Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అర్ధరాత్రి మసాజ్ లు.. వాళ్లిద్దరి మధ్య ఏం నడుస్తుంది?
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ లు, లవ్ స్టోరీలు కొత్తేమి కాదు. గత సీజన్లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఎన్నో రొమాంటిక్ సీన్స్ లవ్ స్టోరీస్ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ, పృథ్విరాజ్ తీరు కాస్త వివాదాస్పదం మారుతోంది. వీరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏముందో ? మీరు కూడా ఓ లూక్కేయండి.
బిగ్ బాస్ మూడవ సీజన్లో.. రాహుల్ సిబ్లిగంజ్- పునర్నవి మధ్య సాగిన రొమాన్స్ నేటికీ చర్చనీయమే. వారి లవ్ స్టోరీ కోసమే ఆ సీజన్ చూశారంటే అతిశయోక్తి కాదు. ఈ లవ్ బర్డ్స్ ను .. బిగ్ బాస్ కంటెస్టెంట్లే కాకుండా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ఈ జంటపై బిబి ఆడియన్స్ లో ఓ పాజిటివ్ టాక్ ఉంది. హద్దులు దాటకుండా సాగిన వీరి ప్రియమైన సీజన్ 3కి హైలెట్. ఆ తర్వాత సీజన్ 4 లో అఖిల్ సార్ధక్ మోనాల్ మధ్య కూడా ప్రేమాయణం సాగింది. వారు ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. ప్రతి టాస్క్ లోను ఒకరిపై ఒకరు ఇష్టాన్ని కనబరిచే వాళ్ళు.

అదే సీజన్లో అభిజిత్ - హారిక అలేఖ్య మధ్య కూడా లవ్ స్టోరీ సాగినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో బిగ్బాస్ లవ్ బర్డ్స్ అనే ముద్ర కూడా వేశారు. ఇక ఐదు సీజన్లో షణ్ముఖ్-సిరి ల మధ్య లవ్ ట్రాక్ కొనసాగింది. వీరిద్దరూ ఎంత గొడవ పడిన మరుక్షణం కలిసి పోయేవారు. వీరి గిల్లికజ్జాలు, రొమాంటిక్ మూమెంట్స్ ఆనాటి సీజన్ కు బూస్ట్ ఇచ్చాయని చెప్పాలి. ఇక ఆరో సీజన్లో ఇనయ సుల్తానా రూటే సపరేటు. ఏకంగా కంప్రెషన్ రూమ్ లోకి వెళ్లి.. ఆర్ జె సూర్య అంటే తనకి ఇష్టం అంటూ వెల్లడించి అందరిని షాక్ గురించి చేసింది.
ప్రతి టాస్క్ లోను ఆమె సూరియాలు విడిచిపెట్టి ఉండేది కాదు. సూర్య ఎలిమినేట్ ఆయన సందర్భంలో ఆమె ఏడ్చిన క్లిప్పింగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఏడో సీజన్లో చెప్పుకోదగ్గ లవ్ స్టోరీస్ అంతగా ఏమీ లేవు. ఆ సీజన్ కంటెస్టెంట్ల మధ్య లవ్ స్టోరీ అంతగా వర్కౌట్ కాలేదు.
ఇక లేటెస్ట్ సీజన్ 8 లో పృద్వి, సోనియా, నిఖిల్ లు సన్నిహితంగా మెలగడంతో.. ప్రేమదేశం సినిమా మాదిరిగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని, కంటెస్టెంట్ లే కాదు బిగ్ బాస్ లవర్స్ కూడా భావించారు. అయితే వారిద్దరూ తనకు బ్రదర్స్ అని, చిన్నోడు పెద్దోడు అని సంబోధించడంతో సోనియా వెల్లడించడంతో ఆ రిలేషన్ పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఈ సీజన్లో పృథ్వి విష్ణుప్రియ ల మధ్య ఏదో తెలియని ట్రాక్ మాత్రం నడుస్తోంది. విష్ణుప్రియ మొదటి నుండి పృథ్విరాజ్ అంటే ఆసక్తి చూపుతోంది.

నాలుగో వారం వరకు వీరి మధ్య విష్ణుప్రియకు సోనియా ఆకుల అడ్డుగా ఉండేది. కానీ, సోనియా ఎలిమినేషన్ తో విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పాలి. విష్ణుప్రియ .. గేమ్ మీద కంటే పృథ్వి మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. తాజాగా.. అర్థరాత్రి వేళ పృథ్వికి విష్ణు ప్రియ సేవలు చేయడం, తన కాళ్ల మధ్య కూర్చో బెట్టుకుని మసాజ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్ధరాత్రి పృథ్వి తలకు మసాజ్ చేస్తున్న విష్ణుప్రియ చూసి కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు.
విష్ణు ప్రియ గేమ్ పై కాకుండా పృథ్వీరాజ్ పై ఫోకస్ చేయడంతో బిగ్బాస్ లవర్స్ కూడా ఆమె గేమ్ ను ఇష్టపడడం లేదు. తొలివారాలలో టాప్ కంటెంట్ గా ఉన్న విష్ణు ప్రియ గత మూడు నాలుగు వారాల నుండి.. లిస్టు ప్లేస్ లో నిలిచి డేంజర్ జోన్ లో ఉంటుంది. ఇప్పటికైనా తన ఆటపై ఫోకస్ చేయకపోతే త్వరలోనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా పృథ్వి పై ఫోకస్ చేయకుండా గేమ్ పై ఫోకస్ చేస్తుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











