Bigg Boss 9 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ ఓటింగ్‌లో అనూహ్య మార్పు .. ఆ టాప్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్!

Bigg Boss 9 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. 10వ వారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి హౌస్‌లో వాతావరణమే మారిపోయింది. సీజన్ ముగియడానికి కేవలం ఆరు వారాలే ఉండడంతో కంటెస్టెంట్లు మరింత అగ్రెసివ్‌గా, ఎమోషనల్‌గా, స్ట్రాటజిక్‌గా వ్యవహరిస్తున్నారు.అలాగే ఈ సీజన్ లో పదో వారం మాత్రం అన్ని అంచనాలను మించి, సీజన్ మొత్తానికి కీలక మలుపుగా మారింది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌లో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం హౌస్‌ను షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? అనే ఉత్కంఠభరితంగా మారింది.

సాధారణంగా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కంటెస్టెంట్ల మధ్య జరుగుతుంది. కానీ, ఈసారి ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ నేరుగా 11 మందిలో 10 మందిని నామినేట్ చేశారు. కేవలం కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కు మాత్రమే సేఫ్టీ జోన్ల లోకి వెళ్లారు. బిగ్ బాస్ సంచలన నిర్ణయంతో కంటెస్టెంట్స్ అందరూ ఊహించని విధంగా డేంజర్ జోన్ లో పడ్డారు. ఇలా ఈ వారం అందరూ నామినేట్ అనే బిగ్ బాస్ అకస్మాత్తు నిర్ణయం హౌస్‌లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ షాక్ వేవ్ క్రియేట్ చేసింది.

Bigg Boss 9 Telugu 10th Week Elimination

బిగ్ బాస్ నిర్ణయంతో భరని శంకర్, దివ్య నిఖిత, రితూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రాని, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి, తనుజ పుట్టస్వామి, డీమన్ పవన్ ఇలా పది మంది కంటెస్టెంట్లు నేరుగా ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. దీంతో బిగ్ బాస్ అభిమానులు తన ఫేవరేట్ కంటెస్టెంట్లకు గెలుపించుకోవాడానికి ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.దీంతో గత ఎపిసోడ్ కంటే ఈవారం ఓటింగ్ లో చాలా మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తాజా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి అత్యధికంగా 28.16% ఓట్లు సాధిస్తూ టాప్‌లో నిలుస్తుండగా, తరువాత కళ్యాణ్ పదాల 19.08% ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే.. అందరూ ఊహించని విధంగా సుమన్ శెట్టి 10.06% ఓట్లతో మూడో స్థానంలోకి ఎగబాకడమే గేమ్‌కు కొత్త ట్విస్ట్ గా మారింది. ఇక భరని 9.33% ఓట్లతో సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక పవన్, సంజనా, దివ్య కూడా సమానంగా పోటీ పడుతున్నారు. అయితే బాటమ్ జోన్‌లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. డీమన్ పవన్ 6.69%, సంజనా 6.08%, దివ్య 5.88%, రీతూ 4.96%, నిఖిల్ 4.95%, గౌరవ్ 4.82% ఓట్లు మాత్రమే పొందడంతో వీరిలో ఎవరో ఒకరు ఈ వారం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన దివ్య, రీతూ, నిఖిల్,గౌరవ్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. ప్రస్తుతం ఓటింగ్ ను చూస్తే.. వీరిలో ఒకరూ హౌస్‌కు గుడ్‌బై చెప్పాల్సి రావచ్చు.

ఈ అనధికారిక ట్రెండ్స్ అధికారిక ఫలితాలను ప్రతిబింబించకపోయినా, సీజన్ 9లోని అత్యంత ఉత్కంఠభరిత వారం ఇదే అని చెప్పడంలో సందేహం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన "ఆల్ నామినేషన్ ట్విస్ట్" ఈ సీజన్ డ్రామాను మళ్లీ తిరిగి పెంచడంతో పాటు హౌస్‌లోని స్ట్రాటెజీలను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు బయటకు వెళ్తారు? అన్నది పూర్తిగా ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంది.ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకూ వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X