బిగ్‌బాస్ నుంచి సామ్రాట్ బయటకు.. గీతా మాధురికి బిగ్‌బాస్ టార్చర్.. దీప్తి కాళ్లు మొక్కిన అమిత్

Recommended Video

Bigg Boss Season 2 Telugu : 87th Episode Highlights

బిగ్‌బాస్ ఇంటిలో 87 రోటీన్‌గా సాగిపోయింది. క్రితం రోజు కొనసాగిన టాస్క్ మళ్లీ సాగడంతో పెద్దగా ఆసక్తిలేకపోయింది. నిన్న వేసిన పాటలకే సెలబ్రీటీలు మొక్కుబడిగా వేసిన డ్యాన్సులు బోర్ కొట్టించాయి. బుధవారం రోజున ఇచ్చిన కొన్ని టాస్కులను ఇంటి సభ్యులు పూర్తి చేశారు. పెద్దగా చెప్పుకొనే విధంగా, ఆసక్తికరంగా లేకుండా బిగ్‌బాస్‌లో ఓ రోజు గడిచిపోయింది. కాకపోతే కొన్ని సంఘటనలు నవ్వుల్లో ముంచెత్తాయి. బుధవారం ఏం జరిగిందంటే..

డ్యాన్స్ ఫ్లోర్ మీద స్టెప్పులు

డ్యాన్స్ ఫ్లోర్ మీద స్టెప్పులు

సినిమా పాటలకు డ్యాన్స్ ఫ్లోర్ మీద స్టెప్పులు వేసే కార్యక్రమం నిరవధికంగా సాగిపోయింది. ఇంటి సభ్యులు తమ డ్యాన్యులతో హోరెత్తించారు. వేసిన పాటనే మళ్లీ మళ్లీ వేసి ఇంటి సభ్యులను విసిగించారు.

గీతా మాధురికి బిగ్‌బాస్ టార్చర్

గీతా మాధురికి బిగ్‌బాస్ టార్చర్

ఇక గీతా మాధురికి బిగ్‌బాస్ టార్చర్ పెట్టాడు. టాయిలెట్‌కు వెళ్దామని బాత్రూం వద్దకు వెళ్లగానే జిగేల్ రాణి పాట వేసి పరుగులు పెట్టించాడు. బాత్రూం వద్ద నుంచి పరుగులు పెట్టి డ్యాన్స్ ఫ్లోర్ వద్దకు చేరుకోగానే పాటను ఆపేయడం, ఆ తర్వాత గీతా మాధురి బాత్రూం వద్దకు చేరగానే మళ్లీ పాట వేయడం జరిగింది.

గీతా మాధురితో అలా ఆటలాడుకొన్న

గీతా మాధురితో అలా ఆటలాడుకొన్న

గీతా మాధురితో అలా ఆటలాడుకొన్న బిగ్‌బాస్ ఆమె సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు బాత్రూంలో దూరడంతో జిగేల్ రాణి పాట ప్లే చేశాడు. అయితే పాట చివర్లో ఉండగా గీతా డ్యాన్స్ ఫ్లోర్ వద్దకు చేరుకొన్నది. పాటపై డ్యాన్స్ చేస్తూ చేతి వేలి (వన్ ఫింగర్)ని చూపిస్తూ ఇది న్యాయమా అని ప్రశ్నించింది.

దీప్తి నల్లమోతు వేసిన బొమ్మను

దీప్తి నల్లమోతు వేసిన బొమ్మను

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మరో టాస్క్ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ఓ పదాన్ని ఇచ్చి దానిని బోర్డుపై ఓ సభ్యుడు బోమ్మ గిస్తే మరో సభ్యుడు దాని అర్థం చెప్పాలి. బీస్ట్ అనే పదానికి దీప్తి నల్లమోతు వేసిన బొమ్మను చూసి ఇంటి సభ్యులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. దానిని తట్టుకోలేక దీప్తికి అమిత్ కాళ్లు మొక్కినంత పనిచేశారు.

కౌశల్ ప్యాంటు ఊసిపోయింది.

కౌశల్ ప్యాంటు ఊసిపోయింది.

ఓ దశలో కౌశల్ ప్యాంటు ఊసిపోయింది. దానిని కట్టుకొంటుండగా తౌబా తౌబా పాట ప్లే చేశాడు. దాంతో ఓ చేతితో ప్యాంటు పట్టుకొని.. డ్యాన్సలు చేశాడు. దుప్పటి కప్పి ప్యాంటు కట్టుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా బిగ్‌బాస్ అడ్డుకొన్నాడు. అయితే జారిపోయి ప్యాంటుతోనే డ్యాన్స్ చేశాడు.

అర్ధగంటకు ఓ కేకును

అర్ధగంటకు ఓ కేకును

టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కొంత సమయం వ్యవధిలో బిగ్‌బాస్‌ కేకులు పంపించాడు. ప్రతీ అర్ధగంటకు ఓ కేకును పంపించి ఇంటి సభ్యులను తినమన్నాడు. గీతా, దీప్తి కేకులు తినలేక మాకొద్దు బాబోయ్ అంటూ పరుగులు పెట్టారు.

ఇంటి నుంచి సామ్రాట్ బయటకు

ఇంటి నుంచి సామ్రాట్ బయటకు

బిగ్‌బాస్‌లో టాస్క్ జరుగుతుండగానే సామ్రాట్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచారు. కోర్టు పనిమీద బయటకు వెళ్లి రావాల్సినందున మీమ్మల్ని ఇంటి నుంచి పంపిస్తున్నాం అని సామ్రాట్‌కు బిగ్ బాస్ చెప్పాడు. అందుకు సరేనని సామ్రాట్ చెప్పడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X