Bigg Boss Telugu 8 Nominations కంటెస్టెంట్ల మధ్య నామినేషన్ల లొల్లి.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఎక్కడ చూసిన ఇదే గోల.. చాలా తక్కవ సమయంలో బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ పొందిన బిగ్గెస్ట్ షో బిగ్ బాస్. రియాల్టీ కాన్సెప్టుతో.. అడుగడుగున ఎన్నో ట్విస్టులతో సాగే ఈ షో కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హై టీఆర్పీతో దూసుకెళ్తున్నా ఈ షో స్టార్టయిందంటే చాలు.. బీబీ లవర్స్ టీవీలకే అతుక్కపోతారు. ఇంతటి పాపులర్టీ సంపాందిచుకున్న షో దేశంలో ఉన్న పలు భాషల్లో ప్రసారం అవుతుంది. కాగా.. ఇతర భాషాల్లో కంటే.. తెలుగులోనే ఎక్కువగా సూపర్ సక్సెస్ అయ్యింది. ఏ షోకు దక్కని అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుని తెలుగు లో సెన్సేషన్ షో గా మారింది. ఎప్పుడెప్పుడా అని వేచి చూసిన ఈ 'బిగ్‌బాస్ సీజన్-8'సెప్టెంబరు 1 వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే.
కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో ఎన్నో ట్విస్టులు, ఎన్నో టర్న్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్- సీజన్ -8 లో నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో మరింత ఎక్జ్సాసైట్ నెలకొంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా ఏ సీజన్‌లోనైనా నాగార్జున సోమవారమే నామినేషన్స్ జరిగేలా చూస్తారు. కానీ సీజన్ - 8 లో మాత్రం మంగళవారం రోజున హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. నామినేషన్స్ వివరాలను చూసినట్లైతే..

ఏ సీజన్లలోనైనా మొదటి వారం నామినేషన్లు చాలా సిల్లీ సిల్లీ రీజన్స్‌తో జరుగుతుంటాయి. సేమ్ ఇప్పుడు విడుదలైన ప్రోమోలో కూడా ఇలాంటి సిచ్యూవేషనే కనిపిస్తున్నాయి. ఇక బిగ్‌బాస్ చీఫ్ గా నిఖిల్, యష్మీ గౌడ, నైనిక ఎంపికైన విషయం తెలిసిందే. ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ నుంచి వీరు తప్పించుకున్నారు. వీరిని నాగ్ ప్రశంసించి.. ప్రత్యేక కూర్చీలలో కూర్చోమని చెప్పారు. ఇక నామినేషన్స్ స్టార్ట్ అవుతున్నట్లు తెలిపారు.
ఫస్ట్ సోనియా ... బేబక్క, ప్రేరణ కంభం ఇద్దరి ఫొటోలు ఎంపిక చేస్తుంది ఫుడ్ కు సంబంధించిన ఏదో విషయంలో వీరు గొడవ పడతారు. సోనియా బేబక్క మీద ఫుల్ ఫైర్ అవుతుంది. తర్వాత ప్రేరణ, సోనియా మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఒకరికొకరు గట్టి గట్టిగా అరుచుకుంటారు. నువ్వు ఎవరు చెప్పడానికి అంటూ ప్రేరణ.. సోనియా పై దారుణంగా మండిపడుతుంది. అయితే నామినేట్ చేశాక ఇద్దరి కంటెస్టెంట్లలో ఎవరో ఒకరి ఫొటో మీద కత్తి దింపాలి. అలా సోనియా బేబక్క ఫొటో పై కత్తి దింపినట్లుగా ప్రోమోలో చూపిస్తారు. అలాగే వీడియోలో చివరగా కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నిఖిల్, నాగమణికంఠ మధ్య వార్ గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం నామినేషన్స్ వివరాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నామినేట్ అయినవారు వీరే..
మొదటి వారం నామినేషన్స్‌లో పలువురు నామినేట్ అయ్యారంటూ సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రిలీజైన ప్రోమో ప్రకారం చూసినట్లైతే.. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం బాగానే జరుగుతుంది. ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
ఇకపోతే ఒక్కరు నామినేట్ అయినట్లు అయితే క్లారిటీగా అర్థమవుతోంది. వారెవరో కాదు.. బేబక్క. సోనియా.. బేబక్క ఫొటో మీద కత్తి దింపుతుంది.బెజవాడ బేబక్కతో పాటు నామినేషన్స్‌లో మణికంఠ, కిర్రాక్ సీత, నబిల్ ఆఫ్రిది ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











