Bigg Boss 9 Telugu 13th Week Elimination: ఇదేం ట్విస్ట్.. హోరాహోరీగా ఓటింగ్.. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషనా?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరడంతో హౌస్‌లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ సీజన్‌లో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో ముందే అంచనా వేయడం అసాధ్యంగా మారింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రతి కంటెస్టెంట్ ఆట తీరు మారింది. ఏ చిన్న తప్పు చేసిన ఫీనాలే జర్నీపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ఇకపై కేవలం టాస్కులలోని పెర్ఫార్మెన్స్ కాదు... వారి ప్రవర్తన, మాట్లాడే తీరు, హౌస్‌లో ఇతరులతో వ్యవహరించే విధానమే ప్రేక్షకుల ఓట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో మొదటి ఫైనలిస్ట్ ఎవరు? టాప్ 5లో ఎవరు నిలుస్తారు? చివరకు టైటిల్ ఎవరి ఖాతాలో పడుతుంది? అన్నది చర్చనీయంగా మారింది. అలాగే.. ఓటింగ్ ట్రెండ్స్ గంట గంటకు మారుతుండటంతో ఈ వారం మరింత థ్రిల్లింగ్‌గా మారింది.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో టెన్షన్ హై లెవల్ లో ఉంది. ఇక టికెట్ టు ఫినాలే రేసు ప్రారంభం కావడంతో రణరంగంలా మారింది. హౌస్‌మేట్స్ అందరూ తమ తమ స్ట్రాటజీలను మార్చుకుంటూ ఒకరిపై మరొకరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు.ఇదిలాఉంటే.. 13వ వారం నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్‌లో నెలకొన్న టెన్షన్‌ను మరింత పెంచాయి. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక టాస్క్ ప్రకారం, ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు ప్రకటిస్తూ, కారణాలు చెబుతూ బాటిల్స్ పగులగొట్టి నామినేట్ చేయాల్సి వచ్చింది. దీంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా హీట్ అయ్యింది. ఘర్షణలు, కౌంటర్లు, భావోద్వేగాలతో నిండిన ఈ రౌండ్ చివరికి సంజన గల్రానీ, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజా పుట్టస్వామి, భరణి శంకర్ నామినేషన్‌లోకి చేరారు. ఈ సారి టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్‌లో ఉండటంతో హౌస్‌లో టెన్షన్ పీక్స్‌కి చేరుకుంది.

ఈ క్రమంలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ హౌస్‌మేట్స్‌లోనూ పెరిగిపోయింది. ఇక 13వ వారం ఆన్‌లైన్ ఓటింగ్ కూడా రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో భారీ ఓటింగ్ ప్రారంభమైంది. ఫ్యాన్ పేజీలు, అనధికార పోల్స్, ఓటింగ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ప్రకారం.. ప్రస్తుతం తనూజా పుట్టస్వామి టాప్ లో నిలిచింది. ఓటింగ్ ప్రారంభం అయ్యే నాటి నుంచి దుమ్మురేపుతోంది. దాదాపు 25.51 శాతం ఓట్లతో టాప్ లో నిలిచింది. ఇక ఎవరూ ఊహించిన విధంగా మరోసారి డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచారు. టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో జరిగిన డ్రామా కారణం 16.25 శాతం ఓట్లు పొందినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక భరణి శంకర్ 15.35 శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు. ఫినాలే రేసులో ఓడిపోయినా బలమైన ఫ్యాన్‌బేస్ అతడిని టాప్ 3 లో ఉంచినట్టుగా కనిపిస్తోంది. ఇక నిన్నటి వరకూ రెండోవ స్థానంలో ఉన్న డిమోన్ పవన్ అమాంతం పడిపోయారు. అతడు ప్రస్తుతం 15.17శాతం ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక సంజన గల్రానీ 14.1 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆమె కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది.ఇక అత్యంత క్లిష్ట పరిస్థితి సుమన్ శెట్టిది. ఒక్కో టాస్క్‌లోనూ ఫామ్ తిరగకపోవడంతో ఓటింగ్ క్రమక్రమంగా పడిపోతుంది. దీంతో ప్రస్తుతం 13.66 శాతం ఓట్లతో బాటమ్‌లో నిలిచాడు.
ఈ మొత్తం ట్రెండ్‌ను చూస్తుంటే.. ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ విశ్లేషకులు అంచనా ప్రకారం.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ ఎలిమినేషన్ చేస్తే.. సంజన కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషనా? అనేది చివరి నిమిషం వరకు చెప్పడం కష్టమే.


Click it and Unblock the Notifications











