Bigg Boss Telugu 8: దిమ్మతిరిగే ట్వీస్ట్.. బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేట్!
Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్ లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. కేవలం కంటెస్టెంట్లకే కాదు బీబీ లవర్స్ కూడా దిమ్మతిరిగేలా చేస్తున్నారు. దీంతో గతంలో ఏ సీజన్ కు రాని హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ 8 దూసుకుపోతోంది. అయితే.. ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ వేచి చూసేది ఒక్కటే. నాలుగో వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారని క్యూరియాసిటీతో ఉన్నారు. ఎవరూ హౌస్‌ను వీడి ఇంటి బాట పట్టనున్నారని జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
బిగ్ బాస్ ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పడూ లేని విధంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, హక్కులు, ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల సీన్స్ ఒకే ఒక్క బిగ్ బాస్ షోలోనే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకూ బిగ్ బాస్ 8 లో విజయవంతంగా మూడు ఎలిమినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ లవర్స్ అందరూ నాలుగో వారం ఎవరూ ఎలిమినేట్ కాబోతున్నరనే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ప్రజెంట్ హౌస్ లో 11 మంది ఉన్నారు. గత మూడు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. కానీ శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ కూడా ఎలిమినేట్ అవ్వడం ఊహించని పరిణామమే అని చెప్పుకోవచ్చు.
ఇక నాలుగో వారం ఎలిమినేషన్స్ లో బిగ్ బాస్ కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరిగా సాగింది. ఈ క్రమంలో నబీల్ తో సోనియా, పృథ్విరాజ్ వాగ్వాదానికి దిగారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయ్యాక బిగ్‌బాస్.. నబీల్, సోనియా, పృథ్విరాజ్, ప్రేరణ, నాగ మణికంఠ, ఆదిత్య ఓం నామినేట్ అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఇలా ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. ఈ క్రమంలో తమ కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి నిన్న (శుక్రవారం) ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అభిమానులు కంటెస్టెంట్లకు ఓ రేంజ్ లో ఓట్లు గుద్దినట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం.. నబీల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. నాగ మణికంఠ రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ మాత్రం సేఫ్ పోజిషన్ లో ఉన్నారు. అయితే.. నాగమణికంఠ విషయంలో నెట్టింట్లో ఓ సందేహం నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ సారి అతడ్ని సీక్రెట్ రూం కి పంపిచాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇటీవల ఆయనను ఇతర కంటెస్టెంట్లు టార్గెట్ చేయడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాస్తా రిలీఫ్ ఇవ్వడానికి సీక్రెట్ రూంకి పంపాలని భావించినట్టు తెలుస్తోంది. పంపారా? లేదో ? తరువాత ఎపిసోడ్ లో తెలుస్తోంది.
ఆ తరువాత మూడు ప్రేరణ ఉండగా, నాలుగు స్థానాల్లో ఆదిత్య ఓం నిలిచారు. ఇక డేంజర్ జోన్లో పృథ్వీరాజ్ శెట్టి, సోనియా ఆకుల ఉన్నారు. గత మూడు రోజుల ఓటింగ్ చూసుకుంటే.. కేవలం 10 శాతం ఓటింగ్ లో కిందికి పడిపోయారు. ఓటింగ్ లో వీరు చాలా వెనకున్నారని టాక్. ఆదిత్య కూడా గేమ్ పరంగా చాలా వెనకబడ్డారు. ఇక సోనియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. పూర్తి నెగిటివిటీని మూటగట్టుకుంది. దీంతో ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి, చివరి స్థానం అంటే ఆరో స్థానంలో బిగ్ బాస్ ముద్దుబిడ్డ సోనియా ఆకుల ఉంది. నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లందరి కంటే.. సోనియాకే అత్యంత తక్కువ ఓట్లు పడ్డాయి.

సోనియా ఆకుల తనని తానే పెద్ద తోపు అని ఫీలవ్వడం. నిఖిల్, పృథ్వీలను తన చేతివేళ్లపై ఆడించడం, ఇద్దరు మగ కంటెస్టెంట్లతో ఆమె బిహేవియర్ కాస్త భిన్నంగా ఉండటంతో జనాలు సోనియాపై విరుచుకుపడుతున్నారు. ఆ ఆట తీరు కూడా చాలా వెరైటీ గా ఉంది. ఈ ఎక్స్ ట్రా యాక్టివిటీస్ నచ్చకనే ఆపరేషన్ సోనియాను హౌస్ నుండి ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు కంకణం కట్టుకున్నటు ఉంది. ఈ వారంలో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారంటూ నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఇదే గనుక జరిగితే.. ఇక ఈ వారం సోనియా, పృథ్వీ రాజ్ ఎలిమినేట్ అవుతారు. లేదు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం 99 శాతం సోనియా ఆకుల హౌస్ వీడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరో రకంగా చూస్తే.. సోనియా వల్లే కాస్తో కూస్తో.. ఎక్స్ ట్రా కంటెంట్ వస్తోంది. కాబట్టి ఆమెను పంపించుకుండా. బిగ్‌బాస్ టీమ్ ఏదైనా పెద్ద ఫ్లాన్ వేసిందా? లేదా సోనియానే ఎలిమినేట్ చేశారా? అనే సందేహం రాకమానదు. లేదా సీక్రెట్ రూమ్ కు పంపిచడమో.. ఇప్పడూ ఎలిమినేట్ చేసి.. మళ్లీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీలతో
పాటు తిరిగి తనను హౌస్‌లోకి తీసుకున్నరో కూడా తెలియదు. ఏం జరుగుతుందా వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











