. ఇప్పడు 11 మందితోనే షో పీక్స్ చేరుకుంటే.. మరో 12 మంది వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇస్తే.. షో ఎలా ఉండబోతుందో నెవర్ ఎక్స్పెడేట్. అసలు ఊహించడానికే ఆలోచనలు రావడం లేదు కాదా..

ఇక ఓటింగ్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 14 మందితో ప్రారంభం కాగా.. తొలి వారం జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ వెళ్లిపోయారు. మరీ ఆ నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఏ డేంజర్ జోన్ లో ఉన్నారు? ఏ కంటెస్టెంట్ టాప్ లో ఉన్నారో ? ఓ లూక్కేద్దాం.. నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణలు ఉన్నారు. నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి ప్రారంభించారు. ఈ ఓటింగ్ ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నట్లు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. వరంగల్ కుర్రాడు, యూట్యూబర్ నబీల్ ఆఫ్రిది అందరి కంటే ఎక్కువ ఓట్లను సాధించి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడట. గత మూడు రోజులుగా అందరి కంటే ఎక్కువ ఓట్లతో టాప్ ఫ్లేస్ లోనే కొనసాగుతున్నాడు. అన్ని టాస్కులలో 100 శాతం ప్రయత్నిస్తూ.. నిఖిల్, విష్ణు ప్రియ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు నబీల్. నామినేషన్ల టైంలో సోనియా, నబీల్ మధ్య జరిగిన వాగ్వాదం ఓ రేంజ్. సోనియాకు సపోర్టు గా నిలిచిన నిఖిల్, ప్రుధ్వీకి కూడా ఇచ్చిపడేశాడు. ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్ చెప్పుతూ.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.
అలాగే నిన్నటి గేమ్ లో బాల్ టాస్క్లో. బిర్యానీ టాస్క్ లో. . బాల్ ఓల్డింగ్ టాస్క్లో సూపర్బ్ అనిపించాడు. బిగ్ బాస్ కూడా నబీల్ గ్రేట్ అని అప్రిషేట్ చేశారు.
దీంతో ఓటింగ్స్లో నబీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తొలిరోజు ఓటింగ్ ప్రారంభంలో నాలుగో స్థానంలో ఉన్ననబీల్..ఈ వారం దాదాపు 35% ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతున్నాడు. గతంలో ఏ కంటెస్టెంట్ కూడా ఈ రేంజ్లో ఓటింగ్ రాలేదు. అలాగే.. గత ముందు 4 రోజులుగా టాప్ లోనే కొనసాగుతూ ఇతర కంటెస్టెంట్ల రికార్డ్స్ బ్రేక్ చేశారు.

ఆ తరువాత స్థానంలో నాగ మణికంఠ కొనసాగుతున్నారు. నాగమణి కంఠ కూడా ప్రతి టాస్క్ లో తన మార్క్ చూస్తున్నారు. ఆ తరువాత మూడు, నాలుగు స్థానాల్లో ప్రేరణ, ఆదిత్య కొనసాగుతున్నారు. ఇక డేంజర్ జోన్లో పృథ్వీరాజ్ శెట్టి, సోనియా ఆకుల ఉన్నారు. గత మూడు రోజుల ఓటింగ్ చూసుకుంటే.. కేవలం 10 శాతం ఓటింగ్ లో కిందికి పడిపోయారు. ఓటింగ్ పరంగా చూస్తే.. ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి, చివరి స్థానం అంటే ఆరో స్థానంలో బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకుల ఉంది. ఈ నాలుగు రోజుల ఓటింగ్ చూస్తే.. ఈ సారి సోనియా ఆకుల ఖచ్చితంగా ఇంటికి వెళ్లిపోతుందా? బిగ్ బాస్ కు వీడ్కోలు పలికేది ఆమెనేనా అనే సందేహాలు మొదలయ్యాయి. చూడాలి ఈ సారి ఎవరూ ఎలిమినేట్ అవుతారో?


Click it and Unblock the Notifications











