Bigg Boss 11 Week Elimination: బిగ్‌బాస్ నుంచి ఫైర్ బ్రాండ్ అవుట్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంటున్నది. 11వ వారంలో టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎన్నడూ లేని విధంగా టాప్ కంటెస్టెంట్లందరికీ టాప్ ఓటింగ్ జరిగింది. దాంతో నువ్వా? నేనా అనే విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. అయితే తాజా వారంలో ఇంటిలో తన మాటలతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆ కంటెస్టెంట్ ఎవరు? నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ గురించి వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 10వ వారం ముగింపుకొని 11వ వారం నామినేషన్ ప్రక్రియ రంజుగా సాగింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియలోను ఎప్పటిలానే భారీగా వాగ్వాదాలు కనిపించాయి. చివరకు ఈ వారం భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్్, సంజనా గల్రానీ, డీమాన్ పవన్, దివ్య నిఖిత, కల్యాణ్ పడాల నామినేట్ అయ్యారు. దాంతో టాప్ కంటెస్టెంట్లంతా నామినేషన్‌లోకి రాగా, తనూజ కెప్టెన్ కావడంతో ఎలిమినేషన్ ప్రాసెస్‌కు దూరంగా ఉండిపోయారు. ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ ఇమ్మాన్యుయేల్ నామినేషన్‌లోకి రావడం తెలిసిందే.

ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఇప్పటి వరకు 8 వారాల్లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద రామన్న, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో తనూజ, ఇమ్మాన్యుయేల్ టైటిల్ రేసులో హాట్ ఫేవరేట్లుగా నిలిచారు. అయితే వీరికి పోటీగా కామన్ మ్యాన్ కేటగిరిలో ఇంటిలోకి వచ్చిన దివ్య నిఖిత తనదైన ఆటతో టాప్ పొజిషన్‌లో నిలిచారు. సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా ధీటైన ఆటను ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆమె ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకొన్నారు.
అయితే ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన దివ్య నిఖిత ఈ వారం ఓటింగ్ ప్రక్రియలో వెనకబడినట్టు అనధికారికంగా వెల్లడైంది. ఓటింగ్‌లో పేలవంగా తక్కువ ఓట్లు సాధించడంతోపాటు చివరి స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి బయటకు రావడం తప్పనిసరి అనే టాక్, అభిప్రాయం వ్యక్తమైంది.
బిగ్‌బాస్ ఇంటిలో వారాంతపు ఎపిసోడ్‌ను ప్రారంభించిన హోస్ట్ నాగార్జున అక్కినేని.. ఇంటిలో ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. లీస్ట్ ఓటింగ్ సాధించిన దివ్యను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. దాంతో ఆమె ప్రయాణం ఇక ముగిసిందనే వార్తలు సోషల్ మీడియాలొ వస్తున్నాయి. అధికారికంగా బిగ్‌బాస్ ఆదివారం ప్రకటిస్తే తప్పా ఆమె ఎలిమినేషన్ అధికారికంగా బయటకు వస్తుంది. అయితే శుక్రవారం ఎపిసోడ్‌లో తనూజాతో భీకరంగా గొడవ పెట్టుకొన్న ఈ ఫైర్ బ్రాండ్ అవుట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.


Click it and Unblock the Notifications











