Bigg Boss 9 Telugu 12th Week Voting: బిగ్‏బాస్ ముద్దుబిడ్డకు ఎదురుదెబ్బ.. డేంజర్ జోన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్.

Bigg Boss 9 Telugu 12th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ గేమ్ షో మరో మూడు వారాల్లో పూర్తి కాబోతుంది. దీంతో ఎలిమినేషన్-ఓటింగ్ డ్రామా పీక్‌లోకి చేరింది. బిగ్ బాస్ విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరు? టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో 12వ వారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. ఈ నామినేషన్ వార్ తో కంటెస్టెంట్ల మధ్య కల్లోలం చోటుచేసుకుంది. ఇంతకీ ఈ ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఔట్ అయ్యారు? ఎవరు సేఫ్ అయ్యారు ? ఓటింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాల్లోకెళ్తే..

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ 12 వారంలోకి అడుగుపెట్టింది. గతవారం ఎవరు ఔట్ అయ్యారు? ఎవరు సేఫ్ అయ్యారు? అన్నదానిపై ఎంతో హడావుడి జరిగింది. కానీ, హోస్ట్ నాగార్జున ఆశ్చర్యపరిచే విధంగా "ఈ వారం నో ఎలిమినేషన్" అని ప్రకటించడంతో హౌస్‌లో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నామినేషన్ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఎప్పుడూ లేని విధంగా ఈ వారం రెండు దశల నామినేషన్ స్ట్రక్చర్ ఫాలో చేశారు. మొదటి దశలో ప్రైవేట్ నామినేషన్ చేయగా.. రెండో దశలో ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ జరిగాయి.

Bigg Boss 9 Telugu 12th Week Voting Kalyan Leads Thanuja Behind Divya in Danger Zone

ఈ నామినేషన్స్ తో బీబీ హౌస్ మొత్తం హీటెక్కింది. ఈ నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల వైఖరిని బయటపడింది. ఎవరి తప్పులేంటో నాన్-స్టాప్‌గా చర్చిస్తూ ఎమోషన్స్ పీక్‌కు చేర్చారు. ఈ డబుల్ స్ట్రక్చర్ నామినేషన్స్ లో మొత్తంగా 8మంది కంటెస్టెంట్లు నామినేట్ కాగా, కెప్టెన్ రీతూ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచింది. నామినేట్ అయిన వారి లిస్టులో తనూజ పుట్టాస్వామి, కళ్యాణ్ పడాలా, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి, దివ్య నిఖితా ఉన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంతా ఎలిమినేషన్ రేసులోకి రావడంతో హౌస్ మొత్తం టెన్షన్‌లోకి వెళ్లింది.

ఇక నామినేషన్స్ పూర్తి కాగానే.. బిగ్ బిగ్ లవర్స్ తన ఫేవరేట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేసి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉన్నసోషల్ మీడియా పోల్స్, ఆన్ లైన్ ట్రెండ్స్ చూస్తే.. తాజా ఓటింగ్ ప్రకారం తనూజకు ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ లవర్స్ జై జవాజ్ అంటూ కళ్యాణ్ పడాలకు ఓటు చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీని బట్టి చూస్తే.. టైటిల్ రేస్‌కు దగ్గరగా ఉన్న తనూజ-కళ్యాణ్ జట్టు మధ్య ఓటింగ్ పోటాపోటీగా జరుగుతోంది.

కళ్యాణ్ 30.07 శాతం ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉండగా.. తనూజ 28.23 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.ఇద్దరూ కలిపి దాదాపు 60% ఓట్లు సాధిస్తున్నారు. కొన్ని గంటలు తనూజ టాప్‌లో ఉంటే, కొన్ని గంటలు కళ్యాణ్ లీడ్‌లోకి రావడం జరుగుతోంది . తాజా ఓటింగ్ ట్రెండ్స్ లో అనూహ్యంగా కళ్యాణ్ ఓట్లలో ముందంజలోకి దూసుకొచ్చాడు. అన్ అఫీషియల్ పోల్స్‌లో కూడా కళ్యాణ్‌కు భారీ మద్దతు కనిపిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే విజేతగా అతడే నిలిచే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది.

ఇక నవ్వుల రారాజు ఇమ్మానుయేల్ 10.27 ఓట్లు శాతం ఓట్లు పొంది మూడో స్థానంలో ఉండగా.. హౌస్ లో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన సంజన గల్రాణీ 6.42 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో, భరణీ 6.18 శాతం ఓట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఈ వారం హౌస్‌లో ఫిజికల్ ఫైట్లకు కారణమైన డీమాన్ పవన్ ఓటింగ్‌లో మాత్రం 5.94 శాతం ఓట్లు మాత్రమే సాధించాడు. ఆయన తర్వాత సుమన్ శెట్టి 5.93 శాతం ఓట్లతో మరోసారి బాటమ్ నిలిచారు. చివరగా దివ్య నిఖితా 5.8 శాతం ఓట్లు తో డేంజర్ జోన్ లో ఉంది.

ఈ లెక్కన చూస్తే దివ్య నిఖిత ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే షో చివరి వారాల్లో డబుల్ లేదా మిడ్-వీక్ ఎలిమినేషన్ అవకాశాలు కూడా ఉండటంతో ఎవరి దగ్గరైనా ట్విస్ట్ రావచ్చు. ఓటింగ్ కి శుక్రవారం అర్థరాత్రి వరకు అవకాశం ఉండటంతో ఏ క్షణమైనా ఓటింగ్ మారవచ్చు. చూడాలి ఎవరు విన్నర్ అవుతారో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X