Bigg Boss 9th Week Nominations: బిగ్‌బాస్‌లో 9వారం నామినేషన్‌లో ఏడుగురు.. ఎలిమినేషన్ డేంజర్ ఎవరికంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షో 9వ వారంలోకి అడుగుపెట్టింది. గత సీజన్ల కంటే ప్రస్తుతం డిఫరెంట్ ప్యాటర్న్‌తో ట్విస్టులు, టర్నులతో సాగుతున్నది. ఇది చదరంగం కాదు.. రణరంగం అంటూ హోస్ట్ నాగార్జున్ అక్కినేని చెప్పినట్టుగానే కంటెస్టెంట్లు ఇంట్లో వివాదాలు, గొడవలతో హోరెత్తిస్తున్నారు. ఎనిమిదో వారంలో ఎలిమినేషన్ తర్వాత 9వ వారం ఇంటిలో ఉండటానికి అర్హతలేని వారి ఎంచుకోవాలంటూ కంటెస్టెంట్లకు ఓ పరీక్ష పెట్టారు. ఆ టాస్క్‌లో ఈ వారం ఎవరెవరూ నామినేట్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో వారం అనూహ్యంగా, డ్రమాటిక్‌గా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన దివ్వెల మాధురి ఇంటి నుంచి బయటకు వచ్చారు. గౌరవ్ గుప్తా, మాధురి ఎలిమినేషన్‌లో ఉండగా.. తనూజాకు బిగ్‌బాస్ ఓ పవర్ ఇచ్చి మాధురిని సేవ్ చేయగలవా? అని అడిగాడు. దాంతో ఆమె తన పవర్‌ను ఉపయోగించుకోవడానికి ససేమిరా అన్నారు. దాంతో మాధురీ ఎలిమినేట్ అయి.. గౌరవ్ సేఫ్ అయ్యారు.

ప్రస్తుతం సీజన్‌లో ఇప్పటి వరకు 8 వారాల్లో మొత్తం 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వీక్‌లో శ్రష్టి వర్మ, ఆ తర్వాత మర్యాద రామన్న, మూడో వారం ప్రియా శెట్టి, నాలుగో వారం హరిత హరీష్, 5వ వారం ఆశా సైనీ, శ్రీజ దమ్ము, 6వ వారం భరణి శంకర్, 7వ వారం రమ్య పికిల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 8వ వారంలో దివ్వెల మాధురి ఎలిమినేట్ అయ్యారు.
ఆ తర్వాత వెంటనే 9వ వారం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇంటి సభ్యులను వరుసగా నిలబెట్టి..వారి ముందు బొమ్మలను పెట్టి వారి ఫోటోలను అతికించారు. బజర్ మోగగానే.. ఎవరైతే ముందుగా పరుగెత్తి మరొకరి ఫోటో ఉన్న బొమ్మను పట్టుకొని సేఫ్ జోన్‌లోకి వస్తారో.. అలాగే చివరిగా సేఫ్ జోన్‌లోకి చేరుకొంటారో వారు నామినేషన్‌లోకి వస్తారు అని రూల్ చెప్పారు. అలా నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు ఇతరుల బొమ్మను చేజిక్కించుకొని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా భారీగా గొడవ చోటు చేసుకొన్నది.
9వ వారం నామినేషన్‌లో 7 మంది నిలిచారు. ఈ వారం ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారు అంటూ కంటెస్టెంట్లు నామినేట్ చేసిన వారిలో శ్రీనివాస్ సాయి, రాము యాదవ్, సంజన గల్రానీ, తనూజా గౌడ, భరణి శంకర్, సుమన్ శెట్టి, కల్యాణ్ పడాల నామినేట్ అయ్యారు. ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉండటంతో ఈ వారం ఆట మరింత రసవత్తరంగా మారింది. ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











