Bigg Boss 9 Telugu 13th Week Voting: ఓటింగ్‌లో హోరాహోరీ.. డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్..

Bigg Boss 9 Telugu 13th Week Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. అతి త్వరలో ఎండ్ కార్డు పడబోతుంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఒత్తిడి పెరుగుతోంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయమని ఊరించినా.. చివరికి ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ డబుల్ కాదు, సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. ఉత్కంఠగా సాగిన ఓటింగ్ రౌండ్‌లో చివరికి దివ్య నామినేషన్స్ అయింది. ఈ నేపథ్యంలో 13 వారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? సేఫ్ జోన్‌లో ఎవరు? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? అనే వివరాలు మీ కోసం..

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ 13 వ వారం నామినేషన్స్ కాస్త ఫన్నీగానే సాగాయని చెప్పాలి. నామినేషన్స్ టాస్క్‌లో ప్రతి సభ్యుడు ఇద్దరిపై బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ప్రకటించారు. ఇమ్మాన్యుయేల్ మొదట రీతూను "నన్ను బ్యాక్ స్టాబర్ అన్నావ్" అంటూ నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో తనను తీసేయడం హర్ట్ చేశిందని డెమోన్‌ను రెండో నామినేషన్‌గా ఎంచుకున్నాడు. భరణి.. సంజనను "ఫ్రాంక్స్‌లోనే ఉన్నావ్, నా మెడిసిన్ హ్యూమర్ కాదు" అంటూ నామినేట్ చేశాడు. రెండో నామినేషన్ డెమోన్ "ఫిజికల్‌గా స్ట్రాంగ్, మెంటల్‌గా కాదు" అని కామెంట్ చేశారు. రీతూ.. సుమన్, సంజనను నామినేట్ చేసి ఫ్యామిలీ ట్రీ విషయంపై క్లారిటీ ఇచ్చింది. చివరకు ఇద్దరూ హగ్ చేసుకుని గొడవ ముగించారు.

Bigg Boss 9 Telugu 13th Week Voting Thanuja Rithu in top Suman Shetty into danger zone

ఇక తనూజా.. ఇమ్మూని భావోద్వేగాలపై ప్రశ్నించగా ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అయితే తనూజ నామినేషన్‌లో డెమోన్, సంజనను టార్గెట్ చేసింది. సుమన్ "నీ గేమ్ తగ్గింది" అంటూ రీతూను, "రెస్ట్ తీసుకో" అంటూ డెమోన్‌ను నామినేట్ చేశాడు. సంజన.. డెమోన్, రీతూను నామినేట్ చేసింది. డెమోన్.. సంజన, తనూజాలను నామినేట్ చేశారు. ఇక కెప్టెన్ కళ్యాణ్.. భరణి నామినేట్ చేశాడు. ఫైనల్ గా 12 వారం నామినేషన్స్ లో సంజన, రీతూ, పవన్, సుమన్, తనూజా, భరణి నిలిచారు. ఇలా ఆరుగురు నామినేట్ కావడంతో హౌస్ కాస్త హీటెక్కింది.

సేఫ్ జోన్‌లో ఎవరు?
బిగ్ బాస్ 13 వారం నామినేషన్స్ పూర్తి అయిన వెంటనే ఓటింగ్ ప్రారంభమైంది. బీబీ లవర్స్ తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ను కాపాడుకోవడానికి హోరాహోరీగా పోటీపడుతున్నారు. అన్ ఆఫీషియల్ ఓటింగ్, సోషల్ మీడియా ఆన్ లైన్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే.. తనూజా పుట్టస్వామి తుక్కురేగొడుతుంది. దాదాపు 30.37 శాతం ఓటింగ్ తో టాప్ లో నిలిచింది. గత రెండు వారాలుగా ఆమెనే ఓటింగ్ లో లీడ్ లో కొనసాగుతోంది. ఈ వారం కళ్యాణ్ పడాల ఓటింగ్ లో లేకపోవడంతో ఆ ఓట్లు కూడా తనూజకే పడుతున్నాయి. ఇక రెండో స్థానంలో రీతూ చౌదరి 18.94 శాతం ఓట్లతో కొనసాగుతోంది. డేర్ అండ్ డాషింగ్ ప్లేయర్ అయిన రీతూకు ప్రేక్షకులకు నుండి కూడా మంచి సపోర్టు ఉంది. ఇక ఫైర్ బ్రాండ్ సంజనా గల్రానీ కూడా 16.85 శాతం ఓట్లతో టాప్ 3లో స్థానం దక్కించుకుంది.

ఇక బిగ్ బాస్ పెద్దన్న భరణి తన ఆట తీరును మార్చుకున్నారు. ఇతడు 11.51 శాతం ఓటింగ్ తో నాల్గవ స్థానంలో నిలిచారు. ఆటలో స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉన్నప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ లెవెల్ తగ్గినట్లు ఫ్యాన్స్ ఫీల్ చేస్తున్నారు. ఇక డెమోన్ పవన్ 11.48 శాతం ఓట్లతో భరణికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఫిజికల్ స్ట్రాంగ్ అయినా, భావోద్వేగ రియాక్షన్లు ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ గ్యాప్ చాలా తక్కువగా ఉండటంతో ర్యాంకులు ఎప్పుడైనా మారే అవకాశం ఉంది.

ఇక సీనియర్ ఆర్టిస్టు, కామెడీయన్ సుమన్ శెట్టి ఈసారి ఎందుకో వెనకబడ్డారు. ఓటింగ్ లో దూసుకెళ్తే సుమన్ డౌన్ అయ్యారు. అతనికి కేవలం 10.85 శాతం ఓట్లు మాత్రమే రావడం షాక్ కు గురి చేసింది. కామెడీ మోడ్ తగ్గడంతో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వీకైంది. ఓటింగ్ రేసులోకి ప్రేక్షకులు ఎంగేజ్ అవ్వడానికి కంటెంట్ కావాలి, అది సుమన్ నుంచి తగ్గినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎలిమినేషన్‌కు అత్యంత దగ్గరగా ఉన్న పేరు అతడిదే.

తొలి రోజు ఓటింగ్ ట్రెండ్ ప్రకారం..సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. ఇక డెమోన్,భరణి మధ్య ఓటింగ్ గ్యాప్ తక్కువ అయినప్పటికీ, ఇద్దరికీ కంటెంట్-బ్యాకప్ ఉంది. సుమన్ ఏదోక విషయం లో హైలైట్ లేకపోవడం ఎలిమినేషన్ తప్పదు. అయితే.. ఓటింగ్ కు శుక్రవారం అర్థరాత్రి వరకు సమయం ఉంది. కాబట్టి ఓటింగ్ ట్రెండ్స్ మారవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X