మణికంఠ ఫ్లాష్ బ్యాక్ నిజం కాదా.. ! నాగార్జున ముందే శేఖర్ భాషా అలా..
Bigg Boss 8 Telugu: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మామూలుగా లేదు. ఈ సీజన్ లాంచ్ ఈవెంట్ నుంచే ట్వీస్టుల మీద ట్వీస్టులు ఇస్తూ దిమ్మతిరిగేలా షాకులు ఇస్తున్నారు. ఇక నిన్న వీకెండ్ కావడంతో కింగ్ నాగార్జున అదిరిపోయే లెవల్ లో ఏంట్రీ ఇచ్చారు. ఏ పండుగ రోజే కాదా.. ఫస్ట్ వీకెండే కాదా.. కాస్తా ప్రశాంతంగానే ఉంటుందని అనుకున్నారు బీబీ లవర్స్. కానీ, వీకెండ్ లో కింగ్ నాగ్ వచ్చి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇక కంటెస్టెంట్ల వాగ్వాదాలతో హౌస్ మరోసారి హీటెక్కింది. ఈ క్రమంలో ఎమోషనల్ కంటెస్టెంట్ మణికంఠపై ఆర్జే శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్ చేశారు. హోస్ కింగ్ నాగార్జున కూడా అవునా అనేలా చేశారు. ఇంతకీ మణికంఠ పై ఆర్జే శేఖర్ బాషా ఏమన్నారో మీరు కూడా ఓ లూక్కేయండి.
ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ వీకెండ్ లో కింగ్ నాగార్జున అదిరిపోయే లెవల్ లో ఎంట్రీ ఇచ్చారు. వినాయక చవితి కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందరూ ఫెస్టివల్ మూడ్ లో ఎంజాయ్ చేశారు. కంటెస్టెంట్ల అందరికీ స్వీట్స్ ఇచ్చి.. ఫెస్టివల్ వీషెస్ చెప్పి అసలు పండుగ మొదలు పెట్టారు. వాస్తవానికి కింగ్ నాగార్జున వీకెండ్ కు వచ్చి.. వారం మొత్తం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, కాంట్రవర్సీలు గురించి తెలుసుకుని క్లాస్ తీసుకుంటారు. ఫర్మెన్స్ కరెక్ట్ లేకుంటే.. హౌస్ నుంచి వెళ్లిపోయాల్సి ఉంటుంది. వార్నింగ్ ఇస్తారు. కానీ సారి రివర్స్ అంటూ షాక్ ఇచ్చారు.

ముందుగా గతవారం హౌస్ చీఫ్ గా సెలక్ట్ అయినా నిఖిల్, నైనిక, యశ్మీ ల రివ్యూ తీసుకున్నారు. ఈ క్రమంలో నిఖిల్ ను గట్టిగానే అరుసుకున్నారు కింగ్ నాగ్. ముగ్గురు చీఫ్స్‌లో నువ్వే స్ట్రాంగ్ ఉంటావనుకుంటే.. అసలేం జరిగింది? అని ప్రశ్నించారు. 'అన్నీ మారుతాయి' అని నిఖిల్ రిప్లే ఇచ్చారు. వెంటనే నాగార్జున మాట్లాడుతూ.. 'ఏం మారుస్తావు మావా' అంటూ పంచ్ వేశారు. నైనిక, యష్మీ లను మెచ్చుకున్నారు. హౌస్ లో ఏ కంటెస్టెంట్ నచ్చలేదో.. ఎందుకు నచ్చలేదో ? చెప్పాలంటూ కంటెస్టెంట్ల మధ్య మరోసారి చిచ్చు పెట్టారు. దీంతో హౌస్ హీటెక్కింది.
ముందుగా ఆర్ జే శేఖర్ భాష ముందుకు వచ్చి తనకు నాగ మణికంఠ నచ్చలేదని చెప్పాడు. ఆయనలో ఏదో ప్రాబ్లమ్ ఉందనీ, తనతో తను మాట్లాడుకుంటున్నాడని అన్నాడు. వెంటనే హోస్ట్ నాగార్జున రియాక్ట్ అవుతూ.. తన ప్రాబ్లమ్ ఏంటో చెప్పాడుగా అని నాగార్జున గుర్తు చేశారు. అది తనకు నమ్మేదిగా లేదని శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ముందుగా ఆర్జే శేఖర్ బాషాకు పిలిచి తన అభిప్రాయాన్ని తెల్పమన్నారు. వెంటనే మణికంఠ తనకు నచ్చలేదనీ, హౌస్ లో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మణికంఠ చుట్టూ మొదటి నుంచి నెగిటివ్ ఎనర్జీ స్ప్రేడ్ చేస్తున్నాడని, అతడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. తన ప్లాష్ బ్యాక్ గురించి చెప్పిన విషయాలతో 'ఐ ఆమ్ నాట్ కన్విన్స్ 'షాక్ ఇచ్చారు. బహుశా ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అబద్దమే కావచ్చు అంటూ ఆర్జే శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జున కూడా అవునా అంటూ ఇంట్రెస్టింట్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు.
ఆ తర్వాత విష్ణుప్రియా, సోనియా మధ్య మాటల తూటాలు పేలాయి. తనకు కోపం వచ్చినప్పుడు తనే మాట్లాడే మాటలు, వాడే పదాలు చాలా హర్టింగ్ ఉంటాయని చెప్పింది సోనియా.. కొన్నిరోజుల క్రితం నీకు నిఖిల్ అంటే పడేది కాదు. ఇప్పుడేమో చాలా క్లోజ్ అయ్యారని సోనియాను విష్ణుప్రియా నిలదీసింది. వెంటనే సోనియా ఏం మాట్లాడుకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. తర్వాత సోనియా మళ్లీ వచ్చి.. నేను మీ అడల్ట్ రేటెడ్ కామెడీలో భాగం కాదని వార్నింగ్ ఇచ్చింది. వెంటనే విష్ణు ప్రియ మాట్లాడుతూ.. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని చెప్పింది. దీంతో సోనియా ఏడవడం మొదలుపెట్టింది. అయినా విష్ణు ప్రియా అసలు తగ్గలేదు. 'నేను కూడా ఏడుస్తా.. నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఈమెనే పుణ్యస్త్రీ, మేము మాత్రం అలాంటివాళ్లం' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











