తొలి ప్రయత్నంలో రూ. 2 కోట్ల నష్టం.. ఆ ఫెయిల్యూర్ తో ఎన్నో నేర్చుకున్నా..

Gautham Krishna: బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ ఒక అడుగు దూరంలో మిస్ అయి.. రన్నర్ అప్ గా నిలిచాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ టైటిల్ గెలవకుండా ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాడు. పీపుల్స్ విన్నర్ గా నిలిచాడు గౌతమ్. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన గౌతమ్ తన వైల్డ్ ఫైర్ ఏంటో చూపించాడు. అశ్వద్ధామ 3.0 అంటూ తనదైన స్టైల్ లో ఆడుతూ కంటెస్టెంట్లకు చుక్కలు చూపించాడు. తన ఆట తీరుతో, తన మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించాడు.

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గౌతమ్ కృష్ణనే అని భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా నిఖిల్ టైటిల్ విన్నర్, కాగా గౌతమ్ రన్నర్ అప్ గా నిలిచాడు. గౌతమ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని, కానీ స్టార్ మా బ్యాచ్ మాత్రం కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ విన్నర్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఎలా చేసినా విన్నర్ విన్నరే.. రన్నర్ రన్నరే.. కాబట్టి, గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గెలుచుకోవడంలో విపులమయ్యాడని చెప్పాలి.

Bigg Boss 8 Telugu Runner Up Gautham Krishna about His First Movie Akasha Veedullo Failure

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో అనంతరం గౌతమ్ కృష్ణ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన బిగ్ బాస్ జర్నీ ని తన ఫ్యూచర్ ప్లానింగ్స్ పంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. తన సినీ ప్రయత్నాల గురించి, సినీ ఇండస్ట్రీ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. వాస్తవానికి గౌతమ్ కృష్ణ.. బిగ్ బాస్ సీజన్ 8 లోనే కాకుండా సీజన్ 7 లో కూడా పాల్గొన్నారు. ఆ సీజన్లో గౌతమ్ 13 వారాలపాటు బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంటర్టైన్ చేశారు. ఆ షో నుండి వచ్చిన పాపులార్టీ ద్వారా గౌతమ్ హీరోగా 'ఆకాశవీధుల్లో ' అనే సినిమా చేశాడు. ఆ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు గౌతమ్. ఆ సినిమాకు గౌతమ్ హీరోనే కాకుండా .. డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ కూడా అతడే.

Bigg Boss 8 Telugu Runner Up Gautham Krishna about His First Movie Akasha Veedullo Failure

వాస్తవానికి గౌతమ్ డాక్టర్ చదువుకొని యాక్టర్ గా మారాడని చెప్పుకోవాలి. తన కొడుకు నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో గౌతమ్ తండ్రి, అతని స్నేహితులు ఆర్థిక సహాయం చేయడంతో 'ఆకాశ వీధుల్లో' అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించగా.. అయితే ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు తాను కష్టపడ్డారట. అయితే ఈ సినిమా సరిగ్గా ఆడక పోవడంతో దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చిందట ఈ విషయాన్ని గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గౌతమ్ కృష్ణ తన మొదటి సినిమా 'ఆకాశవీధుల్లో' గురించి మాట్లాడుతూ తన మొదటి సినిమాకు తానే హీరో నని అలాగే డైరెక్షన్, రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానేనని చెప్పాడు. ఫెయిల్యూర్ నుండి ఎక్కువ నేర్చుకుంటాం కదా అన్నట్లు తాను కూడా ఆ సినిమా నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నననీ, చిన్నతనంలో తెలియని తనం వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ, ఆ అనుభవం ద్వారా తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, తనకు డబ్బిస్తే చాలు .. ఒక ఫిలింను పూర్తిగా నిర్మించి ఇవ్వగల సామర్థ్యం తనకు వచ్చిందని కాన్ఫిడెంట్గా చెప్పుకొచ్చారు.

తన తొలి సినిమా కోసం తాను రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డానని, ఆ సినిమా చేయడం వల్ల తనకు 24 క్రాప్స్ పై అవగాహన వచ్చిందని గౌతమ్ చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఒక సీన్ ఇచ్చి దాని ఎడిటింగ్ చేయమన్న తాను చేస్తానని, స్క్రీన్ ప్లే కూడా తాను రాస్తానని, అలాగే డైరెక్టర్ కూడా చేయగలనని చెప్పుకొచ్చారు. ఆ సినిమా కోసం తన తండ్రి అతని ఫ్రెండ్స్ తనను నమ్మి డబ్బు ఇన్వెస్ట్ చేశారని, కానీ ఆ సినిమా సరిగా ఆడలేకపోయిందని చెప్పుకొచ్చారు. ఆ సినిమాతో దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం తాను మరో సినిమాలో నటిస్తున్నారని గౌతమ్ తెలిపారు. తన రెండో సినిమాకు ప్రొడ్యూసర్ దొరికారని, అందుకే ఇప్పుడు నా తన రెండవ సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు. ఆ సినిమా ప్రమోషన్లను తన భుజాల మీద వేసుకున్నాననీ, నిర్మాతకు ఖర్చులు భారం కాకుండా చాలా ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. సినిమా ఎంత ప్రమోషన్ చేయాలో.. ఎలా ప్రమోట్ చేయాలో.. తనకు తెలిసి వచ్చిందని గౌతమ్ కృష్ణ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X