Bigg Boss 9 Telugu 13th Week Voting: బిగ్‌బాస్‌లో 13వ వారం జోరుగా ఓటింగ్.. ఆ ముగ్గురి కథ కంచికేనా?
Bigg Boss 9 Telugu 13th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. గ్రాండ్ ఫినాలే కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుందని భావించినా.. చివరికి బిగ్ బాస్ సింగిల్ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టారు. ఈ క్రమంలో దివ్య ఎలిమినేట్ అయ్యారు. దీంతో మిగతా కంటెస్టెంట్స్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో 13 వారం నామినేషన్స్ ఎలా జరిగాయి? నామినేట్ ఎవరయ్యారు? ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సేఫ్ జోన్‌లో ఎవరు? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? అనే వివరాలు మీ కోసం..
రసవత్తరంగా నామినేషన్స్
13వవారం నామినేషన్స్ కాస్త ఫన్నీగా, కొంచెం ఎమోషనల్‌గా సాగాయి. బిగ్ బాస్ లోని ప్రతి కంటెస్టెంట్..ఇద్దరు కంటెస్టెంట్స్ లను కారణాలు చెప్పి, నామినేట్ చేయాలి. వారిపై బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాలనే నియమం ప్రకటించాడు. ఇమ్మాన్యుయేల్ మొదట రీతూను, రెండో నామినేషన్‌గా డెమోన్‌ను నామినేట్ చేశారు. ఇక భరణి రంగంలోకి దిగి సంజన దుమ్ముదులిపారు. తరువాత డెమోన్‌ను జికల్ స్ట్రాంగ్,మెంటల్ వీక్ అని టార్గెట్ చేశాడు. ఆ తరువాత రీతూ.. సుమన్, సంజనను నామినేట్ చేసింది. ఆ తరువాత ఫ్యామిలీ ట్రీ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చింది. ఇద్దరూ హగ్ చేసుకోవడంతో పాత గొడవకు ఎండ్ కార్డు పడింది.

ఈ సారి నామినేషన్స్ తనూజా ఎమోషన్ అయ్యింది. డిమోన్ పవన్, సంజనలను నామినేట్ చేసింది. ఇక సుమన్ శెట్టి రంగంలోకి దిగి రీతూ, డెమోన్ లను నామినేట్ చేశాడు. ఇక సంజన .. డెమోన్, రీతూ లను నామినేట్ చేసింది. డెమోన్ కూడా సంజనా, తనూజాలను నామినేట్ చేశాడు. కెప్టెన్ కళ్యాణ్ తన స్పెషల్ పవర్ లో భరణిని నామినేట్ చేశాడు. ఇలా సంజన, రీతూ, పవన్, సుమన్, తనూజా, భరణి మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. దీంతో హౌస్ పూర్తిగా హీటెక్కింది.
నామినేషన్స్ ముగిసిన వెంటనే ఆన్‌లైన్ ఓటింగ్ రౌండ్ మొదలైంది. సోషల్ మీడియా, ఫ్యాన్ పేజ్ పోల్స్, అన్ ఆఫీషియల్ ట్రాకర్స్ ప్రకారం ఈ వారం ఓటింగ్ లో తనూజా పుట్టస్వామి దూసుకెళ్తుంది. దాదాపు 30.64 శాతం ఓట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. గత రెండు వారాల్లో ఆమెనే లీడ్‌లో కొనసాగుతోంది. ఈ వారం కళ్యాణ్ నామినేషన్స్‌లో లేకపోవడంతో అతనికి వచ్చే ఓట్లు కూడా తనూజాకే పుడుతున్నట్లు అనిపిస్తోంది. ఇక రెండో స్థానంలో రీతూ చౌదరి 15.32 శాతం ఓట్లతో నిలువగా.. సంజనా గల్రానీ అంత తక్కువేమీ కాదు. ఆమె కూడా 15.19 శాతం ఓట్లతో టాప్ 3లో సేఫ్ జోన్‌లో నిలిచింది. ఫైర్‌బ్రాండ్ నైజం, కాన్ఫిడెంట్ ప్లే, రియాక్టివ్ నేచర్ ఆమెకు ఓటింగ్‌లో ముందు వరుసలో నిలబెట్టాయి.
బిగ్ బాస్ 9 పెద్ద అన్న భరణి ఇటీవల తన గేమ్ స్టైల్ మార్చుకున్నాడు. దీంతో తోటి కంటెస్టెంట్లకు తగ్గట్టు పోటీపడుతున్నారు. ఆయన 13.86 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక డెమోన్ పవన్ 12.58 శాతం ఓటింగ్ 5 వ స్థానంలో నిలిచారు. ఇక సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి ఈసారి ఊహించని స్థాయిలో వెనుకబడ్డాడు. కేవలం 12.41 శాతం ఓట్లు మాత్రమే పొందారు. వాస్తవానికి గత రెండు వారాలు అతనిలో కామెడీ మోడ్ తగ్గడం, ఎపిసోడ్స్‌లో ప్రెజెన్స్ తగ్గడంతో ఓటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్టే కనిపిస్తోంది. ఈ ముగ్గురి మధ్య గ్యాప్ చాలా తక్కువ. ఏ క్షణమైనా ర్యాంక్స్ మారే అవకాశం ఉంది. ఓటింగ్‌కు ఇంకా శుక్రవారం అర్థరాత్రి వరకు సమయం ఉంది. ఈ వారం ఎవరు బయటపడతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











