Bigg Boss 9 Telugu 13th Week Nominations: బిగ్‌బాస్‌ నామినేషన్లలో 6 గురు.. 13వ వారం డేంజర్ జోన్‌లో ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో దాదాపు ముగింపు దశకు చేరుకొన్నది. ఇప్పటికే ఇంటిలో 12 వారాలు పూర్తి చేసుకొన్న కంటెస్టెంట్లందరూ టైటిల్‌పై ఎవరికి వారు ఆశలు పెంచేసుకొంటున్నారు. ఈ క్రమంలో 12వ వారం ఎలిమినేషన్ తర్వాత అత్యంత కీలకమైన 13వ వారంలోకి ఆట ప్రవేశించింది. ఈ వారంలో ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకొంటే టాప్ 5 లోకి వెళ్లే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. దాంతో ఇంటిలో భారీగా వాగ్వాదాలు, మాటల బాణాలు, ఆధిపత్య పోరాటం ఈ ప్రాసెస్ సందర్భంగా కనిపించిందని తాజా ప్రోమో స్పష్టం చేసింది. 13వ వారంలో ఎవరు నామినేట్ అయ్యారు? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో నుంచి అందరూ ఊహించినట్టుగానే దివ్య ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేషన్ పెద్దగా షాకింగ్ ఇవ్వకపోగా.. అనసవరమైన సౌండ్ సొల్యూషన్ తగ్గిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. దివ్య ఎలిమినేషన్ విషయం పక్కన పెడితే.. ఆ తర్వాత మొదలైన 13వ వారం నామినేషన్ల ప్రక్రియ రంజుగా మొదలైంది.

Bigg Boss 9 Telugu 13th Week Nominations

ప్రస్తుత వారంలో నామినేషన్ల సందర్భంగా టాప్ ఫైట్ జరిగింది. ఎప్పటిలానే సంజనా గల్రానీపై అందరూ కంటెస్టెంట్లు విరుచుకుపడ్డారు. రీతూ చౌదరీ, భరణి, ఇమ్మాన్యుయేల్ కూడా ఆమెను టార్గెట్ చేస్తూ నామినేషన్ ప్రక్రియను కొనసాగించారు. అలాగే రీతూ చౌదరీ, తనూజ మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగిందనే విషయం తాజా ప్రోమోలు వెల్లడిస్తున్నాయి. గత రెండువారాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తమ నామినేషన్ ఆస్త్రాలను సంధించారు.

ఇక 13వ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న వారంటూ కంటెస్టెంట్లు నామినేషన్ల తర్వాత మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండేందుకు నామినేట్ అయి వారిలో భరణి శంకర్, తనూజ, సంజన గల్రానీ, డెమాన్ పవన్, రీతూ చౌదరీ, సుమన్ శెట్టి ఉన్నారు. కల్యాణ్ పడాల కెప్టెన్ కావడతో నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకొన్నాడు. ఇమ్మాన్యుయేల్ ఈ వారం సేఫ్ అయ్యాడు.

13వ వారంలో నామినేషన్ వ్యవహారం క్లిష్టంగా మారింది. నామినేట్ అయిన వారందరూ టాప్ కంటెస్టెంట్లే. ఫైర్ స్ట్రామ్ అంటూ వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీలందరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇంటిలో తొలివారం నుంచి ఆడుతూ తమ ప్రతిభ ద్వారా ఇంటిలో కొనసాగుతున్న వారే.అలాంటి కంటెస్టెంట్లు నామినేషన్లలోకి రావడంపై ఇప్పుడు అందరి చూపు ఈ వారం ఆటపై పడింది. ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు ఇంటిలో ఉండి టాప్ 5కి వెళ్తారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో ఇప్పటి వరకు 12 వారాల్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్, 12వ వారంలో దివ్య ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X