Bigg Boss 9 Telugu 12th Week Voting: ఓటింగ్ లో అనూహ్య మార్పులు.. ఆ కంటెస్టెంట్‌కు ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 9 Telugu 12th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకున్నది. ప్రేక్షకులలో అసలు సిసలు ఎగ్జైట్మెంట్ మొదలైంది. సెప్టెంబర్ 7న స్టార్ట్ అయిన ఈ రియాలిటీ గేమ్‌షోకు ఇక మూడు వారాల్లో ఎండ్‌ కార్డ్ పడనుంది. ఈ ఫేజ్‌కు వచ్చే నాటికి హౌస్‌లో ప్రతి నిర్ణయం, ప్రతి కంటెస్టెంట్ గేమ్‌ మార్చే స్థాయిలో ఉంటుంది. అందుకే 12వ వారంలో నామినేషన్స్, ఓటింగ్ అన్నీ కలిపి షోలో హై-వోల్టేజ్ అంచనాలను సృష్టించిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఈ వారం ఎవరు ఎమినేట్ కాబోతున్నారు? డేంజర్ జోన్ లో ఎవరు నిలిచారు? అనే వివరాల్లోకెళ్తే..

డబుల్ లెవల్ నామినేషన్స్
గత వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు సేఫ్? అన్న ప్రశ్నతో ప్రేక్షకులు ఊహల్లో మునిగిపోయారు. కానీ, ఎవరి అంచనాలకు అందని విధంగా హోస్ట్ నాగార్జున "ఈ వారం ఎలిమినేషన్ లేదు" అని ప్రకటించడంతో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. కొందరు దీనిని వ్యూహాత్మక ట్విస్ట్‌గా స్వాగతిస్తే, మరికొందరు గేమ్‌ పై ఆసక్తిపడిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా..ఈ నిర్ణయం కంటెస్టెంట్ల మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేసింది.

Bigg Boss 9 Telugu 12th Week Voting Kalyan Tanuja Lead Bharani Divya in Danger

ఇలాంటి పరిణామాల తరువాత 12వ వారం నామినేషన్స్ మరింత రసవత్తరంగా సాగాయి. ఈసారి బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు. మొదట ప్రైవేట్ నామినేషన్స్, తరువాత ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ నిర్వహించారు. ఈ సమయంలో కంటెస్టెంట్లు ఒకరి వ్యక్తిగత తప్పులను, గేమ్‌ స్ట్రాటజీలను, అగ్రెసివ్‌గా ఎదురుతిరిగే సందర్భాలను ఎత్తిచూశారు. భావోద్వేగాలు, ఆగ్రహం, ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఒకేసారి పేలిపోవడంతో హౌస్‌లో కల్లోలం నెలకొంది.

చివరికి 12 వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ కాగా, కెప్టెన్ రీతూ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచింది. నామినేషన్ జాబితాలో తనూజ పుట్టాస్వామి, కళ్యాణ్ పడాలా, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాణీ, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి, దివ్య నిఖితా ఉన్నారు. స్ట్రాంగ్ ప్లేయర్లు కూడా డేంజర్ లిస్ట్‌లో ఉండటంతో ఇంట్లో టెన్షన్ మరింత పెరిగింది.

బిగ్ బాస్ 12 వారం ఓటింగ్ ప్రారంభమైన వెంటనే బిగ్ బాస్ లవర్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేశారు. హోరాహోరాగా జరుగుతున్న ఓటింగ్ రేసులో ఒకసారి తనూజ లీడ్‌లో ఉంటే.. కొద్ది గంటల్లో కళ్యాణ్ తిరిగి ఎగబాకడం.. ఇది ప్రేక్షకుల మధ్య ఫ్యాన్ వార్ ఏ స్థాయిలో ఉందో సూచిస్తుంది. అన్ ఆఫీషియల్ పోల్స్‌లో కూడా కళ్యాణ్‌కు భారీ మద్దతు కొనసాగుతోంది. జై జవాన్ అంటూ ఓట్లు గుద్దేస్తున్నారు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే అతడు విన్నర్ రేస్‌లో ముందడుగులోనే ఉంటాడు.

ఓటింగ్ రేస్
12వ వారం ఓటింగ్ ఓపెన్ అయిన నుంచి బిగ్ బాస్ లవర్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేశారు. సోషల్ మీడియాలో "ఎవరు విన్నర్?" "ఎవరు రన్నరప్?" "టాప్ 5లో ఎవరు?" అన్న చర్చ జోరుగా సాగుతోంది. అప్పుడప్పుడూ తనూజ లీడ్‌లోకి ఎగబాకుతుంటే, కాసేపటికే కళ్యాణ్ తిరిగి తొలి స్థానానికి చేరుకుంటున్నారు. దీనిన్ని బట్టి సీజన్ 9లో ఫ్యాన్ వార్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చెబుతుంది.

అన్‌ఆఫీషియల్ పోల్స్ ప్రకారం, కళ్యాణ్ పడాలానే ముందంజలో దాదాపు 33.46% ఓట్లతో ఉన్నారు. జవాన్ బ్యాక్‌గ్రౌండ్, మాస్ ఇమేజ్ ఇవి కలిసొచ్చి అతనికి అభిమానుల నుంచి మంచి సపోర్ట్ అందుకుంటున్నారు. ఇక అతడి వెంటనే తనూజ 27.66% ఓట్లతో రెండో స్థానంలో నిలిచి హెవీ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి సుమారు 61% ఓట్లను దక్కించుకోవడం హోరాహోరా పోటీకి ఇదో సూచిక.

తదుపరి స్థానాల్లో ఇమ్మాన్యుయేల్ 9.32% ఓట్లతో నిలవగా, సంజన 6.03%, డీమాన్ పవన్ 6%, సుమన్ శెట్టి 6% ఓట్లు సంపాదించారు. ప్రత్యేకంగా ఫిజికల్ గేమ్స్‌లో ఇంపాక్ట్ చూపించిన సంజన కాస్త మందగించినా, మధ్యస్థాయి ఓటింగ్‌తో బోర్డు మీద తన ప్రెజెన్స్ కొనసాగిస్తున్నారు. పవన్, సుమన్ లకు ఇద్దరూ ఫ్యాన్‌ బేస్ తక్కువైనా, లాస్ట్ వీక్స్‌లో ట్విస్ట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక అనూహ్యంగా భరణి శంకర్ ఓటింగ్‌లో వెనుకబడారు. కేవలం 5.98% ఓట్లు రాబట్టారు. డేంజర్ జోన్ లో నిలిచారు. ఇక దివ్య నిఖిత మాత్రం 5.55 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచారు. ఈ లెక్కల ప్రకారం దివ్య నిఖిత ఎలిమినేషన్‌కు అత్యంత దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఏమైనా తేడా అయితే.. భరణి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే సీజన్ చివరి వారాల్లో డబుల్ లేదా మిడ్-వీక్ ఎలిమినేషన్ అవకాశాలు ఉండటం వల్ల ప్రతీ వారం గేమ్ తలకిందులయ్యే అవకాశముంది. ఓటింగ్‌ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుండటంతో ఫ్యాన్ డ్రైవ్, ఒక వైరల్ మొమెంట్... కథనే తారుమారు చేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X