Bigg Boss 9 Telugu 10th Week Voting: మళ్లీ ఓటింగ్ తారుమారు.. తనూజనే టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss 9 Telugu Week 10 Voting Update: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశలోకి అడుగుపెట్టింది. కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్‌లో టెన్షన్ పెరిగింది. ఈ తరుణంలో ఈ వారం నామినేషన్స్ పూర్తిగా అంచనా వేయలేని రీతిలో సాగాయి. ఈసారి ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ నేరుగా 11 మందిలో 10 మందిని నామినేట్ చేస్తూ భారీ షాక్ ఇచ్చాడు. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మాత్రమే సేఫ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్ లో నిలిచారు? మీరూ ఓ లూక్కేయండి.
నామినేషన్ల పర్వం
10వ వారం నామినేషన్స్ కోసం గార్డెన్ ఏరియాలో హౌస్‌మేట్స్‌ను షవర్ కింద కూర్చోబెట్టి, నామినేట్ అయ్యేవారి మీద బురద నీరు పడేలా ఏర్పాటు చేశారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ మాటల యుద్ధంగా మారింది. ఐదు నిమిషాల టైమ్‌లో కంటెస్టెంట్లు భావోద్వేగంగా, వ్యూహాత్మకంగా తమ నామినేషన్స్ చేశారు. ఇలా ఇమ్మాన్యుయేల్-భరణి, రీతూ-దివ్య నిఖితా, గౌరవ్-సంజనా మధ్య ఘర్షణలు చోటుచేసుకుని హౌస్ వేడెక్కింది. ఇక నామినేషన్స్ పూర్తి అయ్యాయని భావించే లోపే, బిగ్ బాస్ నేరుగా "ఈ వారం అందరూ నామినేట్" అంటూ సంచలన ప్రకటన చేశారు.

నామినేట్ అయ్యిందేవరంటే?
ఇమ్మాన్యుయేల్ ఇమ్యూనిటీ విషయంలో హౌస్‌మేట్స్ నిర్ణయానికి వదిలేశారు. భరణి తప్ప మిగితా వారందరూ అతడిని సేఫ్ చేయడంతో ఇమ్మాన్యుయేల్ మాత్రమే నామినేషన్ నుంచి బయటపడ్డాడు. దీంతో భరణి శంకర్, దివ్య నిఖితా, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్ ఇలా పది మంది ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో నిలిచారు. ఈ ఆల్ నామినేషన్ ట్విస్ట్ సీజన్ 9లో ఇప్పటివరకు చోటు చేసుకున్న అతిపెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు.
ఓటింగ్ ట్రెండ్స్ తారుమారు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పదో వారంలో బిగ్ బాస్ ప్రకటించిన "ఆల్ నామినేషన్ ట్విస్ట్" వల్ల హౌస్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా మొత్తం పది మంది నామినేట్ కావడంతో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల కోసం భారీ స్థాయిలో ఓటింగ్ చేస్తున్నారు. తాజా సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం తనుజ పుట్టస్వామి 26.4 శాతం ఓటింగ్‌తో ముందంజలో కొనసాగుతుండగా, ఆ తరువాత కళ్యాణ్ పదాల 24.5 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.ఈ ఇద్దరి తర్వాత అందరూ ఊహించని విధంగా రీతూ చౌదరి 18.17 శాతం ఓట్లు కైవసం చేసుకుని టాప్ మూడు స్థానాల్లోకి ఎగబాకి అందరినీ ఆశ్చర్యపరిచారు. భరణి 8.06 శాతం ఓట్లు సాధించి సేఫ్ జోన్‌లోకి చేరినట్లు తెలుస్తోంది.
డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే?
ఇక మిగతా కంటెస్టెంట్లకు పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు. ఇక గౌరవ్ గుప్తా 7.6 శాతం, సంజనా గల్రానీ 3.59 శాతం, సుమన్ శెట్టి 3.54 శాతం, దివ్య నిఖిత 2.91 శాతం, డీమాన్ పవన్ 2.88 శాతం, నిఖిల్ నాయర్ 2.66 శాతం ఓట్లు పొందారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే.. వీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
ముఖ్యంగా వీరిలో చివరి మూడు స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్ల పరిస్థితి అత్యంత క్రిటికల్. అయితే.. ఓటింగ్ ఇంకా కొనసాగుతున్నందున ఎప్పుడైనా ర్యాంకులు మారే అవకాశం ఉంది. మొత్తం మీద, బిగ్ బాస్ ఇచ్చిన ఈ "ఆల్ నామినేషన్ ట్విస్ట్" షోను మరోసారి రసవత్తర దశకు తీసుకెళ్లింది. ఈ వారం ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు గేట్లు దాటుతారు? అన్నది పూర్తిగా ప్రేక్షకుల ఓట్లపైనే ఆధారపడి ఉంది. చూడాలి మరీ ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు సేఫ్ జోన్ లో నిలిస్తారో?


Click it and Unblock the Notifications











