Bigg Boss 9: ఫినాలేకి ముందే డబుల్ ఎలిమినేషన్.. దివ్యతో పాటు మరొకరు అవుట్..
Bigg Boss 9 Double Elimination: అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. ఇప్పుడు 12 వారం పూర్తి చేసుకుని 13 వారంలోకి అడుగుపెట్టబోతుంది. గ్రాండ్ ఫినాలేకు మరో రెండు వారాల్లో చేరువ కానున్నది. దీంతో హౌస్‌లో గేమ్ మరింత వేడెక్కింది. టైటిల్ కోసం పోరాడుతున్న కంటెస్టెంట్లకు ఈ వారం హోస్ట్ నాగార్జున డబుల్ షాక్ ఇచ్చారు. సాధారణంగా ఒక ఎలిమినేషన్ జరిగే వేళ.. డబుల్ ఎలిమినేషన్ చేయబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌తో బిగ్ బాస్ గేమ్‌ను పూర్తిగా తారుమారు చేయబోతున్నారు. ఇంతకీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఫినాలేకు ముందే డబుల్ ధమాకా!
ఫ్యామిలీ వీక్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. కొన్ని సందర్భంలో విచక్షణ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఇద్దరు ఇంటికి వెళ్లడం తప్పదని బిగ్ బాస్ ఇచ్చిన అలర్ట్, హౌస్‌లో భూకంపాన్ని సృష్టించింది. ఇంట్లో చివరి రేసులో ఉన్న కీలక కంటెస్టెంట్లకు ఈ ప్రకటన బిగ్ షాక్‌గా మారింది. గెలుపు దిశగా పరుగులు పెట్టుతున్న ఇద్దరు సభ్యులు ఒకేసారి బీబీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఫినాలే ప్లాన్స్ దారి మళ్లాల్సిన పరిస్థితులు తలెత్తె ప్రమాదముంది.

డేంజర్ జోన్‌లో ఎవరు?
సోషల్ మీడియా చర్చలు, వివిధ ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న దివ్య నిఖిత, సంజనా గల్రానీ,డీమాన్ పవన్, సుమన్, భరణీ వంటి టాప్ 5 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. టాప్ 5 రేసులో ఉన్న పలువురిపై ఈ డబుల్ ఎలిమినేషన్ నేరుగా ప్రభావం చూపే అవకాశముంది. ఫలితంగా, మిగిలిన కంటెస్టెంట్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ స్ట్రాంగ్ ప్లానింగ్‌లో బిజీగా బిజీగా ఉన్నారు.
సోమవారం అర్థరాత్రి నుండి శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన అన్‌ఆఫీషియల్ పోల్స్ ప్రకారం.. కళ్యాణ్ పడాలా 32.66 శాతం ఓట్లతో టాప్ లో ఉండగా, తనూజ 26.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో సాగుతోంది. ఈ ఇద్దరు కలిసి దాదాపు 60 శాతం ఓటింగ్ కైవసం చేసుకున్నారంటే.. ఈ వారం పోటీ తీవ్రత ఏమేరకు ఉందో అర్ధమవుతోంది. ఇమ్మాన్యుయేల్ 9.14 శాతం, డీమాన్ పవన్ 6.56 శాతం, భరణి 6.44 శాతం, సుమన్ శెట్టి 6.39 శాతం, సంజన 6.11 శాతం, దివ్య నిఖిత 5.71 శాతం ఓట్లు పొందినట్టు తెలుస్తున్నాయి.
ఈ ఓటింగ్ ను పరిశీలిస్తే.. ఐదుగురు కంటెస్టెంట్లు స్పష్టంగా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దివ్య నిఖిత ఓటింగ్ లో బాటమ్‌లో ఉండటం వల్ల ఆమెకు ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. కానీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత వారమే దివ్య ఎలిమినేట్ అయ్యే స్థితిలో ఉండగా, ఇమ్యూ ఎలిమినేషన్ పవర్ వాడటం వల్ల సేవ్ అయ్యింది. ఈ వారం ఓటింగ్ మరింత తక్కువగా రావడంతో ఆమె మరోసారి డేంజర్ జోన్ లో పడింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ డ్రామాకు బిగ్ బాస్ టీమ్ తెర తీసినట్టు తెలుస్తోంది.
ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో శనివారం దివ్యను ఎలిమినేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా సంజనా గల్రానీ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. గత వారం ఆమె హౌస్ చేసిన రచ్చ మామూలుగా లేదు. నామినేషన్స్ సమయంలో రీతూ.. పర్సనల్ గా టార్గెట్ చేయడం, డీమాన్ పవన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటం..కేవలం హౌస్ మెంట్స్ మాత్రమే కాదు.. బీబీ లవర్స్ కూడా తీవ్రంగా ఖండించారు. సంజన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ విషయంపైనే హోస్ట్ నాగార్జున కూడా సంజనపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రెడ్ కార్డు ఇవ్వబోతున్నారనేది టాక్. లేదా ఓట్లు తక్కువ పొందినందుకు గాను ఆమెను సండే ఎపిసోడ్ ఎలిమినేషన్ చేయబోతున్నారనే టాక్ కూడా వచ్చింది.
ఎలిమినేషన్స్ ప్రకటించడంలో ఎప్పుడూ తనదైన శైలి చూపించే హోస్ట్ నాగార్జున ఈసారి ఎలా ట్విస్ట్ ఇస్తారో ప్రేక్షకులలో భారీ ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు కంటెస్టెంట్లను ఒకేసారి బయటకు పంపే విధానం ఏంటో? ఎపిసోడ్‌లో ఆ డ్రామా ఎలా మలుపు తిప్పుతుందో? అన్న ఆశక్తి పీక్‌కు చేరింది. డబుల్ ఎలిమినేషన్ షాక్‌తో బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ కొత్త మాస్ డ్రామా మొదలు కాబోతుంది. ఫినాలే వేటలో ఉన్న కంటెస్టెంట్స్ కు ఈ పరిణామం భారీ ట్విస్ట్ అనే చెప్పాలి. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











