Bigg Boss 9 Telugu 13th Week Voting: బిగ్‌బాస్‌ ఓటింగ్ ఉల్టా పల్టా.. ఆ ముగ్గురు మూట ముల్లె సర్దుకోవాల్సిందేనా?

Bigg Boss 9 Telugu 13th Week Voting: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. ఇక టికెట్ టు ఫీనాలే టాస్కులు ప్రారంభం కావడంతో ఈ గేమ్ షో మరింత రసవత్తరంగా మారింది. ఫస్ట్ టికెట్ టు ఫినాలే రేసులో నిలుస్తారు? టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు? రన్నరప్ ఎవరు? అనేది చర్చనీయంగా మారింది. ఇక బిగ్ బాస్ అభిమానుల హంగామా.. ఫ్యాన్ సపోర్టు మామూలుగా లేదు. ఈ క్రమంలో 13 వారం నామినేషన్స్ లో ఎవరున్నారు? ఓటింగ్ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే వివరాలు మీ కోసం..

రసవత్తరంగా నామినేషన్స్
13వవారం నామినేషన్స్ రసవత్తరంగా కొనసాగాయి. ప్రతి కంటెస్టెంట్..ఇద్దరు కంటెస్టెంట్స్ లను కారణాలు చెప్పి,వారిపై బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ప్రకటించారు. హోరాహోరీగా సాగిన నామినేషన్స్ లో సంజన గల్రానీ, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజా పుట్టస్వామి, భరణి శంకర్ ఇలా మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు.ఇలా టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ నిలిచే సరికి హౌస్ లో టెన్షన్ మొదలైంది.

Bigg Boss 9 Telugu 13th Week Voting Trends Thanuja Leads Suman Shetty Pawan in Danger Zone Who Gets Eliminated This Week

నామినేషన్స్ ముగిసిన వెంటనే ఆన్‌లైన్ ఓటింగ్ హోరాహోరీగా సాగుతుంది. సోషల్ మీడియా, ఫ్యాన్ పేజ్ పోల్స్, అన్ ఆఫీషియల్ ట్రాకర్స్ ప్రకారం.. ఈ వారం ఓటింగ్ లో తనూజా పుట్టస్వామి దూసుకెళ్తుంది. దాదాపు 29.31 శాతం ఓట్లతో టాప్ లో నిలిచింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో కళ్యాణ్ లేకపోవడంతో అతనికి వచ్చే ఓట్లు కూడా తనూజాకే పడుతున్నట్లు అనిపిస్తోంది. ఇలా తనూజ తుక్కురేగొడుతుంది. ఇక రీతూ చౌదరి 15.57 శాతం ఓట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

ఇక భరణి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. నిన్నటి వరకు నాలుగో స్థానంలో కొనసాగినా భరణి.. టికెట్ టు ఫినాలే ట్కాస్ లో భాగంగా ఓ ట్కాస్‌లో డిమాన్‌తో పోరాడి గెలిచారు. దీంతో ఆయన ఓటింగ్ అమాంతం పెరిగింది. దీంతో భరణి 14.88 శాతం ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. ఇక నిన్నటి వరకూ మూడో స్థానంలో కొనసాగిన సంజనా టికెట్ టు ఫినాలే రేసులో ఓడిపోయింది. దీంతో సంజన 13.8 శాతం ఓటింగ్ లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక సుమన్ శెట్టి, డిమోన్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. టికెట్ టు ఫినాలే రేసు వైదొలిగారు. రీతూతో పోటీపడి సుమన్ ఓడిపోయాడు. దీంతో 13.25 శాతం ఓటింగ్ తో 5 వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక డిమాన్ పరిస్థితి మరి దారుణంగా మారింది. అతడు చేసే ఏ పని కలసిరావడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో భరణితో టాస్క్ ఆడారు. అయితే.. ఆ టాస్క్ లో డిమోన్ పవన్ తనకు ఇచ్చిన ఫజిల్ ను పూర్తి చేయకపోవడంతో టాస్క్‌లో ఓడి, టికెట్ టు ఫినాలే రేసు నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతని ఓటింగ్ కూడా పడిపోయింది. ప్రస్తుతం 13.19 శాతం ఓటింగ్ తో బాటమ్ లో నిలిచారు. దీని బట్టి చేస్తే.. టికెట్ టు ఫినాలే టాస్క్ బట్టి ఓటింగ్ కూడా మారుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఆన్ లైన్ ఓటింగ్‌ను చూస్తే.. సంజన గల్రానీ, సుమన్ శెట్టి, డిమాన్ పవన్ ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇదే పరిణామం కొనసాగితే.. ఈ ముగ్గురు మూట ముల్లె సర్దుకోవాల్సిందే అనిపిస్తోంది. ముఖ్యంగా సమన్ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు బిగ్ బాస్ విశ్లేషకులు, బీబీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే.. టికెట్ టు ఫినాలే రేసు కొనసాగుతుండటం, ఓటింగ్‌ శుక్రవారం అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. కాబట్టి, పరిస్థితులు ఎలా మారుతాయో? ఈ వారం ఎవరు బయటపడతారో? వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X