Bigg Boss 9 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్.. ఇమ్మాన్యుయేల్ నిర్ణయంతో గేమ్ టర్న్..
Bigg Boss 9 Telugu Elimination: బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ చివరి దశలోకి అడుగుపెట్టింది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ కంప్లీట్ కాబోతుంది. ఈ తరుణంలో సంచలన మార్పులు, ఊహించని ట్విస్టులు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. పదకొండో వారం ముగియనున్న తరుణంలో ఆ సారి ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది. ఈ తరుణంలో బిగ్ బాస్ గేమ్ రూల్స్‌ను మార్చేసి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ చోటు చేసుకున్నట్టు, ఇమ్మాన్యుయేల్ సంచలన నిర్ణయంతో గేమ్ స్వరూపమే మారిపోయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
బిగ్ బాస్ 9 తెలుగు 11వ వారం నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. ఆ లిస్ట్ లో కళ్యాణ్ పడాల, భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖితా ఉన్నారు. అభిమానులు తమ ఫేవరెట్స్‌ను సేవ్ చేయడానికి భారీ ఎత్తున్న ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఓటింగ్ ప్రకారం.. శనివారం ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయేల్ సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం ఎపిసోడ్ చివరి వరకూ దివ్య నిఖిత, సంజన గల్రాని డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రేక్షకుల ఓటింగ్ ట్రెండ్ ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు తప్పకుండా బయటకు వెళ్లాల్సిన అవకాశం ఉంది.

అయితే శుక్రవారం ఎపిసోడ్‌లో దివ్య - తనూజ మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రికతకు దారి తీసింది. దాదాపు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఈ ఫైట్ హౌస్‌ను మాత్రమే కాదు, సోషల్ మీడియాను కూడా షేక్ చేసింది. దీంతో బిగ్ బాస్ TRP కూడా ఎప్పుడు లేనంతగా పెరిగాయంట. తాజా ఓటింగ్ ప్రకారం దివ్యను ఎలిమినేట్ చేస్తే.. సీజన్ కు పెద్ద దెబ్బ పడుతుందనీ, ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతుందని బిగ్ బాస్ టీమ్ భావించి, 'నో ఎలిమినేషన్' ప్లాన్ అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా రూల్స్ ప్రకారం 6వ స్థానంలో ఉన్న దివ్య ఎలిమినేట్ కావాల్సింది. అయితే.. దివ్యను కాపాడానికి గేమ్ రూల్స్ చేంజ్ చేశారంట. అభిమానుల అంచనాలనే పూర్తిగా మార్చేశారంట.
డేంజర్ జోన్ లో దివ్య నిఖిత, సంజన గల్రాని ఉండటంతో ఇమ్మాన్యుయేల్ 'పవర్ అస్త్ర' అనేది కీలకంగా మారిందట. ఈ సమయంలో హోస్ట్ నాగార్జున ప్రత్యేకంగా ఇమ్మాన్యుయేల్‌ను ప్రశ్నిస్తూ "పవర్ అస్త్రం ఎవరిని సేవ్ చేయడానికి వినియోగిస్తావు?" అని అడగగా, ఇమ్మూ తడబడకుండా "సంజన కోసమే" అని సమాధానం ఇచ్చాడు. ఈ ఒక్క నిర్ణయంతో అనే లెక్కలన్నీ తలకిందులయ్యాయి. సంజన ఎలిమినేషన్ నుంచి బయటపడడంతో పాటు, దివ్యను కూడా బిగ్ బాస్ సేఫ్ జోన్‌లోకి మార్చేశారని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా ఈ వారం ఎలిమినేషన్ పూర్తిగా రద్దయిందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, దివ్య ఎలిమినేట్ అవుతుందనే నమ్మకంతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో శివాజీ హోస్ట్ చేస్తున్న ఆ ఎపిసోడ్ దివ్య కోసం షూట్ కావాల్సి ఉంది. కానీ ఎపిసోడ్ చివరి నిమిషంలో బీబీ ఆపరేషన్స్ టీమ్ "నో ఎలిమినేషన్ " నిర్ణయం తీసుకోవడంతో ఆ ఇంటర్వ్యూ కూడా నిలిపివేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ గేమ్ రోలర్ కోస్టర్ షాక్ లాగా మారిపోయింది.
ముఖ్యంగా ఇమ్యాన్యుయేల్ తీసుకున్న ఈ 'పవర్ అస్త్ర' నిర్ణయం గేమ్ దిశను పూర్తిగా రీరైట్ చేసినట్లే. ఒకవైపు సంజనను ఎలిమినేషన్ నుంచి రక్షించగా, మరోవైపు దివ్యను కూడా ఎలిమినేషన్ అంచు నుంచి బయటకు లాగి గేమ్‌ను డబుల్ ట్విస్ట్‌లోకి తీసుకెళ్లాడు. ఈ పరిణామాలతో షో కొత్త వైపు మలుపు తిరగబోతున్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ కూడా రెండు గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో ఎవరు సేఫ్? ఎవరు విన్నర్ రేస్‌లో? అనే చర్చలు సాగిస్తున్నారు. మొత్తానికి, బిగ్ బాస్ 9 తెలుగు చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా మారుతోంది.


Click it and Unblock the Notifications











