బిగ్ బాస్ రేటింగ్ లెక్కల ప్రకారం.. వాళ్ళిద్దరూ నామినేషన్స్ లో ఉన్నా లేనట్లే
బిగ్ బాస్ సీజన్ 4 ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలైంది అంటే చాలు కంటెస్టెంట్స్ ఉహీంచని విధంగా యూ టర్న్ తీసుకుంటున్నారు. ఇక 8వారం ఉహీంచినట్లుగానే కొందరు నామినేషన్ లిస్ట్ లో చేరారు. అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా, అమ్మా రాజశేఖర్ వంటి వారు చేరారు. ఇక మెయిన్ గా అమ్మా రాజశేఖర్ నామినేషన్ ప్రక్రియ నాటకీయంగా జరగడం హాట్ టాపిక్ గా మారింది.
అమ్మా రాజశేఖర్ తో మొన్నటి వరకు బాగానే ఉన్న లాస్య, సోహైల్ ఆయననే నామినేట్ చేయడం విశేషం. అయితే ఈ లిస్ట్ లో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరైనా కూడా ఇద్దరు మాత్రం బిగ్ బాస్ రేటింగ్ లెక్కల ప్రకారం సేవ్ అవుతారని తెలుస్తోంది. ఇక వాళ్ళు మరెవరో కాదు. లవ్ బర్డ్స్ అఖిల్, మోనాల్. ఈ ఇద్దరు మొదటి నుంచి కూడా రొమాంటిక్ సీన్స్ తోనే జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరు హౌజ్ నుంచి వెళ్లిపోతే మసాలా డోస్ తగ్గినట్లే లెక్క.

ఎలిమినేషన్స్ ప్రక్రియలో కూడా అబిజిత్, అఖిల్, మోనాల్ ఉన్నారని తెలిస్తే అందరికి చాలా ఈజీగా అర్ధమవుతోంది. వాళ్ళు ఇప్పట్లో హౌజ్ నుంచి వెళ్లిపోవడం జరగదని, ఒకవేళ వెళ్లిపోతే బిగ్ బాస్ రేటింగ్ లెక్కలు మారతాయని అందరికి ఈజీగా అర్ధమవుతోంది. ఇక ఈ వారం కూడా నామిమేషన్స్ లో అఖిల్, మోనాల్ ఉన్నా కూడా వాళ్ల జోలికి పొరని కామెంట్స్ వస్తున్నాయి. కానీ చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే ఈ వారం అమ్మా రాజశేఖర్ పై టార్గెట్ సెట్ చేసినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











