Bigg Boss 11th Week Nominations: లవ్ బర్డ్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు.. 11 వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే ?
Bigg Boss 11th Week Nominations: బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రియాల్టీ గేమ్ షో రసవత్తరంగా సాగుతోంది. ఎప్పుడూ చూడని ట్విస్టులు, వరుసగా జరిగే డబుల్ ఎలిమినేషన్లు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు... ఇలా ఒక్కో రోజు ఒక్కో లెవెల్‌కు దూసుకుపోతోంది షో. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు వరుస వారాల్లో డబుల్ ఎలిమినేషన్లు జరగడం విశేషం. 9వవారం రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ బయటకు వెళ్లగా, తాజాగా 10 వారం నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16 మంది బయటకు వెళ్లగా, హౌస్‌లో ఇంకా 9 మంది మాత్రమే బిగ్ బ్యాటిల్‌లో నిలిచారు. అయితే..11 వారం నామినేషన్స్ లో ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇలా రసవత్తరంగా సాగుతోన్న బిగ్ బాస్ 9 లో 11వ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్‌లో ఎమోషనల్ ట్రాక్ మొదలైంది. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవడంతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ఎవరి ఫ్యామిలీ ఎప్పుడు వస్తుంది? ఎలాంటి భావోద్వేగ సన్నివేశాలు జరుగుతాయి? అన్న హైప్ సోషల్ మీడియాలో పెరుగుతోంది.ఇక 11 వ వారం నామినేషన్స్ పైకే హైహైప్ ఏర్పడింది.

నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ తనూజకు ప్రత్యేక పవర్ ఇచ్చాడు. స్పెషల్ టోకెన్ల ద్వారా ఒకరి లేదా ఇద్దరిని నామినేట్ చేసే అధికారం పూర్తిగా తనూజ చేతుల్లో పెట్టాడు. దీంతో తనూజ తన ఇష్టమైన వారికి నామినేషన్ టోకెన్లు ఇచ్చి గేమ్ డైరెక్షన్‌ను పూర్తిగా మార్చేసింది. ఇది హౌస్ మొత్తం డైనమిక్స్‌ను షేక్ చేసింది.
నామినేషన్స్ పర్వంలో మొదట రంగంలోకి దిగిన ఇమాన్యువెల్ నేరుగా రీతును టార్గెట్ చేశాడు. "నీ కాన్ఫిడెన్స్ తగ్గింది" అని సలహా ఇవ్వడంతో రీతూ మండిపడి ప్రతిక్షణం కౌంటర్లు ఇచ్చింది. బెలూన్ టాస్క్ ప్రస్తావనతో ఇద్దరి మధ్య వాదోపవాదాలు మరింత పెరగడంతో హౌస్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రీతూ చివరికి "నీ మీద నీకే నమ్మకం లేకపోవడం వల్లే సంజనను నమ్మడం లేదు" అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీనితో ఇమాన్యువెల్ మరింత కోపంతో డీమోన్ పవన్‌ను కూడా లాగడంతో స్టేజ్ ఒకసారిగా టెన్షన్‌తో నిండిపోయింది.
ఇక్కడితో ఆగకుండా ఇమాన్యువెల్ భరణిపై విమర్శలు గుప్పించాడు. "ఎఫర్ట్ పెట్టడం లేదు" అని విమర్శించగా భరణి ఘాటుగా స్పందించాడు. "నా పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వు గేమ్ ఆడగలవా?" అంటూ ప్రశ్నించాడు. "వేరే విషయాలు ప్రస్తావిస్తే నీ 360 డిగ్రీ యాంగిల్ బయటపెడతా" అని వార్నింగ్ ఇచ్చాడు. భరణి సమాధానంగా "నేను ప్రతి టాస్క్‌లో 100% ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా" అని స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య కూడా ఘర్షణ పెరిగింది.
ఆ తరువాత నామినేషన్స్ రంగంలో దిగిన డీమోన్ పవన్ బిగ్ షాక్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా తన క్లోజ్ ఫ్రెండ్ రీతు చౌధరినే నామినేట్ చేశాడు. "నువ్వు అరిచే విధానం వల్ల నేను తప్పు లేకపోయినా నా మీదనే తప్పు మోపబడుతోంది" అంటూ పవన్ భావోద్వేగంతో మాట్లాడాడు. దాంతో రీతూ కన్నీరు పెట్టుకుని "నాతో మాట్లాడొద్దని చెప్పి ఉండాల్సింది" అంటూ విరుచుకుపడింది. పవన్ కూడా భావోద్వేగానికి లోనై "నేను ఎప్పుడూ నీ మంచే కోరుకున్నా... కానీ, నమ్మకం లేదు, బాధ్యత లేదు అంటూ నువ్వే నన్ను హర్ట్ చేసావు" అని కన్నీరుపెట్టుకున్నాడు.
దీంతో రీతు ఎమోషనల్ బ్లాస్ట్ అవుతుంది 'నాతో మాట్లాడొద్దు అని చెప్తే సరిపోతుంది కదా..'అంటూ తల బాదుకుంటుంది. దీంతో 'ఎందుకు అరుస్తున్నావు?' అంటూ పవన్ అడగగా..'నా వల్ల కావట్లేదు' అని రీతు అంటుంది. దీంతో పవన్ కోపంగా 'నావల్ల కూడా అవ్వట్లేదు' అంటూ గట్టిగా అరుస్తాడు. ఇలా లవ్ బర్డ్స్ మధ్య బిగ్ బాస్ నామినేషన్స్ పేరుతో చిచ్చుపెట్టాదా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హౌస్‌లో లవ్ - హేట్ డ్రామా పీక్‌కు చేరింది.
ఈ ఘర్షణలతో సాగిన నామినేషన్ రౌండ్‌లో మొత్తంగా ఆరుగురు మంది నామినేట్ అయినట్టు తెలుస్తోంది. వారిలో దివ్యా నికిత, భరణి శంకర్, రీతు చౌదరి, డీమోన్ పవన్, కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయెల్, సంజన గల్రానీ ఉన్నారని టాక్. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందా? లేక ఒక్కరే బయటకు వెళతారా? అన్న సమాధానం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు సేవ్ అవుతారు? ఎవరు బయటకు వెళ్లతారు? అనే విషయంలో సోషల్ మీడియాలో ఓటింగ్ వార్ కూడా మొదలైంది. ఈ నామినేషన్స్ తర్వాత హౌస్ ఆడే గేమ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











