Bigg Boss Nikhil Maliyakkal: ఆ రూమర్స్ నిజమేనా? నిఖిల్ లవ్ బ్రేకప్ అయ్యిందా?
Bigg Boss Nikhil Maliyakkal: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచ్ ఈవింగ్ నుంచి దిమ్మతిరిగే ట్వీస్టులతో కంటెస్టెంట్లకు షాక్ ఇస్తున్నారు బిగ్ బాస్. ఈ సీజన్ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాగా.. తొలివారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. అందులో శేఖర్ బాషా నేడు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇదిలాఉంటే.. ఈ సీజన్ లో ఫేర్ గేమ్ ఆడుతూ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. తొలివారంలో బిగ్ బాస్ లో ముగ్గురు ఛీప్స్ గా ఎన్నిక కాగా.. అందులో ఆయన ఒకరు. అతడే.. నిఖిల్ మలయక్కల్. తొలుత సోనియాకు ఫెవర్ గా ఉన్నట్టు కనిపించిన ఆ తరువాత తన ఆటతీరుతో కింగ్ నాగ్ ను కూడా ఇంప్రెస్ చేశారు.
ఛీఫ్ గా నిఖిల్ మాత్రం బెస్ట్ అనీ, హౌజ్‌ను చీఫ్‌గా శాసించే అధికారం ఆయనకు మాత్రమే ఉందని, నైనికా, యష్మీలు చీఫ్‌లుగా ఉండడానికి అర్హులు కారని నాగార్జున ప్రకటించారు. అన్నారు. కేవలం తన క్లాన్ లో ఒక్కరే ఉన్నా.. ఆయన టీం రేషన్ లేకున్నా.. వేరే కంటెస్టెంట్ డీ మోటివెంట్ చేస్తున్నా నిఖిల్ మాత్రం తన గేమ్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన లైఫ్ స్టైల్ గురించి, లవ్ బ్రేకప్ అంటూ పలు ఆసక్తికర విషయాలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ నిఖిల్ బ్రో కెరీర్ అండ్ లవ్ సోర్టీ ఏంటో ఓ సారి లూక్కేయండి.

అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ అనే కాన్సెప్ట్ తో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి రెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు నిఖిల్. ఆయన పూర్తి పేరు నిఖిల్ మలయక్కల్.. కర్నాటక చెందిన నిఖిల్ పలు కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. కానీ అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలోకి గోరింటాకు అనే సీరియల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి.. లాంటి పలు సీరియల్స్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలలో కూడా పాల్గొని మంచి పాపులర్టీ తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలో నిఖిల్ ను గోరింటాకులో నటిస్తున్న కావ్య శ్రీ తో పరిచయం ఏర్పడింది. కావ్య కూడా కర్ణాటక.. బెంగుళూరు అమ్మాయి. ఈ సీరియల్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించడంతో సూపర్ హిట్ అయింది. అదే సమయంలో కావ్య - నిఖిల్ జంట కూడా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఎంటర్ టైన్మెంట్ షోస్, డ్యాన్స్ షోస్ లలో వీరుద్దరూ కలిసి పాల్గొన్నారు. అంతే కాకుండా.. వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా ప్రారంభించారు. అందులో వీరిద్దరూ కలిసి నటించిన షార్ట్ ఫీల్స్, వీడియోలు, ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేవారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని, వీరిద్దరూ చాలా రోజులు రిలేషన్ లో ఉన్నారని టాక్ వచ్చింది. వీరి రిలేషన్ గురించి ఓ షోలో ప్రశ్నించగా.. కావ్య చాలా మంచి అమ్మాయి అనీ, ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం తాను అద్రుష్టమని చెప్పాడు నిఖిల్. పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఇప్పట్లో ఏం లేదనీ, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని, తన ఇంట్లో పెళ్లి ప్రెషర్ లేదని ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు.

ఏమైందో తెలియదు గానీ.. అంతులోని యూట్యూబ్ లో వీడియోలు చేయడం మానేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరూ అన్ ఫాలో చేసుకున్నారు. సరేలే ఏదో భేదాభిప్రాయం వచ్చింది. మళ్లీ కలుసుకుంటారు లే.. వారి ఫ్యాన్స్ వేయిట్ చేశారు. అయినా ఫలితం లేదు. కనీసం నిఖిల్ బిగ్ బాస్ కు సెలక్ట్ అయితే.. తన ఫ్రెండ్ అందరూ నిఖిల్ కు విషెష్ చెప్పారు. కానీ, కావ్య మాత్రం కానీ..ఓ సెంట్ మెంట్ గానీ, మెసేజ్ పెట్టలేదని టాక్.
కట్ చేస్తే.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినా నిఖిల్.. ప్రస్తుతం తాను సింగిల్ అని చెబుతూ కేవలం ఆటమీద ఫోకస్ చేయడానికి బిగ్ బాస్ కొచ్చానని, ఇక్కడ ఎలాంటి అమ్మాయిని వెతుక్కునే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. తన జీవిత భాగస్వామిని తల్లి తీసుకొస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిఖిల్, కావ్య శ్రీ బంధానికి బ్రేకులు పడ్డాయా? అని వీరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


Click it and Unblock the Notifications











