Bigg Boss 9 Telugu 12th Week Elimination: ఓటింగ్ తారుమారు.. డేంజర్ జోన్‌లో ఆ నలుగురు.. ఈ వారం ఎలిమినేట్ ఎవరు?
Bigg Boss 9 Telugu 12th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకున్నది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ గేమ్ షోకు కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రేక్షకులలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఎండ్ గేమ్ దశలోకి ప్రవేశించినందున, పోటీదారుల ప్రతి నిర్ణయం, ప్రతి యాక్షన్ హౌస్ లో పెద్ద మార్పులకు దారి తీస్తోంది. అందుకే 12వ వారంలో నామినేషన్స్, ఓటింగ్, సోషల్ మీడియా రియాక్షన్స్ అన్నీ కలసి భారీ కిక్ అందిస్తున్నాయి. తాజాగా పరిణామాలతో డేంజర్ జోన్ ఎవరు ఉన్నారు? ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది ఎవరు? ఈ వారం జరగబోయే పరిణామాలు ఏంటీ? అనే వివరాల్లోకెళ్తే..
గత వారం నో ఎలిమినేషన్ తో బిగ్ బాస్ గేమ్ పూర్తిగా మారిపోయింది. 12వ వారం నామినేషన్ ప్రక్రియ గత వారాల కంటే.. మరింత టెన్షన్ ఫుల్‌గా సాగింది. బిగ్ బాస్ ఈ సారి నామినేషన్స్‌ని రెండు దశల్లో నిర్వహించారు. ప్రైవేట్ నామినేషన్, ఆ తర్వాత ఫేస్-టు-ఫేస్ నామినేషన్. ఫేస్ నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్లు ఒకరి బలహీనతలను, గేమ్ స్ట్రాటజీలను, హౌస్‌లో వారు చూపిన అహంకార యాటిట్యూడ్‌ను నేరుగా ముఖంలోనే చెప్పారు. భావోద్వేగాలు, అసహనం అన్ని కలిసి హౌస్‌లో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఎవరూ తగ్గేదేలే అన్నట్టుగా నామినేషన్స్ యుద్ధరంగంలా మారింది.

నామినేషన్ జాబితా
ఇలా రణరంగంలా జరిగిన నామినేషన్స్ లో కెప్టెన్ రీతూ తప్ప, మిగతా ఎనిమిది మంది ఈ వారం నామినేషన్ లో నిలిచారు. ఈ జాబితాలో తనూజ పుట్టాస్వామి, కళ్యాణ్ పడాలా, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాణీ, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి, దివ్య నిఖితా ఉన్నారు. ఈ జాబితాలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండటంతో పోటీ తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలో ఎవరి మిస్టేక్ అయినా వారికి నష్టమే. అందుకే హౌస్‌లో స్ట్రెస్ పీక్‌కు చేరుకుంది.
ఓటింగ్ ఓపెన్ అయిన వెంటనే అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయడం ప్రారంభించారు. ఓటింగ్ రేస్‌లో విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒకసారి తనూజ ముందుకు వస్తే, కొద్దిసేపటికే కళ్యాణ్ మళ్లీ లీడ్ లో కనిపించడం ఫ్యాన్ వార్ ఎలా ఉందో సూచిస్తుంది. అన్‌ఆఫీషియల్ పోల్స్, హ్యాష్‌ట్యాగ్ కాంపెయిన్స్, సోషల్ మీడియా పోస్టులు అన్ని కలిపి ఓటింగ్ వాతావరణాన్ని ఎలక్ట్రిపై గా మార్చాయి.
అన్‌ఆఫీషియల్ పోల్స్ ప్రకారం, కళ్యాణ్ పడాలా దాదాపు 32.66 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన జవాన్ నేపథ్యం, మాస్ పర్సనాలిటీ ప్రేక్షకులలో భారీ సపోర్ట్‌ను కూడగట్టడానికి కారణంగా కనిపిస్తోంది. అతడి తరువాత తనూజ 26.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో సాగుతోంది. ఈ ఇద్దరు కలిసి దాదాపు 60 శాతం ఓటింగ్ కైవసం చేసుకున్నారంటే.. ఈ వారం పోటీ తీవ్రత ఏమేరకు ఉందో అర్ధమవుతోంది.
తదుపరి స్థానాల్లో ఇమ్మాన్యుయేల్ 9.14 శాతం, డీమాన్ పవన్ 6.56 శాతం, భరణి 6.44 శాతం, సుమన్ శెట్టి 6.39 శాతం, సంజన 6.11 శాతం, దివ్య నిఖిత 5.71 శాతం ఓట్లు పొందినట్టు అన్ ఆఫీషియల్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఈ సంఖ్యలు పరిశీలిస్తే, ఐదుగురు కంటెస్టెంట్లు స్పష్టంగా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముఖ్యంగా దివ్య నిఖిత ఓటింగ్ లో బాటమ్‌లో ఉండటం వల్ల ఆమెకు ఎలిమినేషన్ చాలా దగ్గరలోనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా షో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ వేస్తే సంజనా కూడా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని బజ్ వినిపిస్తోంది.
ఎలిమినేషన్ ఎవరికి?
12వ వారం ఎలిమినేషన్ సస్పెన్స్ బిగ్ బాస్ హౌస్‌లో, అలాగే సోషల్ మీడియాలో తీవ్ర ఉత్కంఠను సృష్టిస్తోంది. దివ్య నిఖిత ఎలిమినేషన్ దాదాపు కన్ఫామ్ అయినట్లు అభిమానుల వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, గతవారం వచ్చిన అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ దృష్ట్యా.. ఈ వారం బిగ్ బాస్ మరొక సర్ప్రైస్ ఇస్తారా? అనే సందేహం కూడా ప్రేక్షకులను కుతూహలానికి గురిచేస్తోంది. ఎలిమినేషన్‌తో సీజన్ గేమ్ బ్యాలెన్స్ ఎలా మారుతుందో, అభిమానులు చివరివరకు ఓటింగ్‌లో పాల్గొంటారా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











