Bigg Boss 9 Elimination: డబుల్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్.. హౌజ్‌ని వీడే కంటెస్టెంట్స్ ఎవరంటే?
Bigg Boss 9 Elimination: వీకెండ్ వచ్చేసింది అంటే బిగ్ బాస్ అభిమానుల్లో ఆనందం, టెన్షన్ రెండింటి కాక్‌టైల్ మొదలైందనే మాట. శనివారం రోజు హోస్ట్ నాగార్జున హౌస్‌లో జరిగిన డ్రామా, గొడవలు, స్ట్రాటెజీలపై కంటెస్టెంట్లను ప్రశ్నించనున్నారు. వారంతా ఎలా ఆడారు? ఎవరెవరు తప్పు చేశారు? ఎవరు గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు? అన్నదానిపై నాగ్ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా క్లాస్ తీసుకోవడం ఖాయం. అదే సమయంలో వీకెండ్ ఎపిసోడ్ అంటే ఎప్పుడూ ఎలిమినేషన్‌లపై ఉత్కంఠ తప్పదు. ప్రతి వారం ఒక్క కంటెస్టెంట్ హౌస్‌కు గుడ్‌బై చెప్పడం బిగ్ బాస్ రూల్. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండబోతోంది. ఈ వారం డబుల్ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఈ పదోవారం ఎవరెవరూ ఎలిమినేట్ కాబోతున్నారు? మీరు కూడా ఓ లూక్కేయండి.
డబుల్ ఎలిమినేషన్
సాధారణంగా వారం వారానికి ఒక్క కంటెస్టెంట్ మాత్రమే హౌస్‌ను విడిచి వెల్తుంటాడు. కానీ, ఈసారి బిగ్ బాస్ మరోసారి ఆటను తారుమారు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్‌తో హౌస్ కుదేలైంది. ఇక పదో వారం కూడా బిగ్ బాస్ అదే ప్యాటర్న్ ఫాలో చేయబోతున్నారని సమాచారం. అంటే ఈ వారం కూడా ఒక్కరు కాదు, ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్‌ను విడిచి వెళ్లబోతున్నారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఈసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయబోతున్నారట. అలాగే వారిద్దరికి ఓట్లు అత్యల్పంగా రావడంతో వారు డేంజర్ జోన్ లో నిలిచారు. వారే ఎలిమినేట్ కాబోతున్నారు.

బిగ్ బాస్ 9 సీజన్ లో 10 వారం ఊహించని పరిణామాలు ఎన్నో జరిగాయి. అందులో ఒకటి నామినేషన్స్ . ఈవారం బిగ్ బాస్ 11 మందిలో 10 మందిని నేరుగా నామినేట్ చేయడంతో బిగ్ షాక్ ఇచ్చారు. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే సేఫ్ జోన్‌లో ఉండగా, మిగతా పది మంది తీవ్ర డేంజర్ జోన్‌లో పడ్డారు. ఈ అనూహ్య నామినేషన్ నిర్ణయం హౌస్‌మేట్స్‌ను పూర్తిగా షాక్‌కు గురిచేయడమే కాకుండా ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచింది. ఇలాంటి భారీ నామినేషన్ల మధ్య ఓటింగ్ ట్రెండ్‌లు కూడా ఇంటర్నెట్‌ను దద్దరిల్లిస్తున్నాయి.
తాజా గణాంకాల ప్రకారం తనుజ పుట్టస్వామి అధిక శాతం ఓట్లు సాధించి టాప్‌లో ఉండగా, కళ్యాణ్ పదాల రెండోస్థానంలో కొనసాగుతున్నారు. అతి తక్కువ అంచనాల మధ్య సుమన్ శెట్టి మూడో స్థానంలోకి రావడం ఈ వారం పెద్ద ట్విస్ట్‌గా మారింది. భరని కూడా సేఫ్ జోన్‌లోకి చేరగా, డీమన్ పవన్ 6.69%, సంజనా 6.08%, దివ్య 5.88%, రీతూ 4.96%, నిఖిల్ 4.95%, గౌరవ్ 4.82% ఓట్లు మాత్రమే పొందారు. వీరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారని అందరూ భావించారు. ముఖ్యంగా చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన దివ్య, రీతూ, నిఖిల్,గౌరవ్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు అందరికీ అర్థమైంది. అయితే.. ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ డ్రామాకు బిగ్ బాస్ తెర తీసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తక్కువ ఓట్లు అందుకున్న నిఖిల్, గౌరవ్ ఇద్దరూ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్ పుట్స్ ప్రకారం. శనివారం ఎపిసోడ్‌లో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో గౌరవ్ గుప్తా హౌస్‌ను విడిచి వెళ్లబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా వైల్డ్ కార్డ్‌గా వచ్చిన ఈ ఇద్దరు హౌస్‌లో పెద్దగా కనిపించకపోవడం, టాస్క్‌లలో పాల్గొనకపోవడం, ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోవడం కారణంగా ఓటింగ్‌లో కూడా వీరికి తక్కువ ఓట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. గత రెండు వారాలుగా వీరి ప్రెజెన్స్ హౌస్‌లో ఉన్నారా లేదా అన్నట్టుగా తగ్గిపోవడంతో, అభిమానుల ఓటింగ్ సపోర్ట్ కూడా పూర్తిగా కనుమరుగైంది.
అందరి కళ్ళూ ఇప్పుడు నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌పైనే. నిజంగా ఈ డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా? లేక బిగ్ బాస్ చివరి నిమిషంలో మరో ట్విస్ట్ ఇస్తారా? అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











