Bigg Boss Telugu 14th Week Nominations: 14వ వారం నామినేషన్‌లో ఆరుగురు.. షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. 15 వారాలపాటు సాగే ఈ గేమ్ షో ఫినాలేకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతవారం అంటే 13 వారం ఎలిమినేషన్ తర్వాత ఈ రియాలిటీ షో 14వ వారంలోకి ప్రవేశించింది. ఇంటిలో ఇంకా 7 గురు సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో 14వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ షాకింగ్‌గా జరిగింది. ఈ వారం నామినేట్ అయిన వారు ఎవరు? నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో గత 13 వారాల్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద మనీష్, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్, 8వ వారంలో దివ్వెల మాధురి, 9వ రాము రాథోడ్, శ్రీనివాస సాయి, 10వ వారం గౌరవ్, నిఖిల్, 12వ వారంలో దివ్య నిఖిత, 13వ వారం రీతూ చౌదరీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Telugu 14th Week Nominations

రీతూ చౌదరీ ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో ఫస్ట్ ఫైనలిస్ట్ కల్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, సుమన్ శెట్టి ఉన్నారు. దాంతో 14వ వారం నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. చివరి నామినేషన్ ప్రక్రియలో హోరాహోరీ ఉంటుందని అంతా భావించారు. కంటెస్టెంట్లు కూడా సోమవారం నామినేషన్స్ కోసం తమ అస్త్రాలను సిద్దం చేసుకొన్నారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా బిగ్‌బాస్ గట్టి షాక్ ఇచ్చి నామినేషన్ ప్రక్రియను తనదైన శైలిలో ముగించారు.

ఇంటిలోని మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియ కోసం సిద్దమయ్యారు. అందరూ లైన్‌లో నిలుచొని బిగ్‌బాస్ ఆదేశాల కోసం ఎదురు చూశారు. అంతలోనే ఫస్ట్ ఫైనలిస్ట్ కల్యాణ్ పడాలను మినహాయించి మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లను డైరెక్ట్‌గా నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అందరూ షాక్ గురయ్యారు. కానీ నామినేషన్‌లో ఉన్న వారు ఎలిమినేషన్ తప్పించుకొనే అవకాశం ఉంది. అందుకోసం కొన్ని గేమ్స్, టాస్క్‌లు ఆడాల్సి ఉంటుంది అని ట్విస్ట్ ఇచ్చారు.

బిగ్‌బాస్ తెలుగులో 14వ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి కంటెస్టెంట్లు తమదైన రీతిలో టాస్క్‌లో గెలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన గేమ్స్‌లో ఇమ్మాన్యుయేల్ కొంత మెరుగైన స్థానంలో ఉన్నాడు. దాంతో ఈ వారం నామినేషన్స్ నుంచి బయటకు వచ్చే ఆ ఇద్దరు ఎవరు? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా, ఇంటిలో ఇప్పటి వరకు కెప్టెన్ కాలేకపోయిన భరణి శంకర్‌ను హౌస్‌కు కెప్టెన్ చేశాడు. కానీ ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ లభించదు అని బిగ్‌బాస్ తేల్చేశాడు. ఇంటి వ్యవహారాలను మాత్రమే సవ్యంగా నడిపించడానికి కెప్టెన్‌గా వ్యహరించాల్సి ఉంటుంది అని చెప్పాడు. ఇక ఓ టాస్క్‌లో పాయింట్లు గెలుచుకోలేని సంజనాను జైలుకు పంపించడం 14వ వారంలో హైలెట్ పాయింట్స్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X