నన్ను క్షమించండి.. అందుకే బిగ్‌బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్.. : రాము రాథోడ్

Ramu Rathod apology: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తన సింపుల్ నేచర్, హ్యూమర్, నిజాయితీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కంటెస్టెంట్ సింగర్ రాము రాథోడ్. హౌస్ లో తొమ్మిది వారాల పాటు ఉండి, బిగ్ బాస్ లవర్స్ మదిని గెలుచుకున్న రామ్ రాథోడ్ ఎవ్వరూ ఊహించని విధంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. కుటుంబం గుర్తొచ్చి మానసికంగా ఒత్తిడికి లోనయ్యాననీ, అందుకే తాను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఈ క్షణంలో హోస్ట్ కింగ్ నాగార్జున చెప్పిన వినలేదు. తన నిర్ణయం మీదనే నిలబడ్డారు. అయితే.. షో నుండి బయటికొచ్చిన వెంటనే అభిమానులకు క్షమాపణ చెబుతూ ఒక భావోద్వేగపూరిత వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏమన్నారంటే?

రాము రాథోడ్ వీడియోలో భావోద్వేగంతో మాట్లాడుతూ.. "నన్ను ఎంతగానో ఆదరించిన నా ప్రేక్షకుల దేవుళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్. కానీ, క్షమించండి... ఆ క్షణంలో నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదని నాకు తెలుసు. బిగ్ బాస్ హౌస్‌లో చాలా రోజులు బాధపడ్డాను. చిన్నప్పటి నుంచీ మా కుటుంబంతోనే ఉండి పెరిగాను. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ, నాన్న, పిల్లలు గుర్తొచ్చి, బయటికి రావాల్సి వచ్చింది" అని చెప్పారు.

Bigg Boss 9 Telugu Contestant Ramu Rathod Apologizes to Audience After Self-Elimination

రాము ఇంకా మాట్లాడుతూ "నా ఫ్యామిలీ చాలా పెద్దది. ప్రతి సంతోషం, ప్రతి బాధ వారితోనే పంచుకుంటాను. నేను ఎప్పుడూ కుటుంబం నుంచి దూరంగా లేను. కానీ బిగ్ బాస్ హౌస్‌లో మొదటిసారి వాళ్లందరినీ వదిలి తొమ్మిది వారాలకు పైగా ఉన్నాను. మొదట్లో బాగానే అనిపించినా, తరువాతి రోజుల్లో టెన్షన్ పెరిగింది. ప్రతి రోజు నా అమ్మ, నాన్న, నా పిల్లలు గుర్తొచ్చారు. నేను పెరిగింది ఒక ఆత్మీయ వాతావరణంలో... కానీ బిగ్ బాస్ హౌస్ వాతావరణం నాకు సెట్ కాలేదు. అందుకే బయటికి రావాల్సి వచ్చింది" అని ఎమోషనల్ గా చెప్పారు.

రాము తన అభిమానుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, "మీ అభిమానం లేకపోతే నేను అంతకాలం బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేకపోయేవాణ్ణి. మీరు వేసిన ఓట్లు, ఇచ్చిన ప్రేమే నా బలం. నాగార్జున గారు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. హౌస్‌లో ఉండమని మోటివేట్ చేశారు. నా తోటి కంటెస్టెంట్లు కూడా చాలా ధైర్యం ఇచ్చారు. అయినా నా మనసు నాతో లేదు. నేను బయటికి రావాల్సిందే అనిపించింది." అని పేర్కొన్నారు.

ఇక రాము తన స్వభావం గురించి చెబుతూ "నేను చిన్నప్పటి నుంచి ఎవరితోనూ గొడవ పడలేదు. బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు. కానీ షో రూల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో వాదనలు జరిగాయి. నా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని అనిపించింది. అందుకే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాను." అని తెలిపారు. అదే సమయంలో రాము చెప్పిన ఒక ముఖ్యమైన విషయం.. బిగ్ బాస్ హౌస్‌లో నేను ఎన్నిసార్లు నా మనసులోని బాధను కెమెరా ముందు చెప్పా. కానీ ఆ సన్నివేశాలు టీవీలో ప్రసారం కాలేదు. ప్రేక్షకులు నన్ను చూసి ఎప్పుడూ సంతోషంగా ఉన్నానని అనుకున్నారు. కానీ లోపల చాలా ఒత్తిడి అనుభవించానని చెప్పారు.

రాము తన సహ కంటెస్టెంట్లకు కృతజ్ఞతలు తెలుపుతూ.. "తనుజ, ఇమ్మాన్యుయేల్ నాకు ఈ జర్నీ అంతా అండగా నిలిచారు. ఎప్పుడూ మోటివేట్ చేశారు. 'నిరాశ చెందవద్దు', 'ప్రేక్షకుల కోసం ఉండు' అని ప్రోత్సహించారు. కానీ నా మనసు మాత్రం నా కుటుంబం దగ్గరే ఉంది." అన్నారు. "నాకు బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చిన మాతో టీవీ టీమ్‌కు, నాగార్జున గారికి, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశం అందరికీ దక్కదు. కానీ నేను ఆ అవకాశం వినియోగించుకోలేకపోయా. అందరికీ క్షమాపణలు. మీరు చూపిన ప్రేమను జీవితాంతం మర్చిపోలేను." అని భావోద్వేగంగా అన్నారు.

ప్రస్తుతం రాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన అభిమానులు ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు. ఏదిఏమైనా రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ షోలో ఓ ఎమోషనల్ ట్విట్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X