Bigg Boss 8 Telugu: నయని పావనితో పులిహోర.. శృంగారలీలలపై పృథ్వీ కి విష్ణుప్రియ వార్నింగ్
Bigg Boss 8 Telugu:బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్, రొమాంటిక్ సీన్స్ కొత్తవి కాదు. ప్రతి సీజన్ లోనూ ఏదొక లవ్ స్టోరీ బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. ఈ లవ్ సోర్టీస్ కోసమే బిగ్ బాస్ ను చూసే ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలా సీజన్ 8 లో కూడా ఓ ప్రేమ జంట బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. వారెవరో కాదు. పృద్వి- విష్ణు ప్రియ. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే విషయం అందరికి తెలిసిపోయింది. వాళ్లు కూడా అలానే ఉంటున్నారు. అయితే.. ఇటీవల పృథ్వీ.. విష్ణుప్రియను కాకుండా.. నయని పావనితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ కి విష్ణుప్రియ వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది
బిగ్బాస్ సీజన్ 8 ప్రారంభంలో.. సోనియా పృథ్వి నిఖిల్ పేర్లు బాగా వినిపించాయి. వీరి ముగ్గురు మధ్య 'ప్రేమదేశం' మాదిరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందనే అనుమానం బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులలో కూడా వచ్చింది. అయితే.. వాటన్నిటికీ చెక్ పెడుతూ సోనియా వారిద్దరిని చిన్నోడు పెద్దోడు అంటూ పిలిచి రిలేషన్ పై క్లారిటీ చేసింది. అయినా వారి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానం అప్పట్లో ఉండేది. సోనియా ఎలిమినేట్ అవడంతో ఆ స్టోరీ ఎండ్ కార్డు పడింది.

ఆ తర్వాత విష్ణు ప్రియ- పృథ్వీల లవ్ ట్రాక్ గురించి వార్తలు వచ్చాయి. విష్ణుప్రియ మొదటి నుండి పృథ్విరాజ్ అంటే ఆసక్తి చూపుతోంది. అంతకు ముందు ప్రుద్వీతో మాట్లాడుతామంటే.. సోనియా కాస్త అడ్డుగా ఉండేది. ఇక సోనియా ఎలిమినేషన్ తో విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. అప్పటి నుంచి విష్ణుప్రియ .. గేమ్ మీద కంటే పృథ్వి మీదే ఎక్కువ ఫోకస్ పెడుతోందనే చెప్పాలి. ఏదిఏమైనా వీరిద్దరి మధ్య ఘాటు ప్రేమాయణం కొనసాగుతుందని, ఈ విషయాన్ని వారిద్దరూ చెప్పకనే చెప్తున్నారు.
ఈ విషయం తెలుగు రాష్ట్రాలలో వైరల్ గా మారిపోయిందని, మీ ఇద్దరి ఫెయిర్ కు ఫ్యాన్స్ ఉన్నారని దీపావళి స్పెషల్ షో రూమ్ హైపర్ ఆది కూడా బాంబు పేల్చాడు. అంతేకాదు.. నువ్వు బయటకు టైటిల్ తో వస్తావా? లేదా బావతో వస్తావా? అని తన చెల్లె కూడా భయపడుతుందని షాపింగ్ కామెంట్స్ చేశాడు. తాను రెండిటితో వస్తానంటూ విష్ణు ప్రియ స్టన్నింగ్ రిప్లై ఇచ్చింది. సమీరా భరద్వాజ్ కూడా తన పాటలో విష్ణు ప్రియ- ప్రుధ్వీ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసింది.
అయితే వీరిద్దరి మధ్య.. నాయిని పావని ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. గతవారం పృద్వి,విష్ణువుకి మధ్య గొడవ కావడంతో .. విష్ణును కావాలని పృథ్వి దూరం పెడుతున్నాడు. నాయిని పావనితో క్లోజ్ గా మూవ్ అవుతూ పులిహోరా కలుపుతున్నాడు ప్రుధ్వీ. మొత్తానికి ఎక్కవ సమయం పవనితోనే టైం స్పెండ్ చేస్తూ విష్ణు ప్రియకు ఇరిటేట్ చేస్తున్నాడు పృద్వి.
ఈ క్రమంలోనే ఓ నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో లో పృథ్వి నాయిని పావనిలు ఒకే కొబ్బరి బొండంలో నీళ్లు తాగడం .. అ విషయం విష్ణు ప్రియ కంటబడటం. దీంతో విష్ణు ప్రియ.. పృద్వి దగ్గరికి వచ్చి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తనను దూరం పెట్టొద్దని, తనకు ఏం కావాలంటే అది ఇస్తానంటూ రిక్వెస్ట్ చేసుకుంది. లాస్ట్ వీక్ బ్రేక్ అప్ అయింది కదా అంటూ పృద్వి కూడా విష్ణువుని టీజ్ చేశాడు. విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నిజం చెప్పు నేనే నిజంగానే నచ్చిందా అంటూ పృద్విని అడిగిన తీరు ఎంతో క్యూట్ గా ఉంది . ఆ డైలాగ్ మాత్రం ఈ వీడియోకు హైలెట్.
ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. పృద్వి కావాలని విష్ణు దూరం పెడుతున్నాడని బిగ్బాస్ లవర్స్ కూడా ఫీలవుతున్నారు. పాపం విష్ణు అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











