నాగార్జున..ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయి..సోషల్ మీడియాలో ఆటాడుకొంటున్న నెటిజన్లు
చాలా మందికి ఎప్పుడూ కూడా పక్కన ఉన్నవాళ్ళ మీద ఇంట్రెస్ట్ తమ పనులు మీద కూడా ఉండదు. అలా పక్కన వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా మంచి ఎంటర్టైన్మెంట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇదే కొంచెం నోటెడ్ సెలెబ్రటీలు కొట్టుకుంటే ఇంకా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వచ్చినట్టే అని చెప్పాలి. కాగా సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో హిట్ అయ్యిన సెన్సేషనల్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పాలి.
మరి మొదటిగా వెస్ట్రన్ కంట్రీస్ లో మొదలైన ఈ రియాలిటీ షో ఇపుడు లోకల్ గా కూడా పాపులర్ అయ్యింది. ఇలా తెలుగులో మొత్తం 7 సీజన్లు పూర్తయ్యి ఇప్పుడు ఎనిమిదవ సీజన్లోకి వచ్చేసింది. కాగా ఈసారి షో పై కూడా ఎప్పటి లానే కొంచెం పాజిటివ్ కొంచెం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసారి సీజన్లో అప్పుడే మంచి డ్రామా కూడా మొదలు కావడంతో షో వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అయ్యింది.

అయితే ప్రతి సీజన్లో కూడా ఒకో కంటెస్టెంట్ పై ఒకో మార్క్ ఆడియెన్స్ లో పడుతుంది. అలా ఈసారి సీజన్లో ఒక ఇరిటేటింగ్ కంటెస్టెంట్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు చాలా కొత్త మొహంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యిన నాగ మణికంఠ. ఇతడు ఎంటర్ అవ్వడమే కొంచెం ఓవర్ యాక్షన్ తో ఎంటర్ అయ్యాడు అని టాక్ ఉంది. దూకుడు సినిమాలోని డైలాగ్ వాడుతూ.. నాగార్జున అతడిని ఎలిమినేట్ చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక రోజుల్లోనే చూపించిన షేడ్స్ చూసి సోషల్ మీడియాలో షో వీక్షకులు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా అతడిపై కొన్ని ట్రోల్స్ వీడియోస్ కూడా చేసి మహానటుడు అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి వచ్చిన కొన్ని రోజులకే ఇతడు ఇంత ఇరిటేట్ చేస్తే ఇక ముందు రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఇక మరో పక్క ఈ నాగ మణికంఠతో పాటుగా సోషల్ మీడియాలో ప్రముఖ హీరో రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా పై కూడా పలు ట్రోల్స్ నడుస్తున్నాయి. షోలో తన లేకి కామెడీతో తెప్పిస్తున్నాడు అని కొన్ని వాంటెడ్ పంచ్ లు వేసి ఏదో ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా ఇతనిపై కూడా కొంచెం ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది.
కాగా ఈసారి సీజన్ కి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా చేస్తుండగా షో ప్రతి రోజు రాత్రి స్టార్ మా లో 9 గంటల 30 నిమిషాలకి ప్రసారం అయితే 24 గంటల స్ట్రీమింగ్ వారి ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ప్రస్తుతానికి అయితే షో అయితే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కాంట్రవర్సీ తోనే కొనసాగుతుంది. మరి చూడాలి ఈసారి ఎవరు బాగా ఆడి మంచి ఫేమ్ ని తెచ్చుకుంటారో ఎవరు విలన్ గా మారుతారో అనేది.


Click it and Unblock the Notifications











