Bigg Boss 9 Telugu 12th Week Voting: జై జవాన్ అంటున్న బిగ్‌బాస్ లవర్స్..డేంజర్‌జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్
Bigg Boss 9 Telugu 12th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ గేమ్ షోకు మరో మూడు వారాల్లో ఎండ్ కార్డు పడబోతుంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో ఎలిమినేషన్ టెన్షన్, ఓటింగ్ రేస్ పీక్స్ కు చేరాయి. సోషల్ మీడియాలో ఎవరు విన్నర్?, ఎవరు రన్నరప్?, టాప్ 5లో ఎవరు? అనేది చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో 12వ వారం నామినేషన్స్ హై-వోల్టేజ్ లెవల్‌లో సాగాయి. ఈ నామినేషన్ వార్ తో కంటెస్టెంట్ల మధ్య కల్లోలం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓటింగ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఈ వారం ఎవరు ఎమినేట్ కాబోతున్నారు? డేంజర్ జోన్ లో ఎవరు నిలిచారు? అనే వివరాల్లోకెళ్తే..
డబుల్ స్టేజ్ నామినేషన్స్
బిగ్ బాస్ లో గత వారం ఎవరు ఔట్ అవుతారు? ఎవరు సేఫ్? అనేదానిపై ప్రేక్షకులు హడావుడిగా చర్చించుకున్నారు. అయితే హోస్ట్ నాగార్జున "ఈ వారం ఎలిమినేషన్ లేదు" అని ప్రకటించడంతో హౌస్‌లో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఈ స్ట్రాటజీపై కొంత మందికి అంతగా నచ్చలేదు. కానీ, కంటెస్టెంట్ల మైండ్‌సెట్‌ను మాత్రం మార్చేశారు. ఇక 12వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ అభిమానులు ఊహించినదానికంటే మరింత రసవత్తరంగా సాగాయి. ఈసారి బిగ్ బాస్ రెండు లెవల్స్‌లో నామినేషన్ స్ట్రక్చర్ అమలు చేశాడు.

మొదట ప్రైవేట్ నామినేషన్స్ నిర్వహించి, ఆ తరువాత ఫేస్-టు-ఫేస్ నామినేషన్స్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో కంటెస్టెంట్లు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపారు. ఎమోషన్స్, ఆర్యూమెట్స్ అన్నీ ఓ లెవల్‌కు చేరాయి. తీరా చివరికి మొత్తం 8 మంది నామినేట్ కాగా, కెప్టెన్ రీతూ మాత్రమే సేఫ్ జోన్‌లో నిలిచింది. నామినేట్ అయిన కంటెస్టెంట్లలో తనూజ పుట్టాస్వామి, కళ్యాణ్ పడాలా, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాణీ, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి, దివ్య నిఖితా లు ఉన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లంతా డేంజర్ జోన్‌లో ఉండటంతో హౌస్ టెన్షన్ పీక్స్ కు చేరింది.
ఓటింగ్ మోడ్..
బిగ్ బాస్ 12 వారం ఓటింగ్ ప్రారంభమైన వెంటనే బిగ్ బాస్ లవర్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేశారు. హోరాహోరాగా జరుగుతున్న ఓటింగ్ రేసులో ఒకసారి తనూజ లీడ్‌లో ఉంటే.. కొద్ది గంటల్లో కళ్యాణ్ తిరిగి ఎగబాకడం.. ఇది ప్రేక్షకుల మధ్య ఫ్యాన్ వార్ ఏ స్థాయిలో ఉందో సూచిస్తుంది. అన్ ఆఫీషియల్ పోల్స్‌లో కూడా కళ్యాణ్‌కు భారీ మద్దతు కొనసాగుతోంది. జై జవాన్ అంటూ ఓట్లు గుద్దేస్తున్నారు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే అతడు విన్నర్ రేస్‌లో ముందడుగులోనే ఉంటాడు.
సోషల్ మీడియా పోల్స్ ప్రకారం.. కళ్యాణ్ పడాలా టాప్ లో నిలిచారు. దాదాపు 32.62 శాతం ఓటింగ్ సొంతం చేసుకోగా.. తనూజ - 32 శాతం ఓట్లు సంపాదించకున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఓటింగ్ పోటాపోటీగా సాగుతోంది. వీరిద్దరూ కలిసి దాదాపు 65% ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇమ్మానుయేల్ 8 శాతం ఓట్లు పొంది, మూడో స్థానంలో నిలిచారు. ఇక నాలుగో స్థానంలో భరణి శంకర్ 6.18 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు.
ఇక ఫిజికల్ గేమ్‌లో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన సంజన గల్రాణీ 6.4 శాతం ఓట్లు పొందగా.. డీమాన్ పవన్ మాత్రం ఓటింగ్‌లో వెనకబడి 5.38 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నాడు. అతని తర్వాత సుమన్ శెట్టి 4.86 శాతం ఓట్లు పొంది మరోసారి బాటమ్ జోన్ నిలిచారు. ఇక దివ్య నిఖితా కేవలం 4.18 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచినట్టు తెలుస్తోంది.
ఈ లెక్కన చూస్తే దివ్య నిఖిత ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే షో చివరి వారాల్లో డబుల్ లేదా మిడ్-వీక్ ఎలిమినేషన్ అవకాశాలు కూడా ఉండటంతో ఎవరి దగ్గరైనా ట్విస్ట్ రావచ్చు. ఓటింగ్ కి శుక్రవారం అర్థరాత్రి వరకు అవకాశం ఉండటంతో ఏ క్షణమైనా ఓటింగ్ మారవచ్చు. చూడాలి ఎవరు విన్నర్ అవుతారో?


Click it and Unblock the Notifications











