Bigg Boss 9 Telugu 9 th Week Elimination : బిగ్ బాస్ హౌస్‌లో హై టెన్షన్.. యంగ్ హీరో ఎలిమినేట్ పక్కా..

Bigg Boss 9 Telugu 9th Week Elimination: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) తొమ్మిదవ వారం మరింత రసవత్తరంగా సాగుతోంది. ప్రతి వారం కొత్త ట్విస్టులు, టాస్క్‌లు,గేమ్‌లు, నామినేషన్లలో తలెత్తే తగాదాలతో ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు హౌస్‌లో పలు కాంపిటీషన్లు, డ్రామాటిక్ ఎమోషన్లు చోటు చేసుకోగా, ఈ వారం మాత్రం నామినేషన్ ప్రక్రియ హౌస్ వాతావరణాన్ని హీటెక్కించింది. ఈ తరుణంలో 9వ వారం ఎవరికి ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? ఎవరు డేంజర్‌జోన్‌లో నిలిచారు? అనే విషయంలోకి వెళితే..

ఈ సీజన్ సెలబ్రెటీలు, కామనర్స్ థీమ్స్ తో ప్రారంభమైంది. మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 21 మంది ఈ షోలో పాల్గొన్నారు. వరుసగా ఎలిమినేట్ గా ప్రస్తుతం రీతూ చౌదరి, భరణి, దివ్య నిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్ పడాల, పవన్ డీమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, సాయి శ్రీనివాస్, గౌరవ్ గుప్తా లాంటి కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమదైన వ్యూహాలతో, గేమ్‌ప్లాన్‌లతో ముందుకు సాగుతున్నారు. ఈ వారం బిగ్ బాస్ కొత్త నామినేషన్ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టడంతో హౌస్‌లో చర్చలు, విభేదాలు, అనుమానాలు మరింత రగిలాయి.

Bigg Boss 9 Telugu 9th Week voting Results Thanuja Leads Sai Srinivas will Elimination

ఈ వారం నామినేట్ అయిన వారిలో పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఓటింగ్ ట్రెండ్ చూస్తే, తనూజ పుట్టస్వామి 32.11 శాతం ఓట్లతో టాప్‌లో నిలిచారు. టాస్క్‌లలో దూకుడుగా ఆడటం, భావోద్వేగ క్షణాల్లో ప్రేక్షకులను కదిలించడం ఆమెకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. ఇక రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ పడాల 19.59 శాతం ఓట్లు సాధించారు. గత వారం టాప్‌లో ఉన్నప్పటికీ, ఈసారి స్వల్పంగా వెనుకబడ్డారు. మూడో స్థానంలో సుమన్ శెట్టి 15.02 శాతం ఓట్లు పొందారు. బిగ్ బాస్ ఇచ్చిన రెబల్ సీక్రెట్ టాస్క్‌ను సమర్థంగా పూర్తి చేయడం ఆయనకు ఎక్స్ట్రా పాపురిటీని తెచ్చిపెట్టింది.

ఇక నాలుగో స్థానంలో భరణి 9.96 శాతం ఓట్లు సాధించారు. రీ-ఎంట్రీ తర్వాత ఆయన "నో బాండింగ్, నో కంప్రమైజ్" అటిట్యూడ్‌తో గేమ్‌లో కొత్త వైబ్‌ను తెచ్చారు. ఐదో స్థానంలో సంజన గల్రానీ 9.25 శాతం ఓట్లు పొంది సైలెంట్‌గా కానీ స్ట్రాంగ్‌గా గేమ్ కొనసాగిస్తున్నారు. రాము రాథోడ్ 9 శాతం ఓట్లు పొందగా, చివరగా సాయి శ్రీనివాస్ కేవలం 5.08 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో నిలిచారు.

బిగ్ బాస్ అనాలిస్టుల ప్రకారం.. ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్న సాయి శ్రీనివాస్ బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆయనకు బయట పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం, పీఆర్ సపోర్ట్ తక్కువగా ఉండడం ప్రధాన కారణాలుగా పేర్కొనబడుతున్నాయి.

అయితే ఆయన గేమ్‌ ఫెయిర్‌గా, క్లీన్గా కొనసాగించారు. "నేను పోటీ పడటానికి వచ్చా.. ప్రాధేయపడటానికి రాలేదు" అనే ఆయన మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఓటింగ్‌లో ఫలితం అంతగా అనుకూలంగా లేకపోయింది. అలాగే.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుందా లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే అంశంపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే రాము రాథోడ్ కూడా హౌస్‌ను వీడే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X